Editorials

బెయిల్ ఇస్తే దర్యాప్తుకు సహకరిస్తా!

TV9 Raviprakash Says He Will Co-Operate If He Is Issued Anticipatory Bail - TNILIVE Telugu Crime News

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ 9 వివాదం వ్యవహారంలో తనపై కేసులు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కోసం సోమవారం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్, బంజారాహిల్స్‌లో నమోదైన మూడు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్‌సీఎల్‌టీలో కేసు వివరాలను దాచిపెట్టి తప్పుడు ఫిర్యాదు చేశారని.. దాని ఆధారంగా తనపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రవి ప్రకాశ్‌ పిటిషన్లపై హైకోర్టు వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఎల్లుండి విచారణ జరిపే అవకాశం ఉంది.