WorldWonders

స్వలింగ సంపర్కులకు తైవాన్ ఓకే

taiwan legalizes approves gay and lesbian weddings and policy - tnilive - స్వలింగ సంపర్కులకు తైవాన్ ఓకే

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహానికి తైవాన్ ఓకే చెప్పేసింది. సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మొద‌టి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. శుక్ర‌వారం పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. స్వ‌లింగ సంస‌ర్కులు వివాహం చేసుకోవ‌డానికి చ‌ట్ట‌ప‌ర‌మైన అనుమ‌తి ఇస్తూ 2017లో రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. ర్ల‌మెంట్‌కు రెండేళ్ల డెడ్‌లైన్ విధించారు. ఈనెల 24వ తేదీలోగా పార్ల‌మెంట్‌లో బిల్లు పాస్ కావాల్సి ఉంది. ఇవాళ పార్ల‌మెంట్ స‌మావేశం సంద‌ర్భంగా రాజ‌ధాని తైపీలో వేలాది మంది గే రైట్ మ‌ద్ద‌తుదారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. సంతోషంతో భారీ నినాదాలు చేశారు.