DailyDose

ఆ దుర్మార్గుడిపై 300 కేసులు-నేరవార్తలు–05/18

may 18 2019 - crime news - tnilive daily crime news

*ఇద్దరు మోస్తూ వాంటెడ్ క్రిమినల్స్ ను విజయవాడ పోలీసులు విజయవాడ పోలీసులు అరెస్టు చేసారు. వరుస దొంగతనాలు చేస్తూ నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఘనులు వీరు. ఈ గ్యాంగ్ లో భూక్యా నాయక్ అలియాస్ నాగరాజు పై రెండు తెలుగు రాష్ట్రాలలో 140కేసులున్నాయి. మరో దొంగ పుల్లేటి కుర్తి ఉమామహేశ్వరరావు అలియాస్ బుజ్జి పై అక్షరాలా మూడు వందల కేసులున్నాయి. అత్యంత కటినమైన లాకర్లను కూడా ఓపెన్ చేయడంలో బుజ్జి నేర్పరి.
* చిత్తూరు జిల్లాలో 10 కోట్ల విలువైన ఆల్ఫాజోన్ అనే మత్తుమందు చోరీ కావడం కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ముగ్గురు కంపెనీ ఉద్యోగులతో పాటు ఒక మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నార్కొటిక్ అధికారులు. రేణిగుంట గాజులమండ్యం ఇండస్ట్రియల్‌ ఏరియాలో మల్లాడి డ్రగ్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పని చేస్తున్న దక్షిణామూర్తి సస్పెన్షన్ కు గురయ్యాడు. అయితే ఆయన ఎలాగైనా ఫ్యాక్టరీలో అతి ఖరీదైన మత్తుమందున ఆల్ఫాజోన్‌ను కాజేసి, పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దీనికోసం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిట్టిబాబుకు వల వేశాడు. వారద్దరూ స్టోర్ లో పని చేస్తున్న నాగరాజు, శ్రీనివాస్‌కు డబ్బులు ఆశ జూపి, 30 కిలోల ఆల్ఫాజోన్‌ మత్తు మందును కాజేశారు. తర్వాత బెంగళూరులో ఓ వ్యక్తికి 15 కిలోలు అమ్మేసి, మిగిలిన దానికి ఎవ్వరికీ అనుమానం రాకుండా తన ఇంట్లో దాచిపెట్టాడు దక్షిణామూర్తి.
*గ్రామంలో ఎ వివాదం చోటుచేసుకున్నా గ్రామపెద్దగా చలామణి అయ్యే వ్యక్తికీ ఫిర్యాదు చేయడం ఆయన ఇష్టారాజ్యంగా ఇచ్చే తీర్పును శిరోధార్యంగా అమలు చేయడం సినిమాల్లో చూస్తుంటాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో సరిగ్గా అలాగే జరిగింది. తండ్రికి తెలియకుండా గేదెను అమ్మారని మహేష్, రాఘవేందర్ అనే ఇద్దరు యువకులకు గుండు గీయించారు గ్రామ సర్పంచ్ భర్త హర్షవర్ధన్ రెడ్డి అవమానభారంతో ఓ యువకుడు ఆత్మహత్య యత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామ పెద్దలు పదకొండు మంది పై కేసు నమోదు చేశారు.
*పాకిస్తాన్ కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాన్ సైనిక రహస్యాలను ఆమెకు తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి నలభై మంది జవాన్లను పొట్టన బెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
* కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం తమ తల్లిని చంపాడంటూ మేనమామను హత్య చేశారు అల్లుళ్లు. కార్వాన్‌పేటకు చెందిన ఇస్మాయిల్‌ ఆస్తి తగాదాల విషయంలో సొంత అక్క బాల్కిస్‌ బేగంను హత్య చేశాడు. అప్పటి నుంచి మేనమామపై కక్ష పెంచుకున్న అల్లుళ్లు కోర్టు ఆవరణలోనే కత్తులతో దాడి చేసి చంపారు. హత్య అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు నిందితులు. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
* శుక్రవారం ఉదయం బీహార్ లోని గయాలో ఎం కౌంటర్ జరిగింది. 205 కోబ్రా త్రూప్స్ బీహార్ పోలీసులు కలిసి సంయుక్తమగా నక్సల్స్ కోసం కూబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నక్సల్స్ పోలీసులకు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోఇస్టు హతమయ్యాడు. ఘటనస్తలిని నుంచి ఏకే 47 రైపిల్ మందు గుండు సమగ్రీని స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల ఐ ఈడీ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. నక్సల్స్ కొసం పోలీసులు కూబింగ్ కొనసాగిస్తున్నారు.
* క్షణికావేశం. అప్పటి వరకు కలిసి కబుర్లాడుకుంటారు. కలిసి తిరుగుతారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటారు. కానీ అంతలోనే ఏవో చిన్న చిన్న మనస్పర్థలు. అవే చివరకు ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి. కలిసి కాపురం చేయాల్సిన వాళ్లు మరణమే శరణమంటూ మరేమీ ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సుభాష్ నగర్‌కి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ కళ్యాణ్ రెడ్డికి రియాశర్మ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.అది సహజీవనానికి దారి తీసింది. నైట్ డ్యూటీ అని చెప్పి కళ్యాణ్ ఇంటి నుంచి రియా శర్మ వద్దకు వెళ్లేవాడు. ఇలా కలిసి సహజీవనం సాగిస్తున్న క్రమంలోనే ఇద్దరికీ గొడవ జరిగింది. అది చినికి చినికి గాలి వానై ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. క్షణికావేశంలో కళ్యాణ్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న గొడవకే ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది రియా. కళ్యాణ్ మరణాన్ని జీర్ణించుకోలేని రియా మానసికంగా కుంగిపోయింది.కూకట్ పల్లి స్వాధర్ హో‌మ్‌లో ఉంటున్న రియా‌ని మానసిక స్థితికి సరిగా లేదని ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించింది యాజమాన్యం. కానీ అక్కడ కూడా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈనెల 7వ తేదీన తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కళ్యాణ్ రెడ్డి సోదరుడికి వాయిస్ మెసేజ్ పంపించింది. ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేశాడు అతడు. కానీ ఆమె ఆచూకీ కనుక్కోవడంలో వారు విఫలమయ్యారు. మెసేజ్ పంపించిన 36 గంటల తరువాత రియా ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని అక్కడి వారు అంటున్నారు.
* ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం జీడివాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఏటూరు నాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
* మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కొడుకు వెంకటేశ్(30)ని అతడి తండ్రి పుల్లారావు హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుల్లారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా గంజాయి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యుల నుంచి రూ. 30 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 2 కార్లు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* జీడిమెట్ల, పేటబషీరాబాద్‌, అల్వాల్‌, ఐడీఏ బొల్లారం పోలీసు స్టేషన్ల పరిధిలో చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఇళ్లల్లో చోరీలు చేయడం, గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 73 తులాల బంగారం, 66 తులాల వెండి, మూడు బైక్‌లతో పాటు రూ. 86,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం జాతీయ రహదారి 44 పై, లారీ, వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ డీ కొంది. ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు. ఆంబులెన్సులో జిల్లా ఆసుపత్రికి తరలింపు.
*వరంగల్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వద్ద రోడ్డుప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటోను, ట్రాక్టర్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
*జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామ శివారులో, బైక్ పై నుంచి కింద పడి ఒక యువకుడు మృతి.తండ్రియాల గ్రామానికి చెందిన ముక్కెర మహేష్(22)గా గుర్తింపు…
*అన్నగారిపాలెం పంచాయతీ లనిన్న రాత్రి స్నేహితులతో బయటకు వెళ్లిన పులి వెంకట కృష్ణా 26 సం” అనుమానాస్పద మృతి తలపై బలమైన గాయం కారణంగా మృతి చెందాడని పోలీసులు నిర్ధారణ అనుమానాస్పద మృతి గా కేసు నమోదుఅనుమానితులైన ఇద్దరి స్నేహితుల కోసం పోలీసుల గాలింపుమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలింపు.
*ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని మూడేళ్ల చిన్నారి శ్రవంతి మృతి చెందింది. దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన దంపతులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందు భాగం ధ్వంసమైంది.
*బద్వేలు రూరల్ పోలీసుల అదుపులో ఆంజనేయులు అనే బడా గుట్కా వ్యాపారి…సురేంద్ర నగర్ లోని తన నివాసంలో వాహనంతో పాటు లక్ష రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాదీనం.
*చిత్తూరు జిల్లా రేణిగుంట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి నార్కోటిక్స్‌ అధికారులు భారీ మొత్తంలో అల్ఫ్రాజోలం మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను విజయవాడ సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
*కడప వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న లౌర్దయ్యనాయుడి అక్రమాస్తులు తవ్వేకొద్దీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
* పత్రాలు, బిల్లులు లేకుండా భారీ మొత్తంలో నగదును తరలిస్తున్న ముగ్గురిని విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1,31,98,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు శుక్రవారం వెల్లడించారు.
