Movies

ఖురేషీ కోపం

Huma Qureshi Angry On A Hindi News Channel Over Gossips

బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ ఓ హిందీ వార్తా ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన భార్య సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. హుమా, సొహైల్‌ ఒకప్పుడు ప్రేమించుకున్నారని టాక్‌. దాంతో ఓ వార్తా ఛానల్‌ దీని గురించి వివరిస్తూ.. ‘స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసేందుకు వచ్చిన సొహైల్‌ దంపతులు, హుమాను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దాంతో హుమా చాలా బాధపడ్డారు’ అని ప్రచురించింది. ఈ ఆర్టికల్‌ కాస్తా హుమా దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఆ ఆర్టికల్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘మీ చెత్త ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాస్తారా? సిగ్గులేకపోతే సరి. నా పేరును చెడగొట్టడానికి మీకెంత ధైర్యం. ఇలా చేసినందుకు నాకు, సొహైల్‌ దంపతులకు క్షమాపణలు చెప్పండి. అసలు మీకు నైతిక విలువలే లేవు. మీలాంటి ఇడియట్స్‌ను నటీనటులు పట్టించుకోరు. దానర్థం మీరంటే మాకు భయమని అనుకుంటున్నారా? అదేంలేదు’ అని మండిపడ్డారు హుమా.