DailyDose

కర్ణాటకలో కోటి స్వాధీనం-నేరవార్తలు–05/17

May 17 2019 - Daily Crime News - 1 crore rupees seized in karnataka-tnilive-కర్ణాటకలో కోటి స్వాధీనం-నేరవార్తలు–05/17

* లండన్‌లో ఓ యువతిని నిత్యం వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న భారత యువకుడికి 29 నెలల జైలు శిక్షతోపాటూ, భారత్‌కు పంపించాలని కోర్టు తీర్పునిచ్చింది. లండన్‌లోని వెంబ్లీలోని ఓ షాప్‌లో పని చేస్తున్న యువతి(20)ని 2017లో భారత్‌కు చెందిన రోహిత్‌ శర్మ(28) మొదటి సారి చూశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అమె నిరాకరించింది. ఇక అప్పటి నుంచి ఆమెను వెంబడించడంతో బాధితురాలు ఏకంగా ఉద్యోగం మానేసి మరో చోట పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కూడా ఆమె పని చేసే చోటును కనిపెట్టి మరీ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలికి రోజుకు 40కిపైగా వివిధ ఫోన్ల నుండి కాల్స్‌ చేసి వేధించేవాడు. బాధితురాలు ఫోన్‌ నెంబర్లను బ్లాక్‌ చేసిన ప్రతిసారి కొత్త ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్స్‌ చేసి వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో 2018ఫిబ్రవరిలో పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో రోహిత్‌కు హారాస్మెంట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అప్పటికీ మారకుండా తరచూ యువతిని వెంబడిస్తూ పని చేసే చోటుకు వెళ్లి గంటల తరబడి చూస్తూ వేధించేవాడు. దీంతో 2018 జూలైలో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి వేధింపులు ప్రారంభించాడు. 2018 నవంబర్‌లో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అతడికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటెలీజెన్స్‌ పోలీసుల సమాచారంతో 2019 ఏప్రిల్‌లో రోహిత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో రోహిత్‌ దోషిగా తేలడంతో యువతిని వెంబడించినందుకు 22 నెలలు, వేధింపులకు పాల్పడినందుకు 6 నెలలు, కోర్టు విచారణకు హాజరు కానందుకు ఒక నెల కలిపి మొత్తం 29 నెలల జైలు శిక్షతోపాటూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు పంపించాలని లండన్‌లోని ఐల్వర్త్‌ క్రౌన్‌ కోర్టు తీర్పు వెలువరించింది.
* కర్ణాటకలోని మంగళూరు పట్టణంలో పోలీసులు రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. కేఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగదును తరలిస్తున్న మంజునాథ్‌(56) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ నగదుకు సంబంధించి మంజునాథ్‌ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. భారీ స్థాయిలో డబ్బును తరలిస్తున్నారని, దీన్ని దొంగిలించేందుకు రౌడీషీటర్లు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇవాళ ఉదయం తనిఖీలు చేసి రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*అమెరికాలో చోటుచేసుకున్న దారుణం
19 ఏళ్ల మార్లేన్‌ ఓచోయో లోపెజ్‌ కనిపించకుండా పోయి నెల రోజులు అవుతుంది. కనిపించకుండా పోయిన నాటికే తను నిండు గర్భవతే కాక ఆమెకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. సరిగ్గా నెల రోజుల క్రితం మార్లేన్‌.. డే కేర్‌ సెంటర్‌లో ఉన్న కుమారున్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఓ రోజు గడిచింది. కానీ మార్లేన్‌ జాడ లేదు. ఈ లోపు డేకేర్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. నిన్నటి నుంచి మార్లేన్‌ కుమారుడు డేకేర్‌ సెంటర్‌లోనే ఉన్నాడని.. అతన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదని తెలిపారు. దాంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ప్రారంభమయ్యింది. కొడుకును తీసుకొస్తానని చెప్పిన మార్లేన్‌ ఎక్కడికి వెళ్లిందో వారికి అర్థం కాలేదు. దాంతో తెలిసిన వారందరికి ఫోన్‌ చేసి.. మార్టేన్‌ గురించి ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. కల్వర్టను ఢీకొట్టిన బస్సు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
* ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ధర్నాకు దిగారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని శుక్రవారం 11-30 గంటలకు మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించారు. ఫలితాల అవకతవకలకు కారణమైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇంటర్ బోర్డ్, గ్లోబరీనా తప్పులతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.విద్యార్థులు, పలు సంఘాల నేతలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు చేరుకోవడంతో.. భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. రెండుచోట్ల బారికేడ్లు ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తున్నారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
* విజయవాడ నగర పోలీస్ కమిషన్ రేట్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దొంగతనాలకు పాల్పడి సవాల్‌ విసురుతున్న భుక్యా నాయక్‌ ముఠాను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం ద్వారా క్రైం బ్రాంచ్‌ పోలీసులు పట్టుకోగలిగారని విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు చెప్పారు.
* చంద్రగిరి ఎన్.ఆర్ కమ్మపల్లిలో 144 సెక్షన్ రాత్రి జరిగిన గొడవలో వైసిపీ, టిడిపి నాయకులకు గాయాలు అర్థ రాత్రి వరకు ఇరు పార్టీ అభ్యర్థులు నాని, చెవిరెడ్డి ని అదుపులో వొంచుకున్న పోలీసులుఎన్.ఆర్ కమ్మపల్లి దళిత వాడలో చెవిరెడ్డి దళితులపై దాడులను ఖండిస్తూ కేసులు నమోదు చేయిస్తున్న చెవిరెడ్డి.
* మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ సమీపంలో, ఆర్టీసీ బస్సు కల్వర్టు కు ఢీకొంది. ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులో సుమారు 60 నుంచి, 70 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
* హజీపూర్ బాలికల హత్య కేసు విచారణ సమగ్రంగా నడుస్తోంది కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నీ సేకరిస్తున్నాం మనీషా,కల్పన హత్య కేసు లోనూ నిందితుడి శ్రీనివాస్ రెడ్డిపై కోర్ట్ కు అన్నీ వివరాలు సమర్పించాంనిందితునికి వైద్య పరీక్షలు మరిన్ని చేయాల్సి ఉంది త్వరితగతిన కేసు దర్యాప్తును చేయాలని భువనగిరి ఏసీపీకి సూచించాంమొత్తం కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించి నల్గొండ జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్ట్ లో ట్రయల్ జరుగుతుందిబాధిత కుటుంబాలకు రాచకొండ పోలీసులు ఎల్లా వేళల భరోసా కల్పిస్తాం
* సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమోఘం హోటల్ లో కుళ్లి పోయిన మటన్ తో బిర్యానీ పెట్టారంటూ…. గొడవకు దిగిన కస్టమర్లు.
* తూ.గోసీతానగరం మండలం జాలిమూడి వద్ద గోదావరి నదిలో పడవలో వెళ్తూ ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయిన నలుగురు యువకులు.ముగ్గురిని రక్షించిన స్థానికులు. ఒకరు గల్లంతు. మరొకరి కోసం గాలిస్తున్న పోలీసులువీరంతా గోకవరం మండలం కొత్తపల్లికి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తింపు.
* కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దళిత మహిళా ఉద్యోగిని పై వేధింపులు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఉద్యోగిని.
* కృష్ణాజిల్లా తప్పిన పెను ప్రమాదం కంచికచర్ల చెరువు కట్ట వద్ద సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సు లారీ ఢీ
ముగ్గురికి గాయాలు. లారీ క్లీనర్ కు తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు లారీ క్లీనర్ ను విజయవాడ ఆసుపత్రికి తరలింపు.తుని నుండి హైదరాబాదుకు వెళుతున్నసాయి కృష్ణ ట్రావెల్స్ బస్సు.నందిగామ నుండి విజయవాడ వెళుతున్న లారీ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
*మక్కల్ నిధి మయ్యం చీఫ్ కమల్ హసన్ నాదూరం గాడ్సే పై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏడో విడత ఎన్నికల్లో అవే వ్యాఖ్యలను ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా చేసుకుని.. ప్రత్యర్ధుల పై విరుచుకుపడుతున్నాయి. గాడ్సే స్వతంత్ర దేశంలో తోలి హిందూ తీవ్రవాదిగా కమల్ వ్యాఖ్యానించగా.. గాంధీని హత్యచేసిన గాడ్సే దేశ భక్తుడని భోపాల్ భాజపా ఎంపీ అభ్యర్ధి ప్రజ్ఞా సింగ్ అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక భాజపా ఎంపీ నళీన్ కుమార్ కాటిల్ వివాదాస్పద ట్విట్ చేశారు.
* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక బుచ్చినెల్లి గ్రామంలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు స్పాట్ లోనే చనిపోగా… మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తిని ప్రదీప్ గా గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కు తరలించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది…మంటలను అదుపులోకి తెచ్చారు.
* నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌, బల్మూరు మండలాల్లో ఇవాళ మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలు వీచాయి. బాణాలలో పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆవు కూడా ప్రాణాలు కోల్పోయింది. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆవు యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
* ఆర్మీ జవాను రోహిత్‌ కుమార్‌ యాదవ్‌ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోపియాన్‌ జిల్లాలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో రోహిత్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో జవాను రోహిత్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం రోహిత్‌ తుదిశ్వాస విడిచారు. సోపియాన్‌ జిల్లాలోని హన్‌దేవ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు నిన్న గాలింపు చర్యలు చేపట్టాయి. వీరి రాకను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులను యావర్‌ అహ్మద్‌దార్‌, షకీల్‌ అహ్మద్‌దార్‌, ఇస్తియాక్‌ భట్‌గా బలగాలు గుర్తించాయి.
* సంగారెడ్డి ప్రాంతంలో పాస్‌పోర్టు లేకుండా అక్రమంగా నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశ్‌ వాసులను పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేశారు. పాస్‌పోర్టు లేకుండా అక్రమంగా భారత్‌లో చొరబడిన ఈ ఐదుగురు.. తప్పుడు పత్రాలతో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురిపై ఫారిన్‌ యాక్ట్‌, చీటింగ్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు. మరో 20 మంది బంగ్లాదేశ్‌ వాసులు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
* కర్ణాటకలోని మంగళూరు పట్టణంలో పోలీసులు రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. కేఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ నగదును తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగదును తరలిస్తున్న మంజునాథ్‌(56) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ నగదుకు సంబంధించి మంజునాథ్‌ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. భారీ స్థాయిలో డబ్బును తరలిస్తున్నారని, దీన్ని దొంగిలించేందుకు రౌడీషీటర్లు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇవాళ ఉదయం తనిఖీలు చేసి రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* కంచకచర్ల మండలంలోని కంచకచర్ల కంచాలమ్మ చెరువుకట్ట వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
* కృష్ణాజిల్లా ఘంటసాల మండలం జీలగలగండి సమీపంలో ఓఎన్జీసీకి చెందిన ఫైరింజన్‌ అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బందరు కోర్టుకు వెళ్తున్న చల్లపల్లి ఎస్ఐ బి.శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఐ విజ్ఞప్తి చేయటంతో ఎన్.హెచ్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు క్రేన్, జేసీబీలను పంపగా వాటి సహాయంతో లోపల ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఫైరింజన్‌ డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
* మెదక్ పట్టణంలోని స్థానిక రామాలయం వద్ద ఉన్న కరూర్‌ వైశ్య బ్యాంకులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్ దగ్ధమయ్యాయి.
*ఎన్నికల సమయంలో తెరవెనుక ఎన్నో చిత్ర..విచిత్రాలు చోటుచేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సినీఫక్కీలో జరిగిన ఓ సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన ఓ పార్టీ అభ్యర్థి తన అనుచరుల ద్వారా ఓ ప్రాంతానికి తరలించిన సొమ్మును ఆగంతుకులు నిఘా పోలీసుల పేరుతో దోచుకున్నారు.
* తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరని..ప్రేమను గెలుపించుకోలేమని భావించిన ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. కర్నూలు జిల్లా డోన్‌ మండలం మల్యాల రైల్వేస్టేషన్‌ దగ్గర రైలు కింద పడి మనోహర్‌(23) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*క్షణికావేశం ఆ కుటుంబంలో ముగ్గురు ప్రాణాలను తీసింది. భర్తతో మనస్పర్థల నేపథ్యంలో ఆ తల్లి తన ఇద్దరు బిడ్డలను కడతేర్చింది. తానూ ఉరి వేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా విజయపురం మండలం శ్రీహరిపురంలో గురువారం చోటుచేసుకుంది.
*మత్తుమందు సరఫరా చేస్తూ మాదకద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ)చేతికి చిక్కిన నలుగురిని న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం చంచల్‌గూడ కారాగారానికి తరలించారు. చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి తీసుకెళుతున్న 10 కిలోల మత్తు పదార్థాలను అధికారులు కొంపల్లి వద్ద పట్టుకోవడం తెలిసిందే. మాదకద్రవ్యాల నిరోధకచట్టం కింద అరెస్టయిన శివరామకృష్ణ, దక్షిణామూర్తి, ప్రసాద్‌ వర్మ, రంగరాజులను జైలుకు పంపించారు.
* ఇసుక లారీల దూకుడుతో పెద్దపల్లి జిల్లాలో ఒక బాలుడు సహా ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ఒకే రోజు జరిగిన వేర్వేరు ఘటనల వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యువాత పడ్డాడు.
*పైవంతెనపై మేట వేసిన ఇసుకను శుభ్రం చేస్తున్న శ్రమజీవులను అతివేగంగా దూసుకొచ్చిన మృత్యుశకటం చిదిమేసింది. సినిమా తరహాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కారు కిందపడి అక్కడికక్కడే ఒకరు, పైవంతెన (ఫ్లైవోవర్‌) పైనుంచి ఎగిరిపడి మృత్యువుతో పోరాడి మరొకరు మృతి చెందగా.. మరో మహిళ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.
* పింఛన్‌ సొమ్ము తెచ్చుకోవడానికి వెళ్లి.. వడదెబ్బకు గురై వృద్ధురాలు మృత్యువాత పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.
*పెళ్లికి ఇరు కుటుంబాల వారూ అంగీకరించరనే అనుమానంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామంలో గురువారం వెలుగు చూసింది.
*ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ అని చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ ఐపీఎస్‌ను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గురువినోద్‌ ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వ్యక్తి అని, తాను ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ అని ప్రచారం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు.
*ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులు చికిత్స చేస్తున్న ఓ మహిళ నోట్లో పేలుడు సంభవించడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ అలీగఢ్‌లోని జేఎన్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో బుధవారం జరిగింది.
*అమరావతిలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కారు బోల్తా పడింది. అమరావతి నుంచి ఉండవల్లి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ రహదారి మార్గంలో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.
* గుప్తనిధుల అన్వేషణ ప్రాణాంతకంగా మారింది. ఇందులో ఒక బ్యాంకు ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మరణించగా, మరొకరు అడవిలో గల్లంతయ్యారు. వారితో పాటు వెళ్లిన మరొక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
* పాతటైర్ల కొనుగోలు విషయంలో మామ అల్లుడి మధ్య జరిగిన దాడి ఘటనలో అల్లుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.