NRI-NRT

లండన్‌లోని సూపర్‌మార్కెట్‌లో హైదరాబాద్ యువకుడి దారుణహత్య

లండన్‌లోని సూపర్‌మార్కెట్‌లో హైదరాబాద్ యువకుడి దారుణహత్య

లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. లండన్‌లోని టెస్కో సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న హైదరాబాద్‌వాసి నజీరుద్దీన్‌పై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సూపర్‌ మార్కెట్‌లోని సెల్లార్‌లో జరిగిన ఈదాడిలో నజీరుద్దీన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. సహోద్యోగి హత్యచేసినట్లు భావిస్తున్న లండన్‌ పోలీసులు అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లండన్‌ వెళ్లేందుకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ సహకరించాలని నజీరుద్దీన్‌ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. నజీరుద్దీన్‌.. టెస్కో సూపర్‌ మార్కెట్‌లో గత ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు.