Business

మారుతీ ఉత్పత్తి తగ్గింది

maruti india reduces/cuts production for third time

ఏప్రిల్‌ నెలలో దాదపు 10శాతం ఉత్పత్తిని తగ్గించినట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గురువారం తెలిపింది. ఈ కంపెనీ వరుసగా ఉత్పత్తిని తగ్గించడం ఇది మూడోసారి. ఇప్పటికే ఫిబ్రవరి,మార్చిలో కూడా కంపెనీ ఉత్పత్తిని తగ్గించింది. ఏప్రిల్‌లో 1,47,669 యూనిట్లను ఉత్పత్తి చేసింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే ఇది 9.6శాతం తక్కువ. ఈ విషయాన్ని మారుతీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. మారుతీ సుజుకీకి ఉన్న గుర్‌గ్రామ్‌, మనెసర్‌ ప్లాంట్లలో ఏటా 15.5లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇక సుజుకీకి మాత్రమే చెందిన హన్సల్పూర్‌ ప్లాంట్‌కు 2.5లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.