DailyDose

దీని ఖరీదు 778కోట్లు-తాజావార్తలు–05/16

దీని ఖరీదు 778కోట్లు-తాజావార్తలు–05/16-Claude Monet haystack painting fetches USD110.7M at new york auction

*నమ్మాలనిపించట్లేదా..? నమ్మి తీరాల్సిందే. అరె, గడ్డితప్ప ఏముందని దాంట్ల అన్ని పైసలు పెట్టాలె? అంటరా! క్లాడ్ మోనెట్ అనే పెయింటర్ వేశాడట ఈ పెయింటింగ్. అతడు చాలా ఫేమస్ అట. ఫ్రాన్స్ సొంత దేశం. అతడి పెయింటింగ్స్ కొన్ని మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నాయట. మంగళవారం న్యూయార్క్లోని సోథెబీ వేలం సంస్థ దానిని వేలం వేసింది. దానిని పాడుకున్న ఆ మహానుభావుడు ఎవరో తెల్వదుగానీ, 11 కోట్ల డాలర్లు పెట్టేసిండు. మన పైసలల్ల చెప్పాలంటే 778 కోట్ల రూపాయల పైమాటే. ఈ పెయింటింగ్ను ఫ్రాన్స్లోని గివర్నీలో తన ఇంట్లో గీశాడట. అదీ 1890–1891 మధ్య తన ‘ఇంప్రెషనిస్ట్ ఆర్ట్’ను ఇలా చూపించాడట. ఇగ, ఈ పెయింటింగ్ పేరు మ్యూల్స్ అంట. ఆ సిరీస్లో 25 పెయింటింగ్స్ వేస్తే, అందులో ఒకటి ఇది. తన పక్కింటి వ్యక్తి పండించిన పంటను ఒకదగ్గర కుప్ప పెడ్డాట. ఆ కుప్పనే ఇట్ల మ్యూల్స్గా మార్చాడన్నమాట. 1926ల 86 ఏళ్ల వయసులో మోనెట్ చనిపోయాడు. వేలంలో 10 కోట్ల డాలర్ల మార్కు దాటిన ఇంప్రెషనిస్ట్ ఆర్ట్ ఇదేనట. మరి, నెటిజన్లు ఊరుకుంటరా. రెచ్చిపోయిండ్రు. ఏముందిరా బాబు దాంట్ల అంతగనం పైసలు కుమ్మరియ్యడానికి అంటూ ట్వీట్లు చేసేశారు.
* ఆంధ్రా విశ్వ విద్యాలయం నిర్వహించిన ఆసెట్‌, ఈసెట్‌ ఫలితాలను విసి నాగేశ్వరరావు గురువారం ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు.
పరీక్షలు పూర్తయిన అయిదు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం ఓ రికార్డుగా విసి పేర్కొన్నారు. వర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో పిజి కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ రెండు పరీక్షలు నిర్వహించారు.
*మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నిర్వాసితులు పిటిషన్ పై గురువారం విచారించిన ఉన్నత న్యాయస్థానం పరిహారం తీసుకోవాలని వారికీ సూచించింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావొచ్చని పేర్కొంది. ఈమేరకు పరిహారం తీసుకొని చెక్కులను 46 మంది నిర్వాసితులు తరపు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పై దాఖలైన అన్ని పిటిషన్లనూ కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్తేస్ట్ ఆర్.ఎస్. చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యెక ధర్మాసనం స్పష్టం చేసింది. కాళేశ్వరం దాని అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి హైకోర్టులో 175కు పైగా పిటిషన్ లు పెండింగ్ లో ఉన్నాయని వాటన్నింటిని కలిపి విచారించాలని తెలంగాణా ప్రభుత్వ బుధవారం హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే.
*రైలు ప్రయాణాల్లో సబ్సీడి పొందే ప్రయాణీకులకు ఐఆర్సిటీసి ఓ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటి వరకు ఈ సబ్సీడి కావాలంటే తప్పని సరిగా టికెట్ కౌంటర్ల దగ్గరకు వెళ్ళాల్సి ఉండేది. అయితే ఇకపై irctc వెబ్ సైట్ ద్వారా కూడా పొందవచ్చు. 58 ఏళ్ళు పైబడిన మహిళలకు టికెట్ ధరల్లో 50%, 60 ఏళ్ళు పైబడిన పురుషులకు నలభై శాతం రాయితీని అన్ని రకాల ప్రయాణాలలోనూ కలిపిస్తోంది. అయితే ఈ సబ్సిడీ పొందాలనుకునే వారు జర్నీ టైంలో ఏజ్ సర్టిఫికెట్ తప్పకుండా వెంట తీసుకురావాల్సి ఉంటుంది
*ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్‌హాసన్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. తిరుప్పరాన్‌కుంద్రమ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కమల్‌పై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటనలో 11 మంది నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. దేశంలో తొలి ఉగ్రవాది హిందూ అంటూ ఇటీవల కమల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాగా ‘హిందూ తీవ్రవాది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌‌పై తమిళనాడు వ్యాప్తంగా కేసులునమోదయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా మధురైలో హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కమల్‌ బస చేసిన హోటల్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాగా కమల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
* కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి విడుదలైన కృష్ణమ్మ జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయంలోకి చేరుతోంది. బుధవారం ఉదయం నుంచి 2,900 క్యూసెక్కుల నీరు వస్తోందని జూరాల అధికారులు తెలిపారు.
*టీవీ 9 వాటాల వివాదంలో చిక్కుకున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ సైబరాబాద్‌ పోలీసుల నోటీసులకు స్పందించడం లేదు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఆయనపై నమోదైన రెండు కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేశారు.
*మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తులో మితిమీరిన అలసత్వంపై వస్తున్న విమర్శలు అధికారులలో కదలిక తెచ్చాయి. మిగిలిపోయిన కేసులనూ త్వరగా ముగించి అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ 7కేసులలో దాఖలు చేశామని, మిగతా 5 కేసులలోనూ త్వరలోనే దాఖలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
*కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన విజయ్‌ అంతిమయాత్రలో బుధవారం పాల్గొన్న అలంపూర్‌ ఎమ్మెల్యే డా.అబ్రహం పాడె మోశారు (చిత్రంలో కుడివైపు ఉన్న వ్యక్తి). సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి రామాపురం బాధిత కుటుంబాల పరిస్థితిని వివరించి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
*తెలంగాణలోని సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. దాదాపు 3 వేల సీట్ల కోసం 80,445 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని వివరించారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో పొందుపరిచామని వెల్లడించారు.
*రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సబంధించిన దోస్త్‌ ప్రకటనను ఈ నెల 22న వెలువరించాలని రాష్ట్ర ఉన్నత విద్య మండలి నిర్ణయించింది. 23 నుంచి నమోదు ప్రక్రియ, వెబ్‌ ఆప్షన్లు ప్రారంభించాలని బుధవారం నాటి ఉన్నతాధికారుల భేటీలో తీర్మానించారు. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆర్‌.లింబాద్రి, వెంకటరమణ, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌, సుపరిపాలన కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు.
* తెలంగాణలోని సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. దాదాపు 3 వేల సీట్ల కోసం 80,445 మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని వివరించారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో పొందుపరిచామని వెల్లడించారు.
* మిషన్‌ భగీరథ పథకం పనుల పరిశీలనలో భాగంగా, కేంద్ర బృందం బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించింది. కేంద్ర తాగునీటి విభాగం ఉప సలహాదారు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో అధికారులు జడ్చర్ల ప్రాంతం నాగసాల వద్ద నీటిశుద్ధి ప్రక్రియను పరిశీలించారు.
*ఇంజినీరింగ్‌, భద్రతా నిర్వహణ పనుల కారణంగా జూన్‌ 1వ తేదీ వరకు కొన్ని ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకల్ని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేస్తున్నట్లు బుధవారం దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-అజ్ని ప్యాసింజర్‌ 15 నుంచి 31 వరకు, అజ్ని-కాజీపేట ప్యాసింజర్‌ 16 నుంచి జూన్‌ 1 వరకు రద్దయ్యాయి.
