DailyDose

ఇండో-మయన్మార్ సరిహద్దు నుండి బంగారం అక్రమ రవాణా-నేరవార్తలు–05/10

Todays India Crime News - Illegal Gold Smuggling To Chennai From Indo-Myanmar Border Busted

*కర్నూలు నగరంలో నీటి ఎద్దడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుళాయి వద్ద నీరు పట్టుకునే విషయంలో జరిగిన ఘర్షణలో బాలింత ప్రాణాలు కోల్పోయింది.
*నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిలో అవయవదానం కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణ చేపట్టాల్సిన జిల్లా వైద్యాధికారి వరసుందరం సెలవుపై వెళ్లారు. ఆయన సెలవు సమాచారం జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు కూడా తెలియదని సమాచారం. కేసును నీరుగార్చే కుట్రలో భాగంగానే ఇలా చేయించినట్లు ఆరోపణలున్నాయి.
*వేర్వేరుగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇవి చోటుచేసుకున్నాయి.
*తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ పరిధి ఏడీబీ రోడ్డులో గురువారం ఓ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ముందువెళ్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు.
* ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
*మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కిన కుమారుడు, ఆయన్ను రక్షించబోయిన తండ్రి విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం శివారు లీలానగర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
*కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
*కొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. పెళ్లితో ఆనందాలు నిండాల్సిన తరుణంలో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. యువకుడు నడుపుతున్న ద్విచక్ర వాహనం ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని నీరుకుళ్లలో చోటుచేసుకుంది.
*మహారాష్ట్రలోని పుణెలో గురువారం తెల్లవారుజామున ఓ వస్త్రదుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
*ఇండో-మయన్మార్‌ సరిహద్దు ప్రాంతం నుంచి రైలులో చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న 7.9 కిలోల బంగారాన్ని సెంట్రల్‌ రెవెన్యూ ఇంటెలిజట్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పసిడి అక్రమ రవాణాపై సమాచారం అందడంతో అధికారులు చెన్నై ఎగ్మూరు రైల్వే స్టేషన్ లో తనిఖీ నిర్వహించారు. అసోం నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 7.9 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
* అధిక వడ్డీ ఆశచూపి అడ్డగోలుగా డిపాజిట్లు వసూలు చేసిన హీరా గ్రూప్‌ సంస్థల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు పట్టు బిగిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇలా సేకరించిన డిపాజిట్లలో రూ.2 వేల కోట్లు విదేశాలకు మళ్లించినట్లు గుర్తించిన అధికారులు దాన్ని నిగ్గు తేల్చేందుకు హీరా గ్రూప్‌ వ్యవస్థాపకురాలు నౌహీరాషేక్‌ను ప్రశ్నించనున్నారు.
* మూత్రపిండాన్ని విక్రయించిన సొమ్మును ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు.
* మేత కోసం వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని బీరిశెట్టిగూడెం శివారు పంతులు తండాలో గురువారం చోటుచేసుకుంది.
* ఓ పోలీసు నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో నాలుగేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు కాగా ఆమె తండ్రి స్వల్పగాయాలతో బయటపడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని పాతగుట్టలో గురువారం చోటుచేసుకుంది.
*విమానాశ్రయంలో నిఘా అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా, బంగారం అక్రమ తరలింపు ఆగడం లేదు. కడ్డీలు, ఇతర రూపాల్లో పసిడి హైదరాబాద్‌కు వచ్చిపడుతూనే ఉంది. వారం రోజుల వ్యవధిలో మూడు వేర్వేరు సంఘటనల్లో 7 కిలోల బంగారం పట్టుబడింది.
*సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల క్రితం అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలోని శివనగర్‌లో పోలీసులు పాపను గుర్తించారు. శిశువును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్న ఎల్లారెడ్డి పోలీసులు.
* టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు.
*విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం దుబాయ్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు 3కిలోల 300గ్రాముల బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తులలో పెట్టుకొని వచ్చాడు.
* కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
*అధిక వడ్డీ ఆశచూపి అడ్డగోలుగా డిపాజిట్లు వసూలు చేసిన హీరా గ్రూప్‌ సంస్థల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు పట్టు బిగిస్తున్నారు.