Food

వేసవి చలువ సగ్గుబియ్యం

tapioca is good to cool your body in summer - telugu summer cooling foods recipes - tnilive - nri nrt news - global telugu news

వేస‌విలో స‌గ్గుబియ్యం తిన‌డం మ‌రిచిపోకండి..!

ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ప‌దార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో స‌గ్గుబియ్యం కూడా ఒక‌టి. స‌గ్గుబియ్యంలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ర‌కాల పోషకాలు ఉంటాయి. అవ‌న్నీ వేస‌విలో మ‌న‌ల్ని ఎండ నుంచి ర‌క్షిస్తాయి. అంతేకాకుండా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి. ఈ క్ర‌మంలోనే స‌గ్గుబియ్యంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స‌గ్గుబియ్యంలో పాలు, చ‌క్కెర పోసి వండుకుని తిన్నా లేదంటే.. ఉప్మా త‌ర‌హాలో స‌గ్గుబియ్యం తిన్నా శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు స‌గ్గుబియ్యం తింటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వేస‌వి తాపం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.
2. స‌గ్గుబియ్యం తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.
3. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు స‌గ్గుబియ్యం తింటే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
4. వేసవిలో కొంచెం ప‌నిచేసినా మ‌నం త్వ‌ర‌గా అల‌సిపోతాం. క‌నుక శ‌రీరంలో శ‌క్తి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అలాంటి వారు స‌గ్గు బియ్యం తింటే వెంట‌నే కోల్పోయిన శ‌క్తి తిరిగి వ‌స్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎంత సేపు ప‌ని చేసినా త్వ‌ర‌గా అల‌సిపోరు. నీర‌సం ఉండ‌దు.
5. విరేచ‌నాలు అయిన వారు స‌గ్గుబియ్యం తింటే ఫ‌లితం ఉంటుంది.