ScienceAndTech

రికార్డు నెలకొల్పిన హైదరాబాద్ మెట్రో

Hyderabad metro breaks world record - tnilive - telugu news international science and technology telugu news

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో మెట్రో కీలకపాత్రం పోషిస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరచడంలో కీలక మైలురాయిగా నిలుస్తోంది.దేశ విదేశాల్లోని మెట్రోలకు దీటుగా సత్తాచాటుతోంది. అత్యాధునిక సాంకేతిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్దం పడుతోంది. ప్రజలమనసు గెలుచుకున్న మెట్రో మరో ఘనతసాధించింది. అత్యధిక పిల్లర్లను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించిన మెట్రోగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మెట్రో మొదటి దశలో 72కి లోమీటర్ల పొడవైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రణాళికతో మెట్రోనిర్మాణం ప్రారంభమైంది. ఈ లక్ష్యాన్ని ఏడేళ్లకాలంలో దాదాపు పూర్తి చేసింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ఆరు కిలోమీటర్ల రూట్ మినహా మొత్తం అరవై ఆరు కిలోమీటర్ల రూటు నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇందులో 56 కిలోమీటర్ల రూట్లో మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఈ ఏడాది చివర్లో మెట్రో పరుగులుపెట్టనుంది. మెట్రో రైల్ అరవై ఆరు కిలోమీటర్ల రూట్లో 2599 పిల్లర్ల నిర్మాణంతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2012 ఏప్రిల్ 19న ఉప్పల్లో తొలి పిల్లర్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రతిపాదిత రూట్లో 2599 పిల్లర్లను ఎల్ అండ్టీ సంస్థ నిర్మించింది. తాజాగా ఎంజీబీఎ స్వద్ద నిర్మించిన పిల్లర్ తో మొదటి దశ మెట్రోనిర్మాణం పూర్తయింది. అందుబాటులోకి వచ్చిన 56 కిలో మీటర్ల పొడవైన రూట్లో 50 స్టేషన్లను అధునిక హంగులతో రూపొందించింది. భౌగోళిక, సాంకేతిక సవాళ్లను అధిగమించి ఆయా ప్రాంతాల్లో భిన్నమైన పిల్లర్లను నిర్మించారు. ఇందులో 1599 నార్మల్, 224 క్యాంటీలివర్, 602 స్టేషన్ పిల్లర్లు, 51 హ్యామర్హెడ్ షేప్, 153 పోస్టర్ పిల్లర్లను నిర్మించారు. ఒక్కో పిల్లర్ 30 అడుగుల ఎత్తుతో నిర్మించారు.అత్యంత రద్దీ కలిగిన రూట్లలోనూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, రాకపోకలు నిలిపివేయకుం డా నిర్మాణం సాగింది. మతపరమైన,చారిత్రక కట్టడాలు కలిగిన ప్రాంతాల్లోనూ ఆటంకాలు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు.మెట్రో పిల్లర్ల నిర్మాణం కోసం వివిధ సంస్థలనుం చి అనుమతులు తీసుకోవడంలోనూ మెట్రో విశేష కృషి చేసింది. జాతీయ రహదారుల సంస్థనుంచి అనుమతుల కోసం మూడేళ్లు, రక్షణ,రైల్వే శాఖల నుంచి అనుమతులు తీసుకోవడంకోసం నాలుగేళ్లు పట్టింది. మెట్రో నిర్మాణంలో3000 ఆస్తులను సేకరించారు. ఆస్తు ల సేకరణలోనూ అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. 370కేసులను హెచ్ఎంఆర్ హైకోర్టులో గెలిచింది.ఇన్ని ఆటంకాల్ని, అవరోధాల్ని అధిగమించి 2599 పిల్లర్లను ఎల్అండ్ టీ సంస్థ నిర్మించింది. ఒకే సంస్థ ఇన్ని మెట్రో పిల్లర్లను నిర్మించినఘనతను, ప్రపంచ రికార్డును సాధించింది. ఈసందర్భంగా హెచ్ఎఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇంజనీర్లను, అధికారులను అభినందించారు.