Fashion

బుట్టలో బొమ్మలు

You can use plastic bags to arrange kids toys and good interior designing

పిల్లల బొమ్మలు, పుస్తకాలు, టవల్స్‌, మేకప్‌ సామగ్రి… ఇలా కొన్ని వస్తువులు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. అలాంటివి అవసరానికి అందుబాటులో ఉండేలా…లేనప్పుడు సులువుగా సర్దేసేలా ఉండాలి. అందుకోసమే ఈ బుట్టలు. ఎంచక్కా మీకు కావలసిన వరుసల్లో ఈ బుట్టల్ని గోడకు ఏర్పాటు చేసుకుని అందులో వస్తువులు వేసుకుంటే… స్థలం కూడా వృథా కాదు. ఇల్లూ చిందరవందరగా ఉండదు. ఆలోచించండి మరి.