ScienceAndTech

మిసైల్స్ పరీక్షించిన ఉత్తర కొరియా

Kim Jong Un Doesnt Give A Damn To Trump And His Requests-Tests fresh missiles today

ఉత్త‌ర‌కొరియా ఇవాళ కొన్ని ప్రొజెక్టైల్స్‌ను ప‌రీక్షించింది. ఈ విష‌యాన్ని ద‌క్షిణ కొరియా వెల్ల‌డించింది. ఇటీవ‌ల ప‌లు స్వ‌ల్ప శ్రేణి క్షిప‌ణుల‌ను ఉత్త‌ర కొరియా ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. రాజ‌ధాని ప్యోంగ్యాంగ్ స‌మీపంలో ఉన్న సినో రై ప్రాంతం నుంచి ప్రొజెక్టైల్స్‌ను ప్ర‌యోగించారు. అణు నిరాయుధీక‌ర‌ణ అంశంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో జ‌రిగిన రెండ‌వ ద‌ఫా చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఉత్త‌ర కొరియా క్షిప‌ణి పరీక్ష‌ల వేగాన్ని పెంచింది. ఇటీవ‌ల వ్యూహాత్మ‌క ఆయుధాల‌ను కూడా కిమ్ టీమ్ ప‌రీక్షించింది. ఉత్త‌ర‌కొరియా కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఈ ప‌రీక్ష జ‌రిగింది. ఆ క్షిప‌ణ సుమారు 420 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిన‌ట్లు తెలుస్తోంది.