Politics

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

trs mlc candidates list 2019 is here

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రకటించారు. వరంగల్‌కు పార్టీ సీనియర్‌ నేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నపరెడ్డిని బరిలోకి దించాలని సీఎం నిర్ణయించారు. నల్గొండ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు పరిశీలించినా ఆయన శాసనసభ్యుల కోటా స్థానం కావాలని కోరుతున్నందున ప్రత్యామ్నాయంగా తేరా చిన్నపరెడ్డి వైపు కేసీఆర్‌ మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి తెరాస ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు తెరాస నుంచి బయటకు వచ్చిన కొండా మురళీ (వరంగల్‌) ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. దాంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది.