ScienceAndTech

166513 ట్విట్టర్ ఖాతాలు రద్దు

Twitter Remove More Than 1Lakh Accounts

ఉగ్రవాదాన్ని, తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించినందుకు గానూ దాదాపు 1.6లక్షల ఖాతాలను తొలగించినట్లు ట్విటర్‌ తాజాగా వెల్లడించింది. 2018 జులై-డిసెంబరు మధ్య 1,66,513 ఖాతాలను రద్దు చేసినట్లు పేర్కొంది. గతంతో పోలిస్తే ట్విటర్‌ను ఉపయోగించే ఉగ్రముఠాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. గతేడాది జనవరి – జూన్‌ కాలంతో పోలిస్తే జులై – డిసెంబరు మధ్య ఉగ్రవాద సంబంధిత ట్వీట్లు 19శాతం తగ్గాయని కంపెనీ లీగల్‌ హెడ్‌ విజయా గడ్డె తన బ్లాగు పోస్టులో తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అమెరికా, జపాన్‌, భారత్‌ సహా పలు దేశాలు ట్విటర్‌ను కోరాయి. దీంతో ట్విటర్‌ చర్యలు చేపట్టింది. గతేడాది రెండో అర్ధభాగంలో 1.6లక్షల ఖాతాలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించింది. ఇదే కాలంలో 4.5లక్షలకు పైగా యునిక్‌ ఖాతాలను కూడా రద్దు చేసింది. ట్విటర్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఈ ఖాతాలను తొలగించింది.