Food

పిస్తా హల్వా ప్రయత్నిద్దామా?

Karachi Pista Halwa Short Easy Fast Recipe In Telugu

*** కావలసినవి:
కార్న్‌ఫ్లోర్‌: కప్పు, పంచదార: 2 కప్పులు, మంచినీళ్లు: 3 కప్పులు, నెయ్యి: ఒకటిన్నర కప్పులు, యాలకులపొడి: టీస్పూను, పిస్తాపప్పులు: కప్పు, గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌: చిటికెడు.

*** తయారుచేసే విధానం:
* మందపాటి బాణలిలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి అది కరిగేవరకూ మరిగించాలి.
* విడిగా ఓ గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌ వేసి అందులో కప్పు నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. అందులోనే ఫుడ్‌ కలర్‌ కూడా వేసి బాగా కలపాలి.
* పంచదార పూర్తిగా కరిగాక అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. అది చిక్కగా జెల్లీ మాదిరిగా పారదర్శకంగా అవుతుంది. ఇప్పుడు మంటను మీడియంలో ఉంచి కొంచెంకొంచెంగా నెయ్యి వేస్తూ ఉడికించాలి. హల్వా బాగా ఉడికిన తరవాత నెయ్యి బయటకు వస్తుంటుంది. ఇప్పుడు పిస్తా పప్పుల ముక్కలు వేసి నెయ్యి రాసిన ప్లేటులోకి మిశ్రమాన్ని వంపి కావలసిన ఆకారంలో ముక్కలుగా కోయాలి.