Movies

దుస్తుల్లేని తన చిత్రాలు చూసి…

Aditi Rao Hydari Scared Of Her Nudes On Google Photos Search-tnilive-telugu movie news latest

గూగుల్‌లో తన ఫొటోలు చూసి షాకయ్యానని అంటున్నారు బాలీవుడ్‌ నటి అదితి రావు హైదరి. ఓ చాట్‌ షోలో పాల్గొన్న అదితి ఈ విషయాన్ని వెల్లడించారు. 2011లో వచ్చిన ‘యే సాలీ జిందగీ’ అనే చిత్రంతో అదితి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సమయంలో తన గురించి సరదాగా గూగుల్‌లో వెతకాలనుకున్నారు. తీరా చూస్తే సినిమాలో దుస్తుల్లేకుండా ఉన్న కొన్ని ఫొటోలు కనిపించడంతో షాకయ్యానని అదితి తెలిపారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ తన గురించి గూగుల్‌లో వెతకకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ‘పద్మావత్‌’, ‘భూమి’, ‘వాజిర్‌’, ‘మర్డర్‌ 3’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అదితి. తెలుగులో ‘చెలియా’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాని, సుధీర్‌బాబు కథానాయకులు. నివేదా థామస్‌ మరో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలో ‘సైకో’ అనే చిత్రంతోనూ బిజీగా ఉన్నారు.