Food

చక్కెర తగ్గిస్తే చక్కగా ఉంటారు

The major reason behind every disease is SUGAR - so stop using it ASAP

మితిమీరి తీపి తింటే అనర్థాలని తెలిసినా… మనసు అటువైపే లాగుతుంది. అలాంటప్పుడే నియంత్రించుకోవాలి. అదెలాగో తెలుసుకుందామా…
* ఒకేసారి తీపి మానేయలేం అనుకుంటే…కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. అంటే కాఫీ, టీలలో రెండు చెంచాల చక్కెర వేసుకునే అలవాటు ఉంటే… ఒక చెంచాకు పరిమితం చేయండి. దీన్ని కొనసాగిస్తూనే ఇంకా తగ్గించుకోవచ్చు.
* వీలైనంతవరకూ ఇంట్లో ఐస్‌క్రీంలు, చాక్లెట్లు, కేక్‌లు లాంటివి ఉంటే తీసేయండి. మొదట్లో ఇది కష్టంగానే అనిపించొచ్చు కానీ… క్రమంగా అలవాటైపోతుంది. ఏదయినా సరే.. ఓ ట్రీట్‌లా తీసుకోండి. కనీసం వారం, పదిరోజులు అలాంటి తీపి పదార్థాలను మానేస్తే… ఓ రోజు చీట్‌మీల్‌ తరహాలో కొద్దిగా తీసుకోవచ్చు. కొందరికి భోజనం చేసిన వెంటనే ఏదో ఒక తీపి పదార్థం తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఓ పండు తీసుకోండి. క్రమంగా తీపి తినాలనే ఇష్టం కూడా తగ్గుతుంది.
* పంచదార వాడేవారు దానికి బదులుగా కొన్ని రోజులు బెల్లం, తేనె వంటివి ఎంచుకోవాలి. అలానే కొన్నింట్లో చక్కెర వినియోగాన్ని తగ్గించి, పండ్ల గుజ్జును వాడుకోవచ్చు. ఇవన్నీ తీపి తినాలనే కోరికను తగ్గిస్తాయి.