NRI-NRT

మలేషియా బందీఖానాలో విశాఖ యువత

visakhapatnam vizag telugu youth jailed in malaysia over fake documents-tnilive-మలేషియా బందీఖానాలో విశాఖ యువత

ట్రావెల్‌ ఏజెంట్‌ మోసంతో బతుకుదెరువు కోసం మలేషియా వెళ్లి అక్కడ బంధీలయ్యారు విశాఖ యువకులు. తినడానికి తిండిలేక, స్వదేశానికి రావడానికి డబ్బుల్లేక దేశం కాని దేశంలో నరకం అనుభవిస్తున్నారు. కొడుకుల బాధలు చూడలేక వారి తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.బుచ్చయ్యపేట మండలం రాజాం కు చెందిన మరిశా వెంకు నాయుడు, మహేశ్‌, గిరీశ్‌, శ్రీనివాసులు ఉపాధి కోసం మలేషియా వెళ్లారు. ట్రావెల్‌ ఏజెంట్ కర్రి శ్రీనివాసులుకు రూ. 60 వేల చొప్పున చెల్లించారు. 2018 ఆగస్ట్ 28న టూరిస్ట్‌ వీసాలపై మలేషియా పంపించాడు. నెల రోజులు పని చేశాక వారికి కష్టాలు ఎక్కువయ్యాయి. మలేషియాలో ఈ నలుగురిని ఒక్క గదిలో బంధించారు. ఇండియాకు వెళ్లకుండా పాస్‌ పోర్టులు చింపేసారు. తమ బాధలను భారత్‌లో ఉన్న స్వదేశీ తల్లిదండ్రులకు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యారు నలుగురు యువకులు. తమ కొడుకులను ఎలాగైనా స్వదేశానికి తీసుకు రావాలని కోరుతున్నారు యువకుల తల్లిదండ్రులు.