Politics

పాకిస్థానీ విలేఖరి విదేశీ పత్రికకు రాస్తే….

Modi responds to time magazine article on him titled indias separator divisor-tnilive-telugu news international telugu news latest political news in telugu-modi-పాకిస్థానీ విలేఖరి విదేశీ పత్రికకు రాస్తే....

‘భారత విభజనాధికారి’ అనే శీర్షికన కొద్ది రోజుల క్రితం టైమ్ మ్యాగజైన్‌ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దానిపై శుక్రవారం మోదీ స్పందించారు. ‘టైమ్ మ్యాగజైన్‌ విదేశీ పత్రిక. దానిలో కథనం రాసిన వ్యక్తి పాకిస్థానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏంటో చెప్పడానికి’ అని మోదీ వ్యాఖ్యానించారు. మ్యాగజైన్‌లో కవర్‌ స్టోరీని ఆతిష్ తసీర్‌ రాశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గతంలో కంటే ఎక్కువ విభజనకు గురవుతోంది’ అని పేర్కొన్నారు. దానిలో మూక దాడులు, యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ ముఖ్యమంత్రిగా నియమించడం, మాలేగావ్ పేలుడు నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ ఇవ్వడం వంటి పలు అంశాలను వివరించారు. దాంతో పాటు ఆ మ్యాగజైన్‌ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మీద విమర్శలు చేసింది. వంశపారంపర్య రాజకీయాలు తప్ప ఆ పార్టీ చేసేదేమి లేదని, రాహుల్ గాంధీని అధ్యాపకుడి లేని విద్యార్థిగా వర్ణించింది. అయితే మరో కథనంలో మాత్రం ‘ఆర్థిక సంస్కరణలకు మోదీ ఒక ఆశాదీపం’ అంటూ ప్రశంసించింది. విభజనాధికారి అంటూ మోదీపై చేసిన విమర్శల మీద భాజపా తీవ్రంగా మండిపడింది.