DailyDose

కర్నూలులో తెదేపా నేత దారుణ హత్య-నేరవార్తలు–05/22

May 22 2019 - Daily Crime News - TDP Leader Murdered In Kurnool - tnilive - కర్నూలులో తెదేపా నేత దారుణ హత్య-నేరవార్తలు–05/22

* కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని డోన్‌ మండలం మల్లెంపల్లిలో బుధవారం రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి చంపారు. తాపలకొత్తూరు నుంచి బైక్ పై డోన్‌ వెళ్తుండగా కొందరు గుర్తు తెలయని దుండగులు ఈ హత్య చేశారు. మృతి చెందిన వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరుడని తెలిసింది. ప్రత్యర్ధుల దాడిలో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
* కలాహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* అనంతపురం నగరం నడిబొడ్డున దివాకర్ ట్రావెల్స్ బస్సు పాదచారులు పైకి దూసుకెళ్లింది..అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం ఏమి జరగలేదు కానీ ….అక్కడ ఉన్న పండ్ల మరియు కూరగాయలు బండ్లు పూర్తిగా ద్వంస్యం అయ్యాయి అయితే బస్సు డ్రైవర్ పరారీ లో ఉన్నట్లు సమాచారం
* చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని సి.మల్లవరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట నుంచి బెంగళూరు వెళ్తున్న గ్లాజు గ్లాసుల లోడు లారీ రోడ్డుపక్కన ఆగి ఉండగా ..వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
* నల్గొండ జిల్లా బస్సు బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బుధవారం రోజు ఉదయం జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది…
* సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..12 మందికి గాయాలయ్యాయి.
* బాలీవుడ్‌ నటుడు జితేంద్రపై నమోదైన అత్యాచారం కేసును హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. 48 సంవత్సరాల క్రితం జితేంద్ర తన కజిన్‌పై అత్యాచారం చేశాడని కేసు నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరి 16న దాఖలై ఎఫ్‌ఐఆర్‌ను జస్టిస్‌ అజయ్‌ మోహన్‌ గోయెల్‌ కొట్టివేశారు.
* చంచల్‌గూడ సెంట్రల్‌ జైల్లో ఖైదీ మృతిచెందాడు. ఓ హత్యకేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న లక్ష్మణ్‌ గుండెపోటుతో మృతి చెందినట్టు జైలు అధికారులు బుధవారం తెలిపారు. మృతుడు కార్ఖానా పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు.
* యువతి ప్రేమించట్లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వేదనగర్‌లో చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు యుగేందర్ గౌడ్ హైదరాబాద్ మియాపూర్ నివాసిగా సమాచారం.
* నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బార్‌పై మహారాష్ట్ర పోలీసులు దాడులు చేపట్టారు. బార్‌లో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో క్రైం బ్రాంచ్ పోలీసులు వెసాయ్ ప్రాంతంలోని ఓ బార్‌పై దాడులు నిర్వహించి..బార్ మేనేజర్‌తోపాటు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.
* కృష్ణా జిల్లా నూజివీడు కేసులు ఉన్నాయంటూ 8 టిడిపి కౌంటింగ్ ఏజెంట్లకు పాస్ లు జారీచేసేందుకు నిరాకరించిన సబ్ కలెక్టర్? సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటున్న టిడిపి కార్యకర్తలు,.
* కర్నూలు ల్లాలో దారుణ హత్య జరిగింది… జిల్లాలోని డోన్‌ మండలం మల్లెంపల్లి దగ్గర తాపలకొత్తూరుకు చెందిన శేఖర్ రెడ్డిని గుర్తుతెలిని వ్యక్తులు దారుణంగా చంపేశారు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తున్న శేఖర్‌రెడ్డిని దారికాసిన దుండగులు తలపై కట్టెల తో దాడి చేసి బండరాయితో మోది హతమార్చారు. కాగా, శేఖర్‌రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అనుచరుడుగా గుర్తించారు. హత్యకు రాజకీయ కారణాలా?, వ్యక్తిగత కక్షలా? లేక వ్యాపార లావాదేవీలా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
* యర్రగుంట్ల వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన స్థానిక హనుమన్‌ గుత్తి గ్రామంలో, బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మధిరేపల్లిలో రైతు కూలీగా పని చేస్తున్న నరసింహులు (62) కు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి వాంతులు, విరోచనాలవుతుండటంతో, కుటుంబీకులు హుటాహుటిన ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు…
*ప్రేమ జంటగా భావిస్తున్న యువతీయువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. మణుగూరు ఆర్టీసీ బస్సు బర్రెను తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ పలువురు ప్రయాణికులు స్పృహతప్పిపోయారు. చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 78 మంది ప్రయాణికులు ఉన్నారు.