*గంజాయి అక్రమ రవాణా దిల్లీకి విస్తరించింది. విశాఖ ఏజెన్సీలోని జీకేవీధి మండలం నుంచి దిల్లీకి బయలు దేరిన లారీని పోలీసులు శుక్రవారం ఉదయం నర్సీపట్నంలో తనిఖీ చేసినప్పుడు..ప్రత్యేక అరలో రహస్యంగా తరలిస్తున్న 690 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై 10 టన్నుల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*జేఎన్‌యూ విద్యార్థి రిషి జోషువా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఏ రెండోసంవత్సరం చదువుతున్న రిషి వర్సిటీ గ్రంథాలయంలోని గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంగ్లభాషా ప్రొఫెసరుకు ఈ-మెయిల్‌ ద్వారా రిషి ఓ లేఖరాసినట్లు తెలుస్తోంది.
*వెలుగొండ అటవీ ప్రాంతంలో గుప్త నిధుల అన్వేషణకు వెళ్లి అదృశ్యమైన రెండో వ్యక్తి జీవితమూ విషాదాంతమైంది. అటవీ ప్రాంతాన్ని రెండో రోజయిన శుక్రవారమూ జల్లెడ పట్టిన పోలీసు బలగాలు బోడె హనుమంత నాయక్‌ (67) మృతదేహాన్ని గుర్తించాయి.
*ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కొమురవెల్లి మల్లన్నసాగర్‌ కాలువ నిర్మాణంలో చేపట్టిన జిలెటిన్‌స్టిక్‌ పేల్చివేత ఓ విద్యార్థి మృతికి కారణమైంది. సిద్దిపేట జిల్లా తోర్నాల బీసీ బాలుర కళాశాల వసతిగృహం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*తుక్కు దుకాణంలోకి టిప్పర్‌ దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగింది. పటాన్‌చెరు నుంచి శంకరపల్లికి వెళ్లే దారిలో వోల్టాస్‌ ప్రహరీని ఆనుకొని ఉన్న తుక్కు దుకాణంలోకి టిప్పర్‌ అదుపు తప్పి దూసుకెళ్లింది.
* సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులోని మహీంద్రా కర్మాగారంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడుతో పారిశ్రామిక వాడ ఉలిక్కిపడింది.
*రైళ్లలో చోరీల పరంపర కొనసాగిస్తూ అలా చేజిక్కించుకునే నగదుతో మలేసియాలో హోటల్‌ నడుపుతున్న ఓ ఘరానా దొంగను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే డీఐజీ బాలకృష్ణన్‌ చెన్నై సెంట్రల్‌లో శుక్రవారం విలేకరులకు సంబంధిత వివరాలు వెల్లడించారు.
*ఒక చిన్న విమానం కూలోపోయి నలుగురు మృతి చెందిన ఘటన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది మృతుల్లో ముగ్గురు బ్రిటన్ పౌరులు ఒకరు దక్షిణాఫిరాకను చెందినవారని యూఏఈ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. ఇంగ్లాండ్ కు చెందిన ప్లైట్ కొలాబరేషన్ సర్వీస్ లిమిటెడ్ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే ఆధునికీకరణ పనులు చేస్తోంది. దీనిలో భాగంగా నలుగురు నిపుణులతో వెళుతున్న డైమండ్ డీఎ 62 అనే చిన్న విమానం ఎయిర్ పోర్టుకు ఎనిమిది కి.మీ దూరంలో కూలిపోయినట్లు శుక్రవారం ఉదయం గుర్తించారు,.
*నేపాల్ వైపు నుంచి ఎవరెస్టు శికరాన్ని అధిరోహించి తిరిగి వస్తున్నా భారతీయుల్లో ఇద్దరు మరణించగా ఒకరు గల్లంతైనట్లు నిర్వాహక బృందం సారధి మింగ్ మా సేర్ఫా వెల్లడించారు. మృతుల్లో భారత సైనికుడు రవిధాకర్ ఉన్నట్లు తెలిపారు. ఆయన తన గుడారంలో మరణించి ఉండగా శుక్రవారం తెల్లవారుజామున కనుగొన్నట్లు వెల్లడించారు. నారాయణ్ సింగ్ అనే పర్వతారోహకుడు గురువారం రాత్రి మరణించినట్లు వివరించారు. కోల్ కతాకు చెందిన దీపాంకర్ ఘోష్ మౌంట్ మకాలు నుంచి వెనుదిరిగి వస్తుండగా గల్లంతయ్యరన్నారు.
*జేఎన్ యూ విద్యార్ధి రిషి జాషువా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఎంఏ రెండవ సంవత్సరం చదువుతున్న రిషి వర్సిటీ గ్రంధాలయంలోని గదిలో ఉరి వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంగ్లభాష ప్రోపెసార్లు ఈ-మెయిల్ ద్వార రిషి ఓ లేఖరసినట్లు తెలుస్తోంది.