DailyDose

ఎయిర్‌ ఇండియా సరికొత్త సర్వీసులు-తాజావార్తలు–05/22

May 22 2019 - Daily Breaking News - Air India To Introduce New Services - TNILIVE - ఎయిర్‌ ఇండియా సరికొత్త సర్వీసులు-తాజావార్తలు–05/22

* ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. భోపాల్‌-పుణే-భోపాల్‌ , వారణాసి- చెన్నై-వారణాసి మార్గాల్లో కొత్త విమానాలను నడపనుంది.
* ఈ-సెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాలను నగరంలోని జేఎన్‌టీయూహెచ్‌లో విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24,497 మంది అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించారు.
* ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఈ-సువిధ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. దీంతో ముందుగానే ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. 23న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
* క్రృష్ణాజిల్లాగన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఉన్న ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న ఆర్చు కొద్దిచేపటి క్రితం ఒక్కసారిగ కూలడంతో పలువురుకి గాయాలు అయ్యాయి ఆర్చు కూలడానికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేదా ఎంతమందికి గాయాలు అయ్యాయి అనేది పూర్తి వివరాలు తెలియాలసి ఉంది
* కృష్ణ జిల్లా మచిలీపట్నం లో కృష్ణ యూనివర్సిటీలో పోలింగ్ కేంద్రాల కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన కృష్ణ జిల్లా కలెక్టర్ యండి ఇంటియాజ్రేపు ఉదయంకౌంటింగ్ అన్ని ఏర్పాట్లను పూర్తి అయినాయి, ఉదయం 8 గం నుండి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అని తెలిపారు.బందరు పార్లమెంట్ , ఏలూరు పార్లమెంట్ లో నూజివీడు, కైకలూరు నియోజక వర్గ ఈవీయం, పోస్టల్ బ్యాలెట్ లెకింపు చేస్తామని తెలిపారు.
* ఈ నెల 24, 28 తేదీలలో గుంటూరు నుండి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే గోల్కండ ఎక్స్‌ప్రెస్‌ ను దారి మళ్లించామని, 26, 30 తేదీల్లో సికింద్రాబాద్‌ నుండి ఖమ్మం మీదుగా గుంటూరుకు వెళ్లే గోల్కండ ఎక్స్‌ప్రెస్‌ ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని ఖమ్మం రైల్వే అధికారులు పేర్కొన్నారు…
* అండన్‌మాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదిలాఉండగా మంగళవారం.. నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్‌ స్కే‍ల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదయ్యింది. రెండు రోజుల్లో వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
* చిత్తూరు కుప్పంసతీసమేతంగా కుప్పం చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.గంగమ్మకు పట్టు వస్త్రాలు అందించి విశ్వరూప దర్శనం చేసుకొన్న చంద్రబాబు నాయుడు దంపతులు.తొలిసారిగా గంగమ్మ జాతరకు హాజరై మొక్కు తీర్చుకున్న చంద్రబాబు నాయుడు దంపతులు.
* మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు…మధ్యాహ్నం నుంచి పార్టీ ముఖ్యులతో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయనున్న చంద్రబాబు.. అమరావతి..ఉదయం 11.30 కి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫెరెన్సు..కౌంటింగ్ ఏర్పాట్లు,భద్రతా చర్యలపై సమీక్ష
* రెండు రోజుల బ్యాటరీ లైఫ్, హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో 6.62 అంగుళాల తెర కలిగిన నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 2జీబీ ర్యామ్‌+ 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజి కలిగిన వేరియంట్‌ ధర రూ.8,990గా, 3జీబీ ర్యామ్‌+ 32జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజీ కలిగిన వేరియంట్‌ ధర రూ.10,790 గా నిర్ణయించారు.
*అవినీతికి పాల్పడుతు ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుర్రంపోడు ఎస్‌ఐ క్రాంతికుమార్ రైతు నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. భూమి పంచాయతీ వ్యవహారంలో ఎస్‌ఐ లంచం డిమాండ్ చేసినట్లుగా సమాచారం.
*ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ లో స్టార్ బక్సర్ మేరికోం యువ కెరటం నిఖిట్ జరీన్ పతకాలు ఖాయం చేశారు.
*అండన్‌మాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
*పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్‌–19 కౌన్సెలింగ్‌ మే 24 నుంచి మే 29 వరకు జరగనుంది. మే 24న 1 నుంచి 8,000 వరకు, మే 25న 8,001 నుంచి 25,000 వరకు, మే 26న 25,001 నుంచి 45,000 వరకు, మే 27న 45,001 నుంచి 65,000 వరకు, మే 28న 65,001 నుంచి 87,000 వరకు, మే 29న 87,001 నుంచి చివరి ర్యాంక్‌ వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కేంద్రాలలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు.
*బీసీసిఐతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని బోర్డు పరిపాలకుల కమిటీ నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించింది. అక్టోబరు పద్నాలుగు లోపు రాష్ట్ర సంఘాల ఎన్నికల ప్రక్రీయ పూర్తవ్వాలని పేర్కొంది. 2017 జనవరిలో పరిపాలకుల కమిటీని సుప్రీంకోర్టు నియమించగా సుమారు రెండేళ్ళ ఎనిమిది నెలల తరువాత బోర్డుకు ఎన్నికలు జరుగునుండడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సహాయకుడు పీఎస్. నరసింహ రాష్ట్ర సంఘాలు సిఓఎతో చర్చలు జరిపారు.