*ఇంజినీరింగ్ పూర్తి చేసి డ్రగ్స్‌కు అలవాటుపడిన అన్నదమ్ములు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరిని వీరి తల్లి కూడా ప్రోత్సహిస్తుండటం విశేషం. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. విశాఖ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డిగోపీనాథ్‌రెడ్డి అనే అన్నదమ్ములు ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
*దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. మోహిత్‌ మోర్‌(24) అనే టిక్‌టాక్‌ సెలబ్రిటీను ముగ్గురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌లో మోహిత్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
*ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో జాతీయ రహదారి 26పై బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
*నవ వరుడి దారుణ హత్య తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని పెనుగుదురు-పాటర్లగడ్డ మధ్యలో ఈ హత్య జరిగింది. పేకేటి సూర్య నారాయణ వివాహం ఈ నెల న జరిగింది. అతనిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంట వద్ద నేడు పెను ప్రమాదమే తప్పింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మొండికుంట వద్ద ఎదురుగా వచ్చిన గేదెను తప్పించబోయి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. బస్సు కల్వర్టును ఢీకొట్టి అక్కడే ఆగిపోవడంతో బస్సులోని ప్రయాణికులకు ఏ ప్రమాదం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
*కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇండియన్‌ బ్యాంకులో నకిలీ పాసుపుస్తకాలతో పంట రుణాల కింద రూ.94.35 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన మంగళవారం వెలుగు చూసింది.
*తాగునీటి ఎద్దడి ప్రాణాలు హరించేంత తీవ్రస్థాయికి చేరింది. కర్నూలు జిల్లాలో పరిస్థితిని చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.
*విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు అలజడి కొనసాగుతూనే ఉంది. ఒడిశా, శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు కొంతకాలంగా స్థానిక రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
*మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. వివాహం చేసుకుని ఆనందంగా జీవించాలని కలలు గన్నారు. ఒకే కులం అయినా వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ప్రేమికుడికి మరో వివాహం నిశ్చయం చేశారు. దీంతో ప్రేమికులిద్దరూ రైలు కిందపడి తనువు చాలించారు. కడప జిల్లా వల్లూరు మండలంలో సోమవారం రాత్రి ఈ విషాదం చోటు చేసుకుంది.
*నాగర్‌కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలం బటవర్లపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు 25 మేకలు మృతిచెందాయి. మేకల మృతితో కాపరి విషాదంలో మునిగాడు.
*పలు పరీక్షల్లో నానా రకాలుగా చూచిరాతలకు పాల్పడే ఘనులున్నారు. అత్యాధునిక పరికరాలు వాడుతూ అధికారులకు పట్టుబడిన సందర్భాలూ అనేకం. జిల్లా కేంద్రమైన నారాయణపేటలోని స్ఫూర్తి ప్రైవేటు డిగ్రీ కళాశాలలో, మంగళవారం ప్రథమ సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలో.. ఒక విద్యార్థి చేతి గడియారం ద్వారా కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఆంగ్ల పరీక్ష రాస్తున్న అతడు మెటీరియల్‌ను ఫొటో తీసి, వాచీలో నిక్షిప్తం చేసి, చూసి రాస్తూ అధికారులకు దొరికిపోయాడు. ఆ గడియారాన్ని స్వాధీనం చేసుకున్న వారు అతడిని డిబార్‌ చేశారు.
*కరడుగట్టిన నేరగాడు నయీం సోదరి అయేషా బేగం, బావ మహ్మద్‌ సలీంను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నయీంతో కలిసి వీరు భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారని యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ భుజంగరావు తెలిపారు.
