DailyDose

ఢిల్లీకి చంద్రబాబు-తాజావార్తలు-05/17

May 17 2019 - Daily Breaking News - Chandrababu returns to Delhi-tnilive-ఢిల్లీకి చంద్రబాబు-తాజావార్తలు-05/17

* గాడ్సేపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం కాలేదని, హిందూ సంఘాలే వాటిని వివాదంగా మార్చాయని ఎంఎన్ఎం, అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు. గాడ్సేపై తాను చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం తనకు లేదని, తనని అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయని కమల్‌ స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకపోవడం వారికే మంచిదన్నారు. అతివాదం అనేది ప్రతి మతంలో ఉంటుందని, ఈ విషయంలో చరిత్రే స్పష్టంగా చెబుతోందని పేర్కొన్నారు.
* రాష్ట్రంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు తెగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లోని కొత్తపల్లి పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు మండలాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. అక్కడక్కడ చెట్లు నేలకొరగటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నంద్యాలలో గాలి, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ధాటికి చెట్టు విరిగిపడి రైల్వే విద్యుత్ తీగ మీద పడింది.
* లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 35 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో 20వేల మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు. పోలింగ్‌ కేంద్రాలు అధికంగా ఉన్న చోట, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. ఈ నెల 23 సాయంత్రం లోపే ఫలితాలు ప్రకటిస్తామని రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు. 17 నియోజకవర్గాలకు మొత్తం మూడు వేల టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది ఉంటారని చెప్పారు.
* గత కొన్నేళ్లుగా అనేక నేరాలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.54.60 లక్షల విలువైన 1258 గ్రాముల బంగారు ఆభరణాలను, 17.2 కిలోల వెండితో పాటు రూ. 9.65 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. మొత్తం ఆరుగురు సభ్యుల ముఠాలో ఇద్దరు ఇప్పటికే జైలులో ఉన్నారని తెలిపారు. ఈ ముఠాలో నాగరాజు నాయక్‌ అనే వ్యక్తిపై ఇప్పటివరకు 140 కేసులు ఉన్నాయని సీపీ చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన పుల్లేటికుర్తి బుజ్జి అనే మరో కరుడుగట్టిన దొంగతో పరిచయం ఏర్పచుకొని 2007 నుంచి నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో దొంతనాలు చేశాడని వివరించారు. పుల్లేటికుర్తి ఉమామహేశ్వరావు (బుజ్జి)పై ఇప్పటివరకు 300కు పైగా కేసులు ఉన్నాయన్నారు.
* సిద్దిపేట జిల్లా కొమురెల్లి మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపులో కాంట్రాక్ట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయంలో పనిచేస్తున్న బూర్గుల కిషన్ చారీ, శ్రీనివాస చారి కలిసి.. లక్ష రూపాయల విలువైన బంగారం తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. హుండీ లెక్కింపు సందర్భంగా.. వీరిద్దరూ రెండు, మూడుసార్లు బయటకు వెళ్లి రావడంతో.. అనుమానంతో తనిఖీలు చేశారు. దీంతో… దాదాపు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణం దొరికింది. కిషన్ చారీ, శ్రీనివాస చారీని.. పోలీసులకు అప్పగించారు ఆలయ అధికారులు.కొమురెల్లి మల్లన్న ఆలయంలో 44 రోజులకు సంబంధించిన హుండీలను గురువారం లెక్కించారు. 24 హుండీల లెక్కింపులో.. 59 లక్షల 25వేల 195 రూపాయలు ఆదాయం వచ్చింది. వీటితో పాటు.. 114 గ్రాముల బంగారం, 7 కిలోల 200గ్రాముల వెండి, 26 విదేశీ కరెన్సీ నోట్లు, 34వేల పాతనోట్లు, 14 క్వింటాళ్ల ఒడిబియ్యం వచ్చాయని అధికారులు చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ ఎస్‌.విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పి.పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు. జులై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.
* ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఎడ్‌సెట్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. 96.75 శాతం మంది అర్హత సాధించారు. 18వ తేది నుంచి ర్యాంక్ కార్డులు డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపారు. జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్ జరగనుందని పేర్కొన్నారు. మ్యాథ్స్‌ లో పి.పల్లవికి మొదటి ర్యాంకు, ఫిజికల్‌ సైన్స్‌లో సాయిచంద్రికకు మొదటి ర్యాంకు, బయాలజీలో మణితేజకు మొదటి ర్యాంకు, ఆంగ్లంలో హరికుమార్‌కు మొదటి ర్యాంకు సాధించారు. 56 సెంటర్లలో ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. 14,019 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,650 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యారు. 11,490 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
*రాజకీయంగా సున్నితమైన బోఫోర్స్ కుంభకోణంలో తదుపరి దర్యాప్తునకు అనుమతించాలంటూ తానూ దాఖలు చేసిన దరఖాస్తును సీబీఐ గురువారం ఉప సంహరించుకుంది. ఈకేసులో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికైతే దరఖాస్తును వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరింది. దరఖాస్తు దారు హోదాలో ఉపసంహరణ అధికారం సీబీఐకి ఉందని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నవీన్ కుమార్ కశ్యప్ చెప్పారు.
*మన రాష్ట్రంలోనూ శ్రీలంక తరహా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని మెరైన్ డీఐజీ సత్తార్ ఖాన్ అన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మెరైన్ పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. మెరైన్ పోలీస్ స్టేషన్ తీరరక్షణ దళం సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్సకారుల గ్రామాల్లో జెట్టీలు నిర్మించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. సముద్రంలో అనుమానితుల కనిపిస్తే మత్సకారుల 1093 నంబర్ కు సమాచారం అందించేలా వారికి అవగాహనా కల్పించాలని ఆదేశించారు. తీర ప్రాంతంలో ఉన్న 21 పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు, అధికారులు హాజరయ్యారు. తీరరక్షణ పై ముద్రించిన బ్రోచర్ ను ఆవిష్కరించి సిబ్బందికి అందించారు.
*అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ప్రాసీక్యుషన్ అనుమతిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ శాఖ కేంద్ర విజిలెన్స్ కమిషన్ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే ఎం చేయాలన్నదాని పై స్పష్టత వచ్చింది. అలాంటి సందర్భాల్లో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వ్యులు జారీ అయ్యాయి. అవినీతి నిరోధక చట్టం-1988లో గత ఏడాది కొన్ని మార్పులు చేసిన నేపద్యంలో కేంద్రం ఈ చర్యను చేపట్టింది.
*లోక్ పాల్ కు చేసే ఫిర్యాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణిత నమూనా పత్రాన్ని రూపొందిస్తోంది. దీన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సిబ్బంది వ్యవహారాల శాఖ అధికారి చెప్పారు.
*రంజాన్ ను పురస్కరించుకుని ప్రభుత్వం ఏటా పంపిణీ చేస్తున్న తోఫాను ఈసారి కూడా యధావిధిగా పంపిణీ చేయాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర మైనార్టీ కమీషన్ చైర్మన్ జియావుద్దీన్ కోరారు. ఆదాయం లేని మసీదుల మరమతులకు నిధులు మంజూరు చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన సచివాలయంలో సిఎస్ ను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. సిఎస్ సానుకూలంగా స్పందించి మసీదుల మరమట్లకు రూ. ఐదు కోట్లు విడుదల చేయాలనీ సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని జియావుద్దేన్ తెలిపారు.
*ఎయిడెడ్ పాటశాలల్లో ఉపాద్యాయుల వివరాలను పంపించాలంటూ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జిల్లా విద్యాధికులు పాటశాల విద్యాశాఖ ఉత్తర్వ్యులు జరీ చేసింది. ఉపాద్యాయ నియామకాల కోసం ఈ సమాచారం పంపించాలంటూ పేర్కొంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాద్యాయులు, మంజూరైన పోస్టులు ఎంతమంది అవసరం, ఎక్కువగా ఉన్నారా? తదితర వివరాలను పంపించాలని ఆదేశించింది? కమిషనరేట్ నుంచి వచ్చిన నమూనాలో వెంటనే పంపించాలని సూచించింది. విద్యార్ధులు, ఉపాద్యాయుల నిష్పతి ఆధారంగా రేషనలైజేషన్ నిర్వహించి, అనంతరం ఉపాద్యాయ పోస్టుల భర్తీని చేపట్టాలని గతంలో నిర్ణయించింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు మళ్ళీ వివరాలు కావాలంటూ అధికారులు కోరడంతో నియామకాల పై చర్చ మొదలైంది.
*పదివేల రూపాయల లోపు బండ్లు ఉన్న అగ్రీగోల్ద్ బాధితులకు చెల్లింపులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చినట్లు అగ్రీగోల్ద్ కస్టమర్స్ ఏజెంట్ల అసోసియేషన్ గౌరవద్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు వెల్లడించారు. సచివాలయ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. పదివేలలోపు బండ్లు ఉండి జిల్లా లీగల్ సర్వీసెస్ వద్ద నమోదైన అగ్రీగోల్ద్ బాధితులకు చెల్లింపులు చేయాలనీ సిఎస్ ను కోరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇందుకోసం రూ. 150 కోట్ల వరకు అవసరం కానున్నట్లు వెల్లడించారు.
*మత్తుమందు సరఫరా చేస్తూ మాదకద్రవ్యాల నిరోధక విభాగం చేతికి చిక్కిన నలుగురిని న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం చంచలగూడ కారాగారానికి తరలించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి తీసుకెళ్తున్న పది కిలోల మత్తు పదార్ధాలను అధికారులు బుధవారం కొంపల్లి వద్ద పట్టుకోవడం తెలిసిందే. మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద అరెస్టయిన నిందితులు శివరామకృష్ణ దక్షిణమూర్తి ప్రసాద్ వర్మ, రంగరాజులను జైలుకు పంపించారు. ఇదే కేసులో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.
* మెట్రో కారిడార్‌-3లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌ను శనివారం ప్రారంభం కానుంది. సాంకేతిక, నిర్మాణ పనుల వల్ల ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్‌. ఈ స్టేషన్‌ రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగోల్‌ – హైటెక్‌సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. అమీర్‌పేట – హైటెక్‌సిటీ మెట్రో మార్గం ఈ ఏడాది మార్చి 20న అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉండగా, ఈ కారిడార్‌ ప్రారంభ సమయంలో ఐదు స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన మాదాపూర్‌, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు స్టేషన్లను వరుసగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
* ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 18న నల్లగొండ జిల్లా మోటకొండూర్‌ మండలంలోని మహాలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు.
* తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జాప్యం కారణంగా ఏపీ ఎంసెట్‌ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌ మార్కుల పున:లెక్కింపు, పరిశీలన అనంతరం ఈనెల 27న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన సుమారు 36,698 మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారని, ఈ నేపథ్యంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.
*టీవీ 9 సంస్థ వాటాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. టీవీ 9 మాతృసంస్థ అసోసియేట్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ కంపెనీ ప్రై.లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌)లో కొత్త యాజమాన్యానికి అడ్డంకులు సృష్టించేందుకు రవిప్రకాశ్‌ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. మమ్మల్ని అడ్డుకునేందుకు రవిప్రకాశ్‌.. సినీనటుడు శివాజీని తెర మీదికి తెచ్చారంటూ కొత్త యాజమాన్యం వాదిస్తోంది.
* కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 19 రోజులైనా కొనడం లేదనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం ఘణపురం గ్రామానికి చెందిన తోటకూరి అక్కులు 8 ఎకరాల్లో వరి పండించారు.
*జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు స్పోర్ట్స్‌ కోటా కింద వచ్చిన 148 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ కమిటీ పరిశీలించి, 97 మంది అర్హులున్నట్లు గుర్తించింది. సచివాలయంలో గురువారం సమావేశమైన సంఘం.. జిల్లాలవారీగా ఆమోదించిన తుది అర్హత జాబితాను కలెక్టర్లకు పంపించాలని తీర్మానించింది.
*ఉపాధ్యాయ కేంద్రంగా ఉన్న ప్రస్తుత విద్యా వ్యవస్థను విద్యార్థి కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) వైస్‌ ఛైర్మన్‌ భూషణ్‌ పట్వర్థన్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నేషనల్‌ అకడమిక్‌ క్రెడిట్స్‌ బ్యాంక్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
*మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ మహానగరం వేదిక కానుంది. దేశంలో తొలిసారిగా వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూడీవో) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పారిశ్రామిక డిజైన్‌ సంస్థలన్నింటినీ ఒకే రూపకల్పనగా వేదికపైకి తెస్తూ, రెండేళ్లకోసారి దీన్ని ఏర్పాటు చేస్తుంటారు.
*చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో పార్లమెంట్‌ స్ట్రీట్‌లో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
* మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ మహానగరం వేదిక కానుంది. దేశంలో తొలిసారిగా వరల్డ్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూడీవో) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పారిశ్రామిక డిజైన్‌ సంస్థలన్నింటినీ ఒకే రూపకల్పనగా వేదికపైకి తెస్తూ, రెండేళ్లకోసారి దీన్ని ఏర్పాటు చేస్తుంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునేలా ‘హ్యూమనైజింగ్‌ డిజైన్‌’ నినాదంతో అక్టోబరు 11,12 తేదీల్లో రెండురోజులపాటు సదస్సు జరుగుతుంది.
*రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి పరీక్ష ఫలితాలను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని సెట్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మొత్తం 443 కేంద్రాల్లో ఏప్రిల్‌ 7న నిర్వహించిన ఈ పరీక్షకు 1.35 లక్షలమంది హాజరయ్యారు. మొత్తం 49,300 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా బీసీ గురుకులాల్లో 20,840 సీట్లను భర్తీ చేయనున్నారు.అన్ని పాఠశాలల్లోనూ జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించడం విదితమే. కానీ గురుకులాల్లో పూర్తిస్థాయిలో తరగతుల ప్రారంభం కొంత ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.
*పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి ప్రాసెసింగ్‌ రుసుం చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తాయని పాలిసెట్‌ కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు https://tspolycet.nic.in వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి, ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సమయాన్ని ఎంచుకోవాలన్నారు. ఆ పత్రాల పరిశీలన శనివారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
*రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో పనిచేస్తున్న ఆయుష్‌ వైద్యులకు వేతనాలు చెల్లించాలని ఆర్‌బీఎస్‌కే ఆయుష్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమార్‌ ఒక ప్రకటనలో కోరారు. ఈ నెలలో ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని, ఉన్నతాధికారులు సైతం చెల్లింపులపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. నిధులు విడుదల చేసి సత్వరమే వైద్యులకు వేతనాలు ఇవ్వాలని కోరారు.
*బీసీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలోని ఏకైక మహిళా డిగ్రీ కళాశాలలో.. మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి విడుదల చేశారు.ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. కౌన్సెలింగ్‌తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.
*అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో ‘సంప్రదాయ ఆహార వంటల పోటీ’ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జీవవైవిధ్య మండలి గురువారం ప్రకటించింది. ‘మా జీవవైవిధ్యం, మా ఆహారం, మన ఆరోగ్యం’ అంశంపై గచ్చిబౌలిలోని నిథమ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌) ఆవరణలో ఉదయం 11 గంటలకు పోటీ మొదలవుతుంది. యువతకు అంతర్‌ కళాశాలల క్విజ్‌, పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయి.
*ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ, సమీకృత కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్‌, ఆఈట్‌ల ఫలితాలను గురువారం వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు విడుదల చేశారు. ఏయూ ప్రవేశాల సంచాలకుల వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు.
*కోస్తాంధ్రలో ఈ నెల 29వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. ఈ నెల 23 వరకు చాలాచోట్ల సాధారణం కన్నా కనీసం 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. రానున్న 6 రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురవొచ్చని తెలిపింది. శుక్ర, శనివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వివరించింది. గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో శుక్రవారంతో పాటు ఈ నెల 20 నుంచి వరుసగా 3 రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
*పదోతరగతి విద్యార్థుల అంతర్గత మార్కులను సక్రమంగా నమోదు చేయని కారణంగా పిల్లల గ్రేడ్‌పాయింట్లు తగ్గిపోయాయని, ఇలాంటి వారికి పాయింట్లు సరిచేసే అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలోని విజయవాడవైపు దారిలో గురువారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేసపరల్లి నుంచి గూడవల్లి జంక్షన్‌ మధ్య ఉన్న రహదారిపై మరమ్మతు పనులు చేస్తున్నారు. దీంతో ఏలూరు వైపు వెళ్లే వాహనాలను గూడవల్లిలో రాంగ్‌రూట్‌లోకి సర్దుబాటుగా మళ్లించారు. ఈ క్రమంలో ఎదురెదురుగా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. త్వరగా వెళ్లాలనే ఉత్సుకతతో ఎవరికి వారు రహదారిని ఆక్రమించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. గంటపాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
*రెండు నెలల క్రితం ఏర్పాటైన లోక్‌పాల్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ గురువారం ప్రారంభమైంది. లోక్‌పాల్‌ మొదటి ఛైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ దీనిని ప్రారంభించారు. ఈ మేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వెబ్‌సైట్‌లో లోక్‌పాల్‌ విధానాలను, పనితీరును పొందుపరచినట్లు తెలిపారు. 2013లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు లోక్‌పాల్‌-లోకాయుక్త చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు అక్రమాలకు పాల్పడితే ఇకపై లోక్‌పాల్‌, లోకాయుక్త పరిధిలో విచారణ జరుగుతుంది. ఇలా త్వరితగతిన విచారణ పూర్తి చేసి, శిక్షలు ఖరారు చేయడం దీని ప్రధాన కర్తవ్యం. ఈ లోక్‌పాల్‌కు కార్యరూపం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం 2019 మార్చి 19న మొదటి లోక్‌పాల్‌ను ఏర్పాటు చేసి జస్టిస్‌ చంద్ర ఘోష్‌ను ఛైర్మన్‌గా నియమించింది. మొదటి ఛైర్మన్‌గా ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమక్షంలో మార్చి 23న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ లోక్‌పాల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను ఎన్‌ఐసీ అభివృద్ధి చేయగా నేడు అందుబాటులోకి వచ్చింది. http://lokpal.gov.in యూఆర్‌ఎల్‌లో ఈ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
*చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్‌ జరిగే అయిదు కేంద్రాల్లో మొత్తం 3,899 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1878 మంది మహిళలు కాగా 2021 మంది పురుషులు. కమ్మపల్లి కేంద్రంలో అత్యధికంగా 1028 మంది ఓటర్లు ఉండగా, వెంకటరామాపురంలో అత్యల్పంగా 377 మంది ఉన్నారు. ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌లో ఈ అయిదు కేంద్రాల పరిధిలో మొత్తం 3,483 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 89.33 శాతం పోలింగ్‌ నమోదైంది.
*మెదక్ కరూర్ వైశ్యా బ్యాంకులో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రికార్డులు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంపై బ్యాంకు అధికారులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది.
*విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలపై నగరంలోని సోమాజిగూడలో గల ఏఈసీసీ గ్లోబల్ సంస్థ కార్యాలయంలో రేపు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ తెలంగాణ, ఏపీ విభాగాధిపతి ఇంతియాజ్ బన్నూరు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ విద్యార్థులకు ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండానే యూకేలో విద్యనభ్యసించవచ్చని, ఇంటర్‌ ఇంగ్లిష్‌లో 60 శాతం మార్కులు ఉంటే సరిపోతుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఒక సంవత్సరం విద్యతో పాటు ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తారని, అర్హతగల విద్యార్థులకు రూ.1.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందచేస్తారన్నారు. రేపు జరిగే ఈ సదస్సుకు యూకే నుంచి వంద సంవత్సరాల పురాతనమైన 15 టాప్ విశ్వవిద్యాలయాకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఇతర వివరాలకు 040-42529999 సంప్రదించాలని కోరారు.
* షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శేఖర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఇంటి బిల్‌కు సంబంధించిన తప్పును సవరించడానికి శేఖర్‌రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వల పన్నిన అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
* జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయ ప్రతిష్ఠాపన పూజల్లో భాగంగా శుక్రవారం కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. మహిళలు భారీగా పాల్గొని సామూహిక కుంకుమార్చన పూజలు, లలిత సహస్రనామ పారాయణం, సర్వదేవతా హోమం, శ్రీచక్రపూజలు నిర్వహించారు. ఈనెల 15న ప్రారంభమైన ప్రతిష్ఠాపన పూజలు 20 వరకు జరగనున్నాయి. నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ బంగారు శివలక్ష్మి దంపతులు ఆలయ గౌరవ అధ్యక్షులు రాజాన సత్యనారాయణ దంపతులతో పాటు వేలాది మంది ఈ పూజల్లో పాల్గొన్నారు.
* అమరావతిశుక్రవారం విజయవాడలోని గురునానక్ కాలనీ ఎన్ ఏ సి కళ్యాణమండపం నందు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శిక్షణఉదయం 10.30 వరకు ఓట్ల లెక్కింపు పై శిక్షణను పవర్ పాయింట్ ద్వారా వివరిస్తున్న ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ హాజరైన 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గం ఆర్వో లు , 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది , అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ, కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్, నెల్లూరు కలక్టర్ ముత్యాల రాజు, ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ , ఈసీఐ అధికారులు అండర్ సెక్రెటరీ మధుసూదన్ గుప్తా, ఐటీ డైరెక్టర్ విఎన్ శూఖ్ల తదితరులు
* కౌంటింగ్ కేంద్రాల లో టేబుల్స్ ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చెప్పట్టే వీడియో కవరేజ్ అంశాలపై స్పష్టమైన సూచనలను చేశారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరుగుతున్నది.వివిపాట్ కౌంటింగ్ కేంద్రం నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ పై వివరాలు తెలియ చేశారు. మొదటగా ఆయా వీవీపాట్ స్లిపులను అభ్యర్థుల వారీగా సాగ్రిగేట్ చేసి, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అభ్యర్థుల వారిగా వివి పాట్ స్లిపులను 25 స్లిపులను ఒక బండిల్ గా సిద్ధం చేసుకోవాలి.ఆర్వో లు ఎన్నికల ఫలితాలు ప్రకటన చేసే ముందు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రకటించాలి. ముందుగా ప్రకటన చేసే సందర్భంలో ఎటువంటి రివార్డులు రావన్న విషయం గుర్తెరగాలని సూచించారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి నిబద్ధతతో, పారదర్శకత తో నిర్వహించి అభ్యర్థులకి నమ్మకం కలుగు చెయ్యవలసి మనపై ఉంది..ఖచ్చితత్వం తో కూడి ఫలితాలు ప్రతిబింబించేలా ఆర్వో లు కౌంటింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహించాలి.ఫలితాలు వెలువడిన సందర్భంలో ఎటువంటి వదంతులకు, వివాదాలకు సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి.