DailyDose

స్టాలిన్‌ను రమ్మన్న సోనియా-రాజకీయం-05/17

May 17 2019 - Daily Political News - Sonia Calls Stalin To Delhi-tnilive-స్టాలిన్‌ను రమ్మన్న సోనియా-రాజకీయం-05/17

* ఎన్నికల ఫలితాల రోజున ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల భేటీకి రావాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు పిలుపు వచ్చింది. స్వయంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు సోనియాగాంధీ ఈ ఆహ్వానాన్ని స్టాలిన్‌కు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆ రోజున జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందామన్నట్టుగా స్టాలి¯Œన్‌ దృష్టికి సోనియాగాంధీ తీసుకొచ్చి నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో వేలూరు మినహా తక్కిన 38 లోక్‌సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకేకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా సర్వేలు మొదటి నుంచి పేర్కొంటున్నాయి. లోక్‌సభలో డీఎంకే కూటమి అధిక స్థానాల్లో పాగా వేయడం ఖాయం అన్న ధీమా నేతల్లో నెలకొంది. ›ప్రధానంగా డీఎంకే పోటీ చేసిన 20 స్థానాల్లో, ఆ పార్టీ చిహ్నంతో పోటీ చేసిన మరో నాలుగు స్థానాల్లో మెజారిటీ సీట్లలో గెలుపు ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. అలాగే, కాంగ్రెస్‌ పోటీ చేసిన పది స్థానాలు కనీసం ఐదు గ్యారంటీ అన్న సంకేతాలు జోరందుకుని ఉన్నాయి. అలాగే, ఉప ఎన్నికల్లో డీఎంకే క్లీన్‌స్వీప్‌ చేసినా చేయవచ్చన్న ప్రచారం జోరందుకుని ఉండడంతో అన్నాడీఎంకే పాలకుల్లో ఉత్కంఠ బయలుదేరింది.
*సీఎస్‌ని కలిసిన టీడీపీ నేతలు
చంద్రగిరి రీపోలింగ్ అంశం ఏపీని కుదిపేస్తోంది. తాము చేసిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదులపై వెంటనే ఈసీ స్పందిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నేడు ఏపీ సచివాలయంలో టీడీపీ నేతలు సీఎస్‌ను కలిశారు. నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీ-పోలింగ్‌కు టీడీపీ డిమాండ్ చేసింది.
* రీపోలింగ్ నిర్వహించాలని సిఎస్ కు మరోసారి వినతిపత్రం ఇచ్చిన తెలుగుదేశం మంత్రులు
శుక్రవారం సచివాలయంలో సి ఎస్ ను కలిసిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, జవహర్, కొల్లు రవీంద్ర రీపోలింగ్ కు సంబంధించి వినతిపత్రం అందజేశారు.గతంలో 9 నియోజకవర్గాల పరిధిలో 41 బూత్ లలో రీపోలింగ్ జరపాలని మేము రినప్పటికీ దానిపై స్పందించని ఎలక్షన్ కమిషన్ పోలింగ్ పూర్తయిన అనంతరం కూడా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా సి ఎస్ ఇచ్చిన నివేదికను అనుసరించి రీపోలింగ్ నిర్వహించేందుకు ఆదేశించామని సిఇసి చెబుతున్నదని అందువలన గతంలో మేము ఇచ్చిన వినతిపత్రం పరిశీలించి ఆ బూతులలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ మరోసారి వినతిపత్రం ఇచ్చామని మంత్రులు తెలిపారు. ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్ బోండా ఉమామహేశ్వర రావు ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న బచ్చుల అర్జునుడు తదితరులు ఉన్నారు.
* ఈసీ పాత్ర‌పై అనుమానాలు : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల సంఘం పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని రాహుల్ అన్నారు. అనేక అంశాల‌పై నాతో చ‌ర్చించేందుకు మోదీ ఎందుకు సిద్ధంకాలేద‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోదీ మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డం అసాధార‌ణ విష‌య‌మ‌ని తెలిపారు. రాఫెల్ అంశంపై చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్నా ఎందుకు రాలేదు అని ఆయ‌న అడిగారు. మోదీ, బీజేపీ వ‌ద్ద లెక్క‌లేనంత డ‌బ్బు ఉన్న‌ద‌ని, వాళ్లు మార్కెటింగ్ కూడా ఎక్కువే చేశార‌న్నారు. మా క‌న్నా బీజేపీ ఎక్కువ ప్ర‌చారం చేసింద‌ని, అది సుమారు 1-20 శాతం తేడాతో ఉన్న‌ద‌ని, కానీ మా ద‌గ్గ‌ర కేవ‌లం స‌త్యం మాత్ర‌మే ఉంద‌ని, స‌త్య‌మే విజ‌యం సాధిస్తుంద‌ని రాహుల్ అన్నారు.
* సీఈసీతో చంద్రబాబు భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) సునీల్ అరోడాతో తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్‌ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రీపోలింగ్‌కు సీఈసీ ఆదేశాల వెనుక కారణాలేంటి? రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చేముందు ఆయే అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఎన్నికలు పూర్తైన చాలా రోజుల తర్వాత సీఈసీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయాన్ని ఆయన లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.
*ఎంపీ గుత్తాపై కోమటిరెడ్డి ఫైర్
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను విమర్శించే నైతిక హక్కు గుత్తాకు లేదన్నారు. కేసీఆర్ ఇస్తున్న షాక్స్‌తో గుత్తాకు మతిభ్రమించిందని ధ్వజమెత్తారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్లేనని పేర్కొన్నారు. మంత్రి పదవి కాదు కదా… కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా రాదేమోనన్నారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టంచేశారు.
*ఈసీతో మాట్లాడుకుని సీఎస్‌కు వైసీపీ ఫిర్యాదు – నక్కా ఆనంద్‌బాబు
ఏపీలో ఏడు నియోజకవర్గాల పరిధిలో… 19 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని గతంలోనే ఈసీని కోరినట్టు టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. నేడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుకుని.. సీఎస్‌కు వైసీపీ ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. దశలవారీగా రీపోలింగ్‌ జరిపిన సందర్భాలు లేవని.. మా విజ్ఞప్తిని కూడా సీఈసీకి పంపాలని సీఎస్‌ను కోరినట్టు తెలిపారు. కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి తమ విజ్ఞప్తిని కూడా పరిశీలించాలని ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు.
*ఈసీ అమ్ముడుపోయింది
పశ్చిమ బెంగాల్‌లో ప్రచారాన్ని ఒక రోజు ముందుగా ముగించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గురువారం పలు చోట్ల జరిగిన ప్రచార సభల్లో ఆమె ప్రసంగిస్తూ ‘‘ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ అది భాజపాకు అమ్ముడుపోయినట్టు కనిపిస్తోంది. ఇలా అన్నందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే’’ అని వ్యాఖ్యానించారు.
* మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడువైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు .తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోందినివాళులర్పించిన వారిలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా తో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారుపెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ఘాటు ప్రాంగణానికి తరలివచ్చి జగన్ ..జగన్.. అంటూ నినాదాలు చేశారు .
*భవిష్యత్తులో ఆదుకునేది అణు విద్యుత్తే
దేశంలో పెరుగుతున్న విద్యుత్తు అవసరాలను అణు విద్యుత్తే తీరుస్తుందని, ఈ ప్రక్రియ కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ అణు ఖనిజ అన్వేషణ, పరిశోధన సంచాలక (ఏఎండీ) సంస్థ 70 వసంతాల ఉత్సవాలను హైదరాబాద్‌లోని కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు ఏడు దశాబ్దాల స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై భారత్‌లో అణుశక్తి అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అణుశక్తి విశ్వసనీయమైనది, సురక్షితమని తెలిపారు. వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణలో ఏఎండీ కృషిని ప్రశంసించారు.
*బేరసారాలకు అవకాశమిచ్చేలా ఈసీ తీరు
పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల్లోనే జడ్పీ ఛైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష( ఎంపీపీ) ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత జడ్పీ ఛైర్మన్‌, ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపడతామని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి పేర్కొనడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇలా చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతోపాటు బేరసారాలకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు.
*గాడ్సే గొప్ప దేశభక్తుడు- ప్రజ్ఞాసింగ్‌
భోపాల్‌ లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున పోటీ చేస్తున్న ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడని కితాబిచ్చారు. దేవస్‌ లోక్‌సభ పరిధిలోని అగర్‌ మల్వాలో నిర్వహించిన రోడ్‌షోలో ఓ న్యూస్‌ఛానల్‌తో ఆమె మాట్లాడారు. ‘‘నాథూరాం గాడ్సే గొప్ప దేశ భక్తుడు. అతన్ని ఉగ్రవాది అనేవాళ్లు పునరాలోచించుకోవాలి. ఈ ఎన్నికల్లో అలాంటివారికి దీటైన జవాబు చెప్పాలి’’ అన్నారు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది హిందువే’’ అన్న కమల్‌హాసన్‌ వ్యాఖ్యపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించిన విలేకరికి ఠాకుర్‌ పైమేరకు జవాబిచ్చారు.
*ఫలితాలొచ్చినా రీపోలింగ్‌ అంటారేమో.
త్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో మే 19న రీపోలింగ్‌ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయంపై తెదేపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈసీ వైఖరి చూస్తుంటే ఫలితాలు వచ్చాక కూడా వైకాపా ఫిర్యాదు చేస్తే రీపోలింగ్‌ నిర్వహించేలా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు.
*భాజపా ఎంపీ అభ్యర్థి వ్యాఖ్యలు గర్హనీయం- కేటీఆర్‌
రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతపరంగా ఎన్ని వైరుధ్యాలున్నా, ఏ పరిస్థితిలోనూ అవి హద్దులు దాటకూడదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హితవు పలికారు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రాణాలను హరించిన నాథూరాం గాడ్సేను ‘దేశభక్తుడు’గా కీర్తించిన భాజపా ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ దేశప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అటువంటి వ్యాఖ్యలు హేయం, గర్హనీయమంటూ ఆయన ఒక ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
*హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం- ఉత్తమ్‌
రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్‌ యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ… కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్వాసితులకు చట్ట ప్రకారం అందించాల్సిన నష్టపరిహారం చెల్లించాలని చేపట్టిన ఆందోళనకు, ఆత్మహత్యకు యత్నించిన కనకయ్య అనే రైతుకు మద్దతుగా నర్సారెడ్డి నిరాహార దీక్ష చేస్తూ అండగా నిలిచారన్నారు.
*ఎన్నికల సంఘానివి ద్వంద్వ నియమాలు- స్టాలిన్‌
ఎన్నికల కమిషన్‌ ద్వంద్వ నియమాలు అమలు చేస్తోందని, అధికారపక్షంతో ఒకలా, విపక్షాలతో మరోలా వ్యవహరిస్తోందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, వాటిని సాకుగా చూపి ఎన్నికల ప్రచారాన్ని ఈసీ కుదించడంపై ఆయన మండిపడ్డారు. ఈసీ చర్యలను ఖండిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. భాజపాపైనా విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని పెరియార్‌ విగ్రహం, పశ్చిమ బెంగాల్‌లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం విషయంలోనూ రెండు రకాలుగా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు.
*కాంగ్రెస్‌ది అవకాశవాదం- దత్తాత్రేయ
కాంగ్రెస్‌ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని, నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కాకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆరోపించారు. భాజపా సొంతంగా మెజార్టీ సాధిస్తుందని, మోదీ మరోసారి ప్రధాని కావడం తథ్యమని గురువారం ఓ ప్రకటనలో ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 80-100కి మించి లోక్‌సభ సీట్లు రావన్నారు.
*రాహుల్‌ ప్రధాని కావడమే మాకు ముఖ్యం
తెరాస మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే.. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారం కంటే దేశ అభివృద్ది కోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడమే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. గురువారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
*భాజపా, వైకాపాకు తొత్తుగా ఈసీ- యామినీశర్మ
కేంద్ర ఎన్నికల సంఘం భాజపా, వైకాపాలకు తొత్తుగా మారిందని తెదేపా అధికార ప్రతినిధి యామినీశర్మ విమర్శించారు. తెదేపా ఫిర్యాదులను పట్టించుకోకుండా వైకాపా ఫిర్యాదు చేసిన వెంటనే చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశించడం ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి మరోసారి వెల్లడైందని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిగిన నెల తర్వాత రీపోలింగ్‌ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
*సోనియా మీటింగ్‌పై సమాచారం లేదు
యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ నెల 23వ తేదీన ఎన్డీయేతర పక్షాలతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని తెదేపా సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. ఆరోజు సమావేశానికి హాజరుకావాలంటూ ఆమె వివిధ పార్టీలకు ఆహ్వానాలు పంపారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని తెలిపారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌తో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని స్పష్టంచేసినట్లు వెల్లడించారు. ప్రతిపక్షాల సమావేశం తేదీపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అందరితో మాట్లాడిన తర్వాతే దీనిపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని కంభంపాటి పేర్కొన్నారు.
*25న వైకాపా శాసనసభాపక్ష భేటీ
వైకాపా శాసనసభాపక్ష సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 23న ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమైతే దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది అవుతుందని భేటీని 25న నిర్వహించాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. తాడేపల్లిలోని వైకాపా అధ్యక్షుడు జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగవచ్చని తెలిసింది.