*ముందున్న వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్‌ మృతిచెందగా.. మరో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌కు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
*ఈత నేర్చుకునేందుకు చెరువులోకి దిగిన అన్న, తమ్ముడు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. జిల్లా కేంద్రం సిద్దిపేట వద్ద మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనలో మృతులిద్దరూ 15, 12 ఏళ్ల వయస్కులు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సమీపంలోని హనుమాన్‌ నగర్‌కు చెందిన లక్ష్మణ్‌, గణేశ్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 5, 3 తరగతులు పూర్తిచేశారు.
*గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొనడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి.
*దేశ రాజధాని దిల్లీలో ఓ పిండి మిల్లు ట్యాంకులో చిక్కుకుని ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. లారెన్స్‌ రోడ్డులోని పిండి మిల్లు ట్యాంకు శుభ్రం చేసేందుకు దిగిన కార్మికులు అక్కడే మరణించారు. కార్మికులు ట్యాంకులో ఉండగా.. కొంతసేపు ట్యాంకు మూత బిగించి ఉండడంతో విషవాయువులు పీల్చి చనిపోయారని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*కుమార్తె స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై నారాయణగూడ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.
*వివాహ వేడుకలు జరిగే ఇంటికి లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలు పాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది.
*రాప్తాడు మండలంలోని బండమీదపల్లిలో ఉపాధి కూలీ మద్దిలేటి (50) మృతిచెందినట్లు స్థానికులు చెప్పారు.
*కోడూర మండలంలోని హంసలదీవి సమీపంలో సాగర సంగమం వద్ద స్నానం చేస్తూ గల్లంతైన బీటెక్‌ విద్యార్థి సరికే ఆనంద ఈశ్వర విహారి(19) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
* ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్(78) కన్నుమూశారు. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మొదట ఆయన సీసీఎంబీకి రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. జేఎన్‌టీయూ కాలేజీలో ఫైన్‌ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్టర్ కోర్సులో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు.
* రేపు మద్యం దుకాణాలు మూసివేత23న మద్యం దుకాణాల మూసివేత సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులోభాగంగా ఈనెల 23 నుంచి మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేతఈమేరకు అబ్కారీ శాఖ అధికారులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం23వ తేదీ ఉదయం 5 నుంచి 24వ తేదీ ఉదయం 5 వరకు మూసుకొనున్న మద్యం దుకాణాలు మరో వైపు అబ్కారీశాఖ అధికారులు బుధవారం నుంచి అక్రమ నిల్వలపై మెరుపు దాడులు చేసే అవకాశం.
* బ్యాంకులో రుణం తీసుకొని పెట్టుబడిగా పెట్టి పంటలు వేస్తే అదికాస్తా చేతికందలేదని, దీనివల్ల తాను చేసిన అప్పు తీర్చలేక ఊబిలో కూరుకుపోయాననే ఆవేదనతో ఓ రైతు కలెక్టరేట్‌లో, చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన, రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ ఘడ్ జిల్లా కలెక్టరేట్ లో వెలుగుచూసింది. హనుమాన్ ఘడ్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ చెట్టుకు 48 ఏళ్ల రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శవం వద్ద బ్యాంకు రుణం నోట్ ఉంది. పోలీసులు రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ ఘటన చింతమనేపల్లి మండలం గంగాపూర్‌లో బుధవారం ఉదయం జరిగింది. గంగాపూర్ కు చెందిన శ్రీనివాస్ ఇంట్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన . నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
* కర్నూలు జిల్లా డోన్‌ లో బుధవారం దారుణ హత్య చోటు చేసుకుంది. మల్లెంపల్లి వద్ద కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి అనుచరుడు శేఖర్‌ రెడ్డి తలపై బండరాయితో మోది దుండగులు చంపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ హత్యకు రాజకీయ కారణాలా, వ్యాపార లావాదేవీలా, ఫ్యాక్షన్‌ గొడవలా. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* షాపు యజమాని హత్య ఘటనకు సంబంధించి యూపీ పోలీసులు కానిస్టేబుల్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. షామ్లి జిల్లాలోని మజ్రా రోడ్డు ప్రాంతంలో అమిత్ షాపులోకి వచ్చి అమిత్ కుమార్‌పై కాల్పులు జరిపి పారిపోయారు.