DailyDose

చరిత్రలో మే15

May 15th today in history - Sir Arthur Cottons Birth Anniversary

? సంఘటనలు ?
1952: భారత లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
2012: టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.

?? జననాలు ??
1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931).
1908: వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
1915: పాల్ సామ్యూల్‌సన్, ప్రముఖ ఆర్థికవేత్త (మ.2009).
1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు
1938: కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది
1964: జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు
1967: మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి .
1968: స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారిగా మరియు మనస్తత్వవేత్తగా పనిచేస్తున్నారు.
1987: రామ్ (నటుడు), తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన ఒక ప్రముఖ నటుడు. తెలుగులో ప్రధానంగా ఇతని సినిమాలు వచ్చాయి

?? మరణాలు ??
1994: ఓం అగర్వాల్, ప్రముఖ భారత స్నూకర్ క్రీడాకారుడు.
2010: భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923)
2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)

?పండుగలు మరియు జాతీయ దినాలు
?_.అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం.