NRI-NRT

న్యూజీల్యాండ్‌లో బాలికపై కరీంనగర్ వ్యక్తి అత్యాచారం

Karimnagar guy from telangana sentenced to 14 years in prison for raping minor girl in new zealand-tnilive-న్యూజీల్యాండ్‌లో బాలికపై కరీంనగర్ వ్యక్తి అత్యాచారం

బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి న్యూజిలాండ్‌లో కరీంనగర్‌కు చెందిన వ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. కరీంనగర్‌లోని హిందూపురికాలనీకి చెందిన సల్వాజి సీతారామారావు(47) 1995లో న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 16 ఏళ్ల కిందట పదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగగా.. బాధితురాలు రెండేళ్ల కిందట ఫిర్యాదు చేసింది. దీంతో ఆక్లాండ్‌ పోలీసులు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో నిందితుడిగా సీతారామారావును రెండేళ్ల కిందటే అరెస్టు చేశారు. విచారణ, న్యూజిలాండ్‌ జ్యూరీ ముందు వాదోపవాదాల తర్వాత 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి డేన్‌ తాజాగా తీర్పునిచ్చారు. సీతారామారావు తల్లిదండ్రులు కరీంనగర్‌లో ఉంటున్నారు.