NRI-NRT

నేడు గ్రీన్ కార్డులపై శుభవార్త చెప్పనున్న ట్రంప్

Trump to announce update on green cards today at white house-నేడు గ్రీన్ కార్డులపై శుభవార్త చెప్పనున్న ట్రంప్

అమెరికాకు వెళ్లే భారతీయ నిపుణులకు మేలు చేసే కీలక నిర్ణయాలతో వలస విధానాన్ని అగ్రరాజ్యాధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ నేడు ప్రకటించే అవకాశం ఉంది. గ్రీన్‌ కార్డుల జారీలో అమెరికాలో ఉంటున్న వారి కుటుంబీకులకు ప్రాధాన్యమిచ్చే విధానం స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని ట్రంప్‌ ప్రకటిస్తారని అమెరికా అధ్యక్ష భవన వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో ప్రసంగించనున్న ట్రంప్‌.. నూతన వలస విధానంపై ప్రకటన చేస్తారని అధ్యక్ష కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్ ఆలోచన నుంచి ‌ రూపుదిద్దుకున్న ఈ విధానం ప్రకారం అమెరికా సాంకేతిక అవసరాలను తీర్చే వారికే గ్రీన్‌కార్డుల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. కొత్త విధానంలో 100 శాతం గ్రీన్‌ కార్డులు నైపుణ్యం ఆధారంగానే ఇవ్వనున్నారు. అదే జరిగితే భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లేవారు, అక్కడ హెచ్‌1బీ వీసాలపై ఉన్నవారికి త్వరితగతిన గ్రీన్‌కార్డులు లభించే అవకాశం దక్కనుంది.