Movies

నటిస్తే విజయం

Rashi khanna is considered a good luck actress in movie industry

అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్‌’ చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నాయిక రాశి ఖన్నా. తొలి సినిమానే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో అగ్ర హీరోలతో ఆడిపాడి ఇక్కడికి వచ్చిన రాశి.. మంచి రాశి ఉన్న నాయికగా పేరు తెచ్చుకుంటోంది. జయం రవికి జోడగా ఆమె నటించిన రెండో చిత్రం ‘అడంగ మరు’ సినిమా కూడా విజయం సాధించింది. అంతేకాకుండా విశాల్‌తో కలిసి ‘అయోగ్య’లోనూ నటించింది. నటనపరంగా ఈ అమ్మడుకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా రాశి ఖన్నా నటిస్తే సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం కూడా కోలీవుడ్‌లో వినిపిస్తోంది. దీంతో రాశి ఖన్నా ఉత్సాహంగా ఉంటోంది. అంతేకాకుండా తమిళంలో అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయని సమాచారం.