Food

మష్రూం నూడుల్స్ చేయడం వచ్చా?

Short easy fast recipe of mushroom noodles in telugu

*** కావలసినవి:
పుట్టగొడుగులు: పావుకిలో, నూడుల్స్‌: పావుకిలో, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి: పది రెబ్బలు, క్రీమ్‌: కప్పు, చీజ్‌ తురుము: 2 టేబుల్‌స్పూన్లు, వెన్న: 3 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, మిరియాలపొడి: అరటీస్పూను

*** తయారుచేసే విధానం
* నూడుల్స్‌ను ఉడికించి నీళ్లు వంపి చన్నీళ్లతో కడగాలి.
* పుట్టగొడుగుల్ని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు సన్నని ముక్కల్లా కోయాలి.
* బాణలిలో టేబుల్‌స్పూను వెన్న వేసి కరిగించాలి. ఉడికించిన నూడుల్స్‌, చిటికెడు ఉప్పు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మిగిలిన వెన్న వేసి ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. పుట్టగొడుగుల ముక్కలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ఉప్పు, మిరియాలపొడి, నూడుల్స్‌, క్రీమ్‌ వేసి కాసేపు ఉడికించాలి. చివరగా తురిమిన చీజ్‌ వేసి ఓ నిమిషం వేయించి దించాలి.