Kids

ఈ బాబా వృక్ష ప్రేమికుడు

tree baba india manish tiwari - moral stories for telugu kids stories - tnilive - ఈ బాబా వృక్ష ప్రేమికుడు

‘ఈ నగరానికి ఏమైంది… ఓ వైపు కాలుష్యం.. మరోవైపు చెట్ల నరికివేత’.. ఇదిలా కొనసాగితే తరువాత తరాలకు ప్రాణవాయువైనా దొరకదని ఆందోళన కలిగింది ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన మనీశ్‌ తివారీకి. ఆ క్షణం నుంచి హరితహారమే ఆయన ధ్యేయమైంది. కాషాయ వస్త్రాలు ధరించి పచ్చ రంగు సైకిల్‌పై తిరుగుతూ ఎప్పుడు చూసినా చెత్త ఏరుతూ, మొక్కలు నాటుతూ కనిపించే మనీశ్‌ తివారీని అందరూ పేడ్‌ బాబా, ట్రీ బాబా అని పిలుస్తుంటారు. లఖ్‌నవూను హరిత నగరంగా మార్చాలన్నది ఆయన కల. ప్రస్తుతం గులాలా ఘాట్‌ శ్మశానవాటికను బృందావనంగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడున్న చెత్త ఏరుతూ.. మొక్కలు నాటి, నీళ్లు పోస్తుంటారు. ఎవరి సాయం కోరకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయానికి ప్రభుత్వంపై ఆధారపడకూడదని.. తొలి అడుగు మనమే వేయాలని చెబుతుంటారు ఈ ట్రీ బాబా.