DailyDose

తెదేపా అభ్యర్థి నానిపై కేసు-నేరవార్తలు–05/20

Daily Crime News-  TDP Candidate Nani Case In Chandragiri-tnilive - telugu news international tnilive telugu daily crime news

* చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై కేసు నమోదు అయింది. పాకాల మండలంలోని పులివర్తివారిపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి బావమరిది కేశవులు రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పులివర్తి నానిపై పాకాల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కాగా గతంలోనూ పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి… గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుతగిలారు. ఆయనకు అండగా నిలిచిన దళితులపై దాడులకు తెగబడ్డారు.
* ‘గాడ్సే వ్యాఖ్యల’ వివాదంలో ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఊరట లభించింది. కమల్‌కు మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్‌ ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కమల్‌ హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే’ అని అన్నారు. కమల్‌ వ్యాఖ్యలపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా 76 ఫిర్యాదులు రాగా.. రెండు కేసులు నమోదయ్యాయి.
*హైదరబాద్ లో దారుణం జరిగింది. రెండో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనిచ్చిందన్న కారణంతో భార్య ఇద్దరు పిల్లలను మూడు లక్షలకు అమ్మేశాడు ఓ కసాయి భర్త. అయితే ఈ విషయాన్నీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆ బాధితురాలు మహిళా సంఘాలను ఆశ్రయించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బండ్ల గూడ నూరీనగర్ కు చెందిన ఫజల్ రహమనీ, ఇష్రాట్ పర్వీన్ భార్యాభర్తలు, 2018లో పెళ్ళైన వీరికి రెండేళ్ళ పాప ఉంది. నాలుగు నెలల క్రితం పర్వీన్ మరో అమ్మాయికి జనమనిచ్చింది.
*భార్య గొడవ పడిందని ఓ యువకుడు మద్యం మత్తులో ఏకంగా రైలును అడ్డగించాడు. ఈ ఘటన చెన్నై సివగంగై జిల్లలో జరిగింది. మనామదురై సమీపంలో ఏనాది చెంగోట్లికు
* గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. ఆదివారం రాత్రి షోలపూర్ నుండి ద్రాక్ష పండ్ల లోడుతో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ ను ఏడుకొండలుగా గుర్తించారు. అయితే డెడ్ బాడీని యాక్సిడెంట్ జరిగిన చోటునుంచి 3కి.మీ దూరంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏడుకొండలు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హస్పిటల్ కి తరలించారు.
*విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
* కురిచేడు మండలం ఆవులమంద రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం అటుగా వెళ్తున్న ప్రయాణికులు మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహం వద్ద లభించిన ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతుడు దర్శి మండలం లంకోజనపల్లి కి చెందిన జల్ది పవన్ కల్యాణ్ గా గుర్తించారు. రైలు ఢీకొని మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
* బ్రెజిల్‌లోని పారా రాష్ట్రంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బెలెమ్‌లోని ఓ బార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు వ్యక్తులు బార్‌లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు.
*ఏఎస్‌రావునగర్‌లో తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వృద్ధురాలు రాధాపూర్ణిమది హత్యే అని పోస్టుమార్టం నివేదిక తేల్చింది.
*కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నివాసం వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వరి నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఈ ఉదయం 9:15నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
*రాజస్థాన్‌లో అల్వార్‌ సామూహిక అత్యాచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. వంటసరుకు తెచ్చుకోవడానికి వెళ్లిన ఓ గృహిణిని ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన బికనేర్‌లో వెలుగుచూసింది.
* ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో సినీ నటుడు హేమంత్‌కు గాయాలయ్యాయి. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట క్రాస్‌రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
*జాతీయ రహదారి పనులకు వినియోగించే వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కూలీలతో సహా అక్కడున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై పరుగులు తీశారు.
* ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం చెందారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం వంజీరి సమీపంలోని రైల్వేగేటు వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది.
*వివాహంలో ఒడి బియ్యంతో వండిన ఆహారం వికటించి 31 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.
*బెంగళూరులోని వయ్యాలికావల్‌ కాలనీలో ఆదివారం ఉదయం సంభవించిన పేలుడులో వెంకటేశ్‌ (56) అనే కార్మికుడు మృతి చెందాడు.
