Movies

ఖన్నా కితకితలు

Twinkle Khanna Mocks Modi In Yoga Pose-tnilive movies politics news in telugu

పోలింగ్ అవగానే ప్రధాని మోడీ కేధార్ నాథ్ ఆలయాన్ని ను దర్శించి అక్కడ మెడిటేషన్ చేశారు. అయితే మోడీ మెడిటేషన్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయం పై బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా సెటైర్ వేశారు. తాను కూడా ఒక దగ్గర యోగ ముద్రలో కూర్చున్న ఫొటో ను ట్వీట్ చేశారు. “ కొన్ని రోజులనుండి నేను ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫొటోలను చూశాను. నేను కూడా ఇప్పుడు మెడిటేషన్ ఫొటోగ్రఫీకి చెందిన వర్క్ షాప్ ను స్టార్ట్ చేస్తున్నాను. ఇది వెడ్డింగ్ ఫొటోగ్రఫి కంటే బాగుంది” అని ట్వింకిల్ కన్నా ట్వీట్ చేశారు.ఇదివరకు మోడీపై చాలా సార్లు సెటైర్ వేశారు ట్వింకిల్ కన్నా. ఈ మధ్య అక్షయ్ కుమార్ కు మోడీ ఇచ్చిన ఇంటర్వూలో ట్వింకిల్ తనపై వేసే సెటైర్ లను మోడీ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ట్వింకిల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.