Devotional

అరుంధతి నక్షత్రం ప్రత్యేకత ఇదే

Here is why newly wed couple look for arundhati star

అరుంధతి జన్మ వృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కన్పిస్తుంది.అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతి తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతం22అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది ఈ ఐదుగురు స్ర్తిలు సదా వందనీయులని ఈ శ్లోకానికి అర్థం.అరుంధతి జన్మ వృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అనే ఐదు బాణాలనిచ్చాడు విధాత. మన్మథుడు బాణశక్తిని పరీక్షింపతలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అపుడు బ్రహ్మతో సహా అక్కడ వున్నవారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా, ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కదిద్దాడు. రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపమిచ్చాడు. తనవల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అపుడు బ్రహ్మ వశిష్ఠ మహామునిని పిల్చి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాల్సిందిగా కోరాడు. వశిష్ఠుడు ఆమెకు శివామంత్రానుష్ఠానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్ఠతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు. 34ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కల్గరాదనే22 వరాన్ని ఆమె కోరుకుంది. అపుడు సంధ్య.. 34నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామ దృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కల్గించాను కనుక ఈ దేహం నశించిపోవాలని22కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ 34 మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యురాలివై శరీరాన్ని దగ్ధం చేసుకొని తిరిగి అదే అగ్నిగుండం నుంచి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని22 చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుంచి తిరిగి జన్మించింది.సంస్కృత భాషలో 3అరుం2 అంటే అగ్ని, తేజము, బంగారం వనె్న అనే అర్థాలున్నాయి. 3్ధతీ2 అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె 3అరుంధతీ2 అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్దచేసి, వశిష్ఠునికిచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమవల్ల త్రిలోక పూజ్యురాలైంది. అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహాపతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరుమీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రంవేళ కానరాదు.రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటంవల్ల కంటిశక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాలవల్ల కంటిశక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంవేళ సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కన్పిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి..! మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్నపిల్లాడిని మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా వుండే సప్తర్షి మండలంలో పక్క పక్కనే వుండే నక్షత్రాలే అరుంధతి వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా వుంటుంది. ఇది మహా పతివ్రతా శిరోమణి అరుంధతి నక్షత్రం పురాణ ఇతిహాసం.
1. భద్రాచలం రాముడిని దర్శించుకున్న పండిత్ రవిశంకర్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్‌ ఆప్ లివింగ్ సంస్థ చైర్మన్ పండిత్ రవి శంకర్, జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లికార్జనరావులు ఈ రోజు భద్రాచలం సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పూజారులు రవిశంకర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పూజారులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించగా, ఆలయ సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు.
2. 29న యాదాద్రిలో హనుమజ్జయంతి
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఈ నెల 29న హనుమజ్జయంతి నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆ రోజున ప్రత్యేక పూజలు చేపడతామని మంగళవారం ఆమె ప్రకటించారు. అష్టోత్తర, పారాయణాలు, అభిషేకంతో పాటు లక్ష తమలపాకులతో ఆకుపూజ నిర్వర్తిస్తామన్నారు.
3. అయోధ్య సీతారామాలయంలో ఇఫ్తార్‌
అయోధ్యలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చి ఇక్కడి సీతారామాలయం మత సామరస్యాన్ని చాటి చెప్పింది. ముస్లింలే కాకుండా మతాలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలు కూడా ఈ విందుకు హాజరయ్యారు. ఈ ఆలయంలో ఇఫ్తార్‌ నిర్వహించడం ఇది మూడోసారని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆలయ పూజారి యుగల్‌ కిశోర్‌ తెలిపారు. ప్రతీ పండుగను కులమతాలకు అతీతంగా సోదరభావంతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ సోదరులతో తామూ నవరాత్రి వేడుకల్లో పాల్గొంటామని విందుకు హాజరైన ఓ ముస్లిం తెలిపాడు.
4. తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న సీఎం
కుప్పం మండల కేంద్రంలో వెలసిన శ్రీ తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరితో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం దంపతులను శాలువలతో సన్మానించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, మదనపల్లి సబ్‌ కలెక్టర్ కీర్తి చేకూరిలు ఉన్నారు. సీఎం దంపతులు పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకొని హెలిప్యాడ్‌ ప్రాంతానికి చేరుకున్నారు.
5.శుభమస్తు
తేది : 22, మే 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 44 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : పూర్వాషాడ
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 34 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 5 గం॥ 13 ని॥ వరకు)
యోగము : సాధ్యము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 32 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 31 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ఈరోజు
అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 11 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : ధనుస్సు
విశేషం
22. సంకష్టహరచతుర్థి
6. *చరిత్రలో ఈ రోజు/మే 22*
*అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం.*
*యెమన్ జాతీయదినోత్సవం*
1772 : సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జననం. (మ. 1833).
1888 : సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం (మ.1939).
1942 : రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అవతరించింది.
1948 : పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
1952 : ప్రముఖ హేతువాది గుమ్మా వీరన్న జననం.
2004 : భారత 12వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ -13వ ప్రధాని)
2008 : నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
2009 : భారత 13వ ప్రధానమంత్రి గా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు.
2010 : మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
2010 : సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం. (జ.1936)