DailyDose

శ్రీకృష్ణుడి జన్మస్థానానికి శ్రీకృష్ణ జ్యుయెలర్స్ అకౌంటెంట్-నేరవార్తలు-05/09

Sree Krishna Jewellers Accountant Arrested And Sent To Chanchalguda Jail

*ఐపీఎల్‌ టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*ఆస్తి పంపకాల వివాదంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూచేపల్లి గ్రామానికి చెందిన రాజప్ప కుమారులు సోమశేఖర్‌ (30), మోహన్‌ (26) చేనేత కార్మికులుగా పనిచేస్తూ గోరంట్లలో నివాసం ఉంటున్నారు.
*కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్న బుకీలపై పోలీసులు దాడులు చేసి రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
* శ్రీ కృష్ణ జ్యుయెలర్స్‌ అకౌంటెంట్‌ వర్ధన్‌చారిని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేసి బుధవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
* ఓ వ్యక్తి మరణానికి బాధ్యుడిగా అనుమానిస్తూ మృతుని సంబంధీకులు చేసిన దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటనిది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామానికి చెందిన గురుమూర్తి (34), మోహన్‌ (35), శివ అనే వ్యక్తులు ఈ ఏడాది జనవరిలో రైలులో తిరుపతికి దైవదర్శనం కోసం వెళ్లారు.
*యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో వరస హత్యల కేసు నిందితుడిగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం రాచకొండ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ‘మహర్షి’ సినిమా ఫ్లెక్సీ కడుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది.
*సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి ఓ అంబులెన్స్‌ దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా అంబులెన్స్‌ మరమ్మతులకు గురికావడంతో ఆసుపత్రి వెనక చెత్త వేసే ప్రాంతంలో దీన్ని నిలిపి ఉంచారు.
*వరుసకు మనవరాలైన బాలికను లోబరుచుకొని గర్భవతిని చేయడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘోర సంఘటన మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*వనపర్తి జిల్లా అమరచింత మండలంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడిన ఘటన నందిమళ్ల క్రాస్‌రోడ్‌ గ్రామంలో జరిగింది.
*వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఇంట్లోని ఆయా గదుల్లోని బీరువాల్లో భద్రపరిచిన సుమారు రూ.30 లక్షల విలువైన సొత్తు మాయమైన ఘటన నారాయణగూడ పోలీసు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
*వివాహ భోజనం విషంగా మారి ముగ్గురు చిన్నారులను కబళించింది. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని కొత్తపల్లి (హెచ్‌) పంచాయతీ పరిధిలోని కొలాంగూడకు చెందిన ముగ్గురు పిల్లలు విషాహారం తిని మృత్యువాతపడగా, మరో 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
*జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 1 మలుపు వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. సైదాబాద్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థి షఫీ తన నలుగురు స్నేహితులతో కలిసి కాఫీ తాగేందుకు లక్డీకాపూల్‌ నుంచి జూబ్లీహిల్స్‌కు కారులో బయలుదేరాడు. షఫీ కారును అజాగ్రత్తతో అతివేగంగా నడిపాడు. జర్నలిస్టు కాలనీ మలుపు బస్టాండ్‌ వద్దకు రాగానే అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకెక్కి అక్కడే ఉన్న విద్యత్‌ స్తంభంపైకి దూసుకెళ్లెంది. స్తంభంపై ఉన్న విద్యుత్‌ తీగలు కారుకు తాకకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో అందులో ఉన్న నలుగురు యువకులు గాయాలతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యుత్‌స్తంభంపైనుంచి కారును కిందకు దించారు.