Movies

పోర్చుగల్ టు హైదరాబాద్

Akkineni Nagarjunas Manmadhu2 Updates - Hyderabad Shooting

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఆయన ఇదివరకు చేసిన ‘మన్మథుడు’ చిత్రం స్ఫూర్తితో, యువ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌ నిర్మాతలు. నాగ్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. సమంత, కీర్తిసురేష్‌ కీలక పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ మెరుపు వేగంతో సాగుతోంది. ఇటీవలే పోర్చుగల్‌లోని లిస్బన్‌, పోర్టో సిటీస్‌లో నెలరోజుల పాటు నాయకా నాయికలతోపాటు రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ నెల 21 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవనున్నట్టు సమాచారం. ఝాన్సీ, దేవ దర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌.