Politics

ఒళ్లు చిమచిమలాడుతున్నట్లు ఉంది

KTR angry on pragya singh thakur for her comments on gandhi and godse-tnilive

జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యల్ని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించగా.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విటర్‌లో తీవ్రస్థాయిలో స్పందించారు. గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశభక్తుడిగానే ఉంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలైనా ఉండొచ్చు గానీ.. ప్రతిదానికీ హద్దులు ఉంటాయన్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యావత్‌ జాతికి ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు, ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. ఈ అంశంపై ఆమెను వివరణ కోరనున్నట్టు ఆ పార్టీ నేత జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.