*ఇంగ్లాండ్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్‌ జట్టు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పయనమైంది. కెప్టెన్ కోహ్లీ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్‌, హార్దిక్‌ పాండ్యా కూడా ఫొటోలు ట్వీట్‌ చేశారు.
*ఇస్రో ఖాతాలో మరో విజయం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది.
*ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న వేళ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎం)ను తారుమారు చేసి వాటి స్థానంలో కొత్తవి పెట్టారని వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం గట్టిగా తోసిపుచ్చింది.
*ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో అసమ్మతి, మైనార్టీ అభిప్రాయాలను వెల్లడి చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) నిరాకరించింది.
*తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కింద రైతులకు నగదు బదిలీ ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటి వారంలో చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు.
*గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించే నీటిలో వాటాకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత తమది కాదంటే తమది కాదని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు తప్పించుకుంటున్నాయి.
*హైదరాబాద్‌లో వచ్చే జులైలో జాతీయ అంచనా, గుర్తింపు మండలి (న్యాక్‌) కార్యశాల నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్‌.లింబాద్రి, వి.వెంకటరమణ మంగళవారం బెంగళూరులోని న్యాక్‌ ప్రధాన కార్యాలయంలో సంచాలకుడు ఆచార్య ఎస్‌సీ శర్మను కలిశారు.
*రాష్ట్రంలో గురువారం జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పది వేల మంది సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని శాంతి భద్రతల అదనపు డీజీ, నోడల్‌ అధికారి జితేందర్‌ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా ఉండేలా లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ విధించామని తెలిపారు.
*కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 29 మంది నిర్వాసితులకు న్యాయవాది రవికుమార్‌ పునరావాసం కింద ప్రభుత్వం జారీ చేసిన చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.
*కర్ణాటక నుంచి జూరాల జలాశయానికి మొత్తం 0.73 టీఎంసీల నీరు చేరింది. ఈనెల 14న ఎగువ నుంచి ప్రారంభమైన నీటి ప్రవాహం మంగళవారం ఉదయం నిలిచిపోయింది. పాలమూరు జిల్లాలో నీటిఎద్దడి నెలకొందని.
*తప్పనిసరి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక కూడా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఏదైనా పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం డీకోడ్‌ కానప్పుడు, వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా రావడం, ఈవీఎంలు మొరాయించడం, పార్టీలకు వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండడం, ఇతరత్రా ఏవైనా సమస్యలు వచ్చిన సందర్భాల్లోనే రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఎన్నికల కోడ్‌ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి వరకూ అమల్లో ఉంటుందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ద్వివేది ఈ విషయాలు వెల్లడించారు.
*రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. 85 పురపాలక సంఘాలు, మరో తొమ్మిది నగరపాలక సంస్థల్లో ఓటర్ల తుది జాబితాలను ఈనెల 10న ప్రకటించారు.
*హైదరాబాద్‌లో వచ్చే జులైలో జాతీయ అంచనా, గుర్తింపు మండలి (న్యాక్‌) కార్యశాల నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్‌.లింబాద్రి, వి.వెంకటరమణ మంగళవారం బెంగళూరులోని న్యాక్‌ ప్రధాన కార్యాలయంలో సంచాలకుడు ఆచార్య ఎస్‌సీ శర్మను కలిశారు.
*జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఉగ్రవాదులుభద్రతాదళాల జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.కుల్గం జిల్లా గోపాలపొర ప్రాంతం వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జవాన్లు బుధవారం ఉదయం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరపగా, వారు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా తెలియలేదు.
*రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించినట్లు ఆ సంస్థ డీజీఎం విశ్వనాథ్‌ తెలిపారు. ప్లాన్‌-899ను రూ. 786కే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 18నుంచి జూ న్‌ 5వతేదీ వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందన్నారు. 180రోజుల పాటు అపరిమిత కాల్స్‌, రో జుకు 1.5జీబీ డేటా, 50ఎస్‌ఎంఎ్‌సలు ఉచితంగా ఇస్తారన్నారు. అలాగే 786తో ము గిసే నెంబరు కేవలం రూ. 354 చెల్లించాలని, 786+ నంబరుతో ముగిసే నెంబరు కేవలం రూ.59లు చెల్లించి పొందవచ్చునన్నారు. ఈ ఆఫర్‌ జూన్‌ 6న ముగుస్తుందన్నారు.