ScienceAndTech

ఇది అతిచౌకైన నీటిశుద్ధి యంత్రం

Hyderabadi Duo Makes Water Filter That Converts HardWater To SoftWater

అవసరాలే అలోచనలను సృష్టిస్తాయి. ఆ అలోచనలే ఆవిష్కరణలకు దారి తీస్తాయి. అలాంటి ఒక ఆవిష్కరణనే హార్డ్ వాటర్ ఫిల్టర్. హైదరాబాద్ కు చెందిన ఉదయ్, అతని మిత్రుడు రాజేశ్‌తో కలిసి చేసిన ఈ ఆవిష్కరణ ఇంట్లో హార్డ్ వాటర్ సమస్యను తీరుస్తుంది. బోర్ల నుంచి వచ్చే నీటిని హార్డ్ వాటర్ అంటారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ మినరల్స్‌ను తీసేసిన నీటిని సాఫ్ట్ వాటర్ అంటారు. నగర ప్రాంతాల్లో సరఫరా చేసే తాగునీరు దాదాపుగా సాఫ్ట్ వాటరే అయి వుంటుంది. బోర్ల నుంచి వచ్చే ఈ నీటిని నిత్యావసరాల కోసం వాడుకుంటారు. అయితే ఈ హార్డ్‌వాటర్‌ను ఎక్కువ కాలం వాడడం ద్వారా చర్మవ్యాధులు, దురద వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పాటు బాత్‌రూంలో టైల్స్ చెడిపోయి మరకలు అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక డివైజ్‌ను తయారు చేశాం అని చెపుతున్నారు ఉదయ్. ఉదయ్ ఇంజినీరింగ్ చేశాడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సాధారణంగానే నగరంలో హార్డ్ వాటర్ సమస్య ఎక్కువ. ఇదే సమస్య తానూ ఎదుర్కొన్నాడు. చాలా కాలంగా ఇంట్లో ఈ సమస్యతో సతమతం అవుతుంటే హార్డ్ వాటర్ సొల్యూషన్‌కు ప్యూరీఫైడ్ మెషీన్లు ఉంటాయని తెలుసుకున్నాడు. దాదాపు 30 వేల రూపాయలు ఖరీదు చేసి ఆ మెషీన్ కొనుగోలు చేశాడు.కానీ దాని మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉండేది. తరచూ రిపేర్లు చేయడం, వివిద పదార్థాలు యాడ్ చేయడం, కరంటు, నీటి వృథా ఎక్కువగా ఉండేవి. దీంతో ఆర్నెళ్ల తర్వాత దాన్ని వాడడం మానేయాల్సి వచ్చింది. కానీ సమస్య తీరలేదు. వేల రూపాయలు పెట్టి కొన్న మెషీన్ మూలన పడింది. ఇలాంటి వాటితో ఉపయోగం లేదనుకున్నాడు. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి అనుకున్నాడు. అప్పుడే హార్డ్ వాటర్ సొల్యూషన్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు.. తానే ఒక ప్రొడక్ట్ ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. కెమికల్ ఇంజినీరింగ్‌లో అనుభవం ఉన్న మిత్రుడు రాజేశ్ తో దీని గురించి చర్చించాడు. తక్కువ ఖర్చు, తక్కువ పరిమాణం, ఇద్దరూ కలిసి వివిధ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లలో అధ్యయనం చేశారు. వివిధ దేశాల్లో సాప్ట్ వాటర్ ఎలా ఉంటుంది. దాని కోసం ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు? అనే అంశాలను తెలుసుకున్నారు. సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఆవిష్కరణ పనిలోకి దిగారు. పలు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లలో అధ్యయనం తర్వాత ఈ హార్డ్ వాటర్ ను సాఫ్ట్ వాటర్‌గా తయారు చేయొచ్చని తెలిసి వచ్చింది. శరీరానికి హాని చేయని పలు రసాయనాలతో ఒక పరికరాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత సాఫ్ట్ వాటర్ ఫ్యూరీఫైడ్ డివైజ్ ఆవిష్కరించారు. ఇది నీటిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం లనుతగ్గించి మొత్తం నీటిని సాఫ్ట్ వాటర్‌గా మారుస్తుంది. డివైజ్ గురించి ఉదయ్ మిత్రులు తెలుసుకొని సొంతంగా ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. రోజులు గడిచేకొద్ది వారి ప్రొడక్ట్‌కు గిరాకీ పెరగడంతో ఓ తయారీ కంపెనీని ప్రారంభించారు. హైదరాబాద్ పరిధిలో విక్రయాలు ప్రారంభించారు. కానీ వీరు ఊహించని గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో వీరు ఆన్‌లైన్ వేదికకగా ఈ డివైజ్‌ను అమ్మడం ప్రారంభించారు. www.dcal.co.in డివైజ్‌ను ఆర్డర్ చేయొచ్చనీ, దేశంలో ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నామని ఉదయ్ తెలుపుతున్నాడు. ఉదయ్, రాజేశ్ తయారు చేసిన డివైజ్ తక్కువ పరిమాణం, ఏడు వందల గ్రాముల బరువు ఉంటుంది. దీనికి కరంటుతో పని ఉండదు. నీటి వృథా అసలే ఉండదు. కొనుగోలు చేసి వాటర్ ట్యాంక్‌లో వేస్తే చాలు అటోమేటిక్‌గా హార్డ్‌వాటర్‌లోని మెగ్నీషియం, కాల్షియం శాతాన్ని తగ్గిస్తుంది. సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్‌లో దీన్ని ఉంచాలి అంతే. అందులోని కెమికల్స్ అన్ని పని చేయడం ప్రారంభిస్తాయి. అప్పుడే హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్‌గా తయారవుతుంది. ఈ డివైజ్ కచ్చితంగా ఏడాది కాలం పని చేస్తుందనీ, ధర 3600 ఉంటుందని ఉదయ్ చెప్తున్నాడు.