*కృష్ణాజిల్లాలోని చందర్లపాడు మండలం మునగాలపల్లిలో దారుణ హత్య జరిగింది. నిత్యం వేదిస్తున్న ఓ వ్యక్తిని అతని భార్యే హతమార్చింది. వివరాల్లోకెళితే.. మునగాలపల్లి గ్రామానికి చెందిన పిడతల సురేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతని భార్యను నిత్యం వేధించసాగాడు. దీంతో విసిగివేసారిన అతని భార్య ఇనుపరాడ్డుతో సురేష్ తలపై గట్టిగా కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. సురేష్ భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*పుణ్యక్షేత్రాల సందర్శనార్థం బయలుదేరిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మాజీ సర్పంచి రాజ్యలక్ష్మి(56), ఆమెకు చెల్లెలు వరసయ్యే మరొకరు తమిళనాడులో జరిగిన రహదారి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
*తీవ్ర సంచలనం సృష్టించిన అల్వార్‌ సామూహిక అత్యాచారం కేసులో నిందితులపై పోలీసులు శనివారం సంబంధిత కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
*మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పండాకు జీవిత ఖైదు విధిస్తూ ఒడిశాలోని గంజాం అదనపు జిల్లా జడ్జి-1 (ఏడీజే-1) సంజయకుమార్‌ సాహు శనివారం తీర్పునిచ్చారు.
*తీవ్ర సంచలనం సృష్టించిన అల్వార్‌ సామూహిక అత్యాచారం కేసులో నిందితులపై పోలీసులు శనివారం సంబంధిత కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
*ఆంధ్ర, ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు దాడులు ముమ్మరం చేశారు. మత్తిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తిమురుపల్లిలో పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేశారు. గ్రామంలోకి సుమారు 40 మంది మావోయిస్టులు శుక్రవారం రాత్రి వచ్చి పంచాయతీ కార్యాలయానికి మందుపాతరలు అమర్చి పేల్చివేశారు. దీంతో భవనం గోడలు కూలిపోగా, కార్యాలయంలోని విలువైన సామగ్రి ధ్వంసమయ్యాయి.
*ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల నుంచి ముక్కుపిండి లంచాలు దండుకుంటున్న ఆచార్యుడు డాక్టర్‌ భూక్యా బాలాజీ అవినీతి విశ్వరూపంపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు మరిన్ని సాక్ష్యాధారాలు లభించాయి.
*రాజస్థాన్‌లో వేర్వేరుచోట్ల ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారని పోలీసులు వెల్లడించారు. హస్రారా గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లిన 15 ఏళ్ల బాలికపై ఈ నెల 14న ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.
*జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పడటంతో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన శనివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని పూతలపట్టు-నాయుడుపేట హైవేపై కల్‌రోడ్డుపల్లి సమీపంలో జరిగింది.
*మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు.
*వడ్ల లోడుతో వెళ్తున్న లారీ రహదారికి అడ్డంగా పడిపోయిన సంఘటన నల్లమలలో పెద్దదోర్నాల- ఆత్మకూరు రహదారిలోని రోళ్లపెంట సమీపంలోని పిల్లలగట్టు మలుపు వద్ద శనివారం జరిగింది.
*పూతలపట్టు-నాయుడుపేట జాతీయమార్గం కల్‌రోడ్డుపల్లి సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.
* జాతీయ రహదారిపై కంచికచర్లలో కంచలమ్మ చెరువుకట్టపై శనివారం చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని పేరకలపాడు నుంచి కంచికచర్లకు ఆటో బయలుదేరింది.
* అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు విఫలమై దుకాణాలపైకి దూసుకుపోయిన ఘటన శనివారం అడివివరంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
*అత్తింటి వేధింపులకు ఓ వివాహిత బలైన సంఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం కపాడ్‌కు చెందిన అక్షిత(25)కు, శంషాబాద్‌లోని ఆర్‌బీనగర్‌కు చెందిన సోమన్నగారి రాఘవేందర్‌రెడ్డికి ఏడాది క్రితం వివాహం జరిగింది. రాఘవేందర్‌రెడ్డి వృత్తిరీత్యా అడ్వకేట్. కాగా, కొంతకాలం నుంచి వీరి మధ్య కుటుంబ కలహాలు, వేధింపులు మొదలయ్యాయి. దీంతో శనివారం అర్ధరాత్రి అక్షిత ఫ్యాన్‌కు ఉరేసుకున్నది. వెంటనే స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
* వడ్డీ వ్యాపారులపై రామగుండం పోలీసులు కొరడా ఝళిపించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో 49 మంది వడ్డీ వ్యాపారుల్ని అరెస్టు చేసినట్టు రామగుండం నగర పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వెల్లడించారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.65.52లక్షల నగదు, బాండ్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
* అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌరీపురం గ్రామం వద్ద కేఎస్‌ఆర్‌టీసీ బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. మడకశిర నుంచి పావగడకు వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ వెళ్తోంది. గౌరీపురం వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఉండడం వలన అవి తప్పించ బోయి వేగంపై పక్కనే పొదల్లోకి వెళ్లింది. అయితే డ్రైవర్‌ చాకచక్యంగా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.