*రాష్ట్రంలో మరో 123మందికి ఎస్సైలుగా పదోన్నతులు లభించనున్నాయి. దీంతో ఏఎస్సై నుంచి ఎస్సైలుగా ప్రమోట్‌ అయినవారి సంఖ్య 315కు పెరగనుంది. వీరందరికీ ఈ నెల 20వ తేదీనుంచి అంబర్‌పేట పోలీసు కేంద్రంలో శిక్షణ మొదలవుతోంది. ఇదివరకు 192 మందికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించడం తెలిసిందే. మరో 123 మందికీ పదోన్నతి ఇచ్చేలా డీజీపీ మహేందర్‌రెడ్డి అంగీకరించారని.. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు.
*ఇంజినీరింగ్‌, భద్రతా నిర్వహణ పనుల కారణంగా జూన్‌ 1వ తేదీ వరకు కొన్ని ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకల్ని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దుచేస్తున్నట్లు బుధవారం దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-అజ్ని ప్యాసింజర్‌ 15 నుంచి 31 వరకు, అజ్ని-కాజీపేట ప్యాసింజర్‌ 16 నుంచి జూన్‌ 1 వరకు రద్దయ్యాయి.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలోని శ్రీవర్మిక వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 70 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నిర్వాహకులు కొండపల్లి సాయిగోపాల్‌, సుజాత దంపతులు జంటలకు నూతన వస్త్రాలు, తాళిబొట్టులను అందజేశారు.
*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం(నరేగా)లో భాగంగా రాష్ట్రంలో చేసిన మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు సంబంధించి తొలివిడత చెల్లింపులకుగాను రూ.490.20 కోట్లు విడుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
*గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ నిర్వహించిన చండీ, అయుత మహాసుదర్శన యాగాల విశేషాలను ఆయన వివరించారు. గుంటూరు జిల్లాలోని మాచవరం మండలం మోర్జంపాడులోని బుగ్గ మల్లేశ్వరస్వామి దేవాలయంలో ఐదు రోజులపాటు యాగాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. పూర్ణాహుతి అనంతరం వేద పండితుల నుంచి స్వీకరించిన శేషవస్త్రాన్ని సీఎం చంద్రబాబుకు రాయపాటి ఈ సందర్భంగా అందజేశారు.
*గిరిజన గురుకుల పాఠశాలలను వసతి గృహాలుగా మార్చే ప్రయత్నాన్ని అధికారులు తక్షణం విరమించాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపిరాజు డిమాండ్‌ చేశారు. వాటిని గురుకులాలుగానే కొనసాగించాలని కోరారు.
*రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఈ)సెట్‌కు 11,722 మంది హాజరయ్యారు. ఆన్‌లైన్‌లో రెండు విడతలుగా నిర్వహించారు. మొత్తం 23,215 దరఖాస్తులు వచ్చాయి.
*23 నుంచి 26వ తేదీ వరకు కిర్గిజిస్థాన్‌లో జరిగే షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) దేశాల రెండో మాస్‌మీడియా ఫోరమ్‌ సమావేశాలకు భారత ప్రతినిధిగా..సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రాంత అదనపు డైరెక్టర్‌ టీవీకే రెడ్డిని కేంద్రప్రభుత్వం నామినేట్‌ చేసింది. బిష్కెక్‌ వేదికగా సదస్సును ఆ దేశ సాంస్కృతిక- పర్యాటక శాఖ నిర్వహించనుంది. ఎస్‌సీఓ అభివృద్ధిలో మాస్‌మీడియా పాత్ర అనే అంశంపై చర్చ జరగనుంది.
*రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన డిప్లోమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ కు 11,772 మంది హాజరయ్యారు ఆన్ లిం లో రెండు విడతలుగా నిర్వహించారు. మొత్తం 23,215 దరఖాస్తులు వచ్చాయి.