DailyDose

తాడేపల్లి చేరుకున్న జగన్-రాజకీయ-05/22

May 22 2019 - Daily Political News - Jagan Reaches Amaravati - TNILIVE - తాడేపల్లి చేరుకున్న జగన్-రాజకీయ-05/22

* విజయవాడ చేరుకుంటున్న వైసీపీ కీలక నేతలు.ఫలితాల ముందు రోజు విజయవాడ రావాలని పార్టీ నేతలను ఆదేశింన జగన్.నేడు సాయంత్రం తాడేపల్లిలో తన నివాసానికి చేరుకోనున్న జగన్.రేపటి కౌంటింగ్ ఫలితాలను తాడేపల్లిలోని నివాసం నుంచి పర్యవేక్షించనున్న జగన్.
* మొదటగా నరసాపురం.. చివరగా నందిగామా ఫలితాల వెల్లడి.
ఈనెల 23న జరుగనున్న ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఏ నియోజకవర్గం నుంచి తొలిఫలితం వస్తుందన్నది అందరికీ ఆసక్తే. అలాగే చిట్టచివరి ఫలితం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవటమూ ముఖ్యమే. రాష్ట్రంలో అతితక్కువ రౌండ్లతో తొలిగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం ఫలితాలు వెల్లడి కానున్నాయి. చిట్టచివరిగా నందిగామ ఫలితం రానుంది.
* సిద్ధరామయ్య పనితీరు బాగాలేదు: జేడీఎస్‌ నేత
కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించడం లేదంటూ జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.విశ్వనాథ్‌ ఆరోపించారు. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విశ్వనాథ్‌ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.‘‘ నేను కేవలం సిద్ధరామయ్య గురించే మాట్లాడడం లేదు. కూటమి పెద్దగా ఆయన ఇరు పార్టీలను కలుపుకొని పోవాలన్నదే నా వాదన.
*చంద్రబాబు పై విజయసాయి రెడ్డి ఆరోపణలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు పర్యటనలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం ట్విటర్‌లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో స్పందిస్తూ.. ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు. వీవీప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు. తన అనుకూల వ్యక్తులతో ఏపీ హైకోర్టులో, సుప్రీంలో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయి. 23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు. ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు అని విమ‌ర్శించారు.ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై ఒక అంచనాకు రావచ్చని తెలుస్తున్నది.
*దూరదర్శన్ గూగుల్ ప్రత్యక్ష ప్రసారాలు
గురువారం విడుదలకానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రసారం చేసేందుకు ప్రసార భారతి, గూగుల్‌ సంస్థలు చేతులు కలిపాయి. రాష్ర్టాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం లైవ్‌స్ట్రీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వార్తా విశ్లేషణ, చర్చల కార్యక్రమాలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసే అంశంపై ఇరు సంస్థలు ఒప్పదం చేసుకున్నాయి. గురువారం రోజు యూట్యూబ్‌ వెబ్‌సైట్‌, యాప్‌లలో పతాక శీర్షికన డీడీన్యూస్‌-ఎన్నికల ఫలితాల సమాచారం లింక్‌ను ప్రదర్శిస్తారు. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే డీడీ న్యూస్‌ లైవ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ఓపెన్‌ అవుతుంది. దాంతో పాటు పలు ఇతర భాషల్లో ప్రసారాలను వీక్షించేందుకు 14 డీడీ రీజియనల్‌ స్టేషన్ల లైవ్‌స్ట్రీమ్‌ ఆప్షన్‌ కూడా ఉందని ప్రసారభారతి ఒక ప్రకటన లో తెలిపింది.
*లగడపాటి పై రోజా ఫైర్
నగరి ఎంఎల్‌ఎ రోజా బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. రేపు ఎన్నికల కౌంటింగ్లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రెండవసారి నగరి ఎంఎల్‌ఎ గా తాను గెలిచి, నగరిని అభివృద్ధి చేస్తానన్నారు. లగడపాటి సర్వే దొంగ సర్వే అని, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే లు దొంగ సర్వే లుగా తేలాయని, వాటిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. చంద్రబాబు అయిదు సంవత్సరాలలో హెరిటేజ్‌ ను అభివృద్ధి చేస్కోవడానికే రాష్ట్రాన్ని వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్రం లో ఉన్న మహిళలను అప్పులపాలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు ఎక్కించారని ఆరోపించారు…
*ఇండోనేషియా అద్యక్షుడిగా జోకో.
ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో మరోమారు జోకో విడోడో ఎన్నికయ్యారు. ఏప్రిల్‌ 17న జరిగిన ఈ ఎన్నికలకు ఫలితాలను బుధవారం ప్రకటించాల్సి ఉంది. దేశంలో నెలకొన్న అశాంతిని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందే ప్రకటిస్తున్నట్లు ఇండేనేషియా ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు.. జోకో మోసపూరిత విధానంతో గెలిచారని ఆయన ప్రత్యర్థి ప్రబోవో సూబియాంటో ఆరోపిస్తున్నారు.
*యూ ట్యూబ్ లో ఫలితాల ప్రత్యక్ష ప్రసారం
దేశవ్యాప్తంగా ఉత్కంట రేకెత్తిస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు యూ ట్యూబ్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇందుకోసం ప్రముఖ సెర్ఫ్ ఇంజిన్ గూగుల్, ప్రసార భారతి తొలిసారిగా చేతులు కలిపాయి. గురువారం ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన సంబందిత సమాచార మంతటినీ ప్రత్యెక యూ ట్యూబ్ చానెల్ ద్వారా డీడీ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తుండటం ప్రసార భారతి సిఈవో శశిశేఖర్ వెంపటి తెలిపారు. ఆరోజు మనదేశంలో వెబ్ సైట్ ద్వారాగానీ యాప్ ద్వారాగానీ యూట్యూబ్ ని ఓపెన్ చేసే అన్నిటికంటే పైన ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రససారమే కనిపిస్తుందని వెల్లడించారు. పద్నాలుగు భిన్న భాషల్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే అవకాశం కల్పిస్తామన్నారు.
*చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర భారీ భద్రత
రేపు ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో టీడీపీ, వైసీపీ అధినేతలు చంద్రబాబు, జగన్ ఇళ్ల దగ్గర అవాంఛనీయ ఘటనలేవీ జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ముందుస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటూ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా గురువారమే జరుగుతుండటంతో.. ఈవీఎంలు, వీవీప్యాట్లకు మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లే కీలక నేతలకు కూడా అదనపు సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అల్లరి మూకలు, అరాచక శక్తులు, అదృశ్య శత్రువులూ ఏదో ఒక దారుణానికి పాల్పడి ఆ నెపాన్ని ప్రత్యర్థి పార్టీపైకి నెట్టేస్తాయన్న నిఘావర్గాలు సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు, జగన్ ఇళ్లు, పార్టీ కార్యాలయాలు అన్నీ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్నాయి. ఆ ఇద్దరు నేతల ఇళ్ల దగ్గర ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు దగ్గరుండి మరీ చేశారు. బుధవారం రాత్రి నుంచే ఈ ఇళ్ల దగ్గర ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రెండేసి కంపెనీల బలగాలు నిరంతరం కాపలా కాస్తున్నాయి. అలాగే స్థానిక పోలీసులు కూడా 50 మంది చొప్పున సెక్యూరిటీ విషయంలో పనిచేస్తున్నారు.
*విదేశీ పర్యటనకు అనుమతించాలని వాద్రా వినతి
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వాద్రా మంగళవారం ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అక్రమ నగదు చలామణి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం.. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పై పిటిషన్‌ దాఖలు చేశారు.
*కిర్గిజ్‌ మంత్రితో సుష్మా స్వరాజ్‌ భేటీ
విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌.. కిర్గిజ్‌ విదేశీ వ్యవహారాల మంత్రి చింగిజ్‌ అయిదర్‌బెకోవ్‌తో మంగళవారం సమావేశమయ్యారు. కిర్గిజ్‌ రాజధాని బిష్కెక్‌లో రెండు రోజులపాటు జరగనున్న షాంగై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) విదేశీ మంత్రుల సమావేశం కోసం సుష్మా మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.
*ఎంపీలో కమల్‌నాథ్‌కు కాక
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడిన వెంటనే మధ్యప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రతిపక్షమైన భాజపా దాడి ప్రారంభించింది. మరోవైపు భాజపాలోని లుకలుకలు కూడా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో శాసనసభను అత్యవసరంగా సమావేశపరచాలని కోరుతూ ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు సోమవారం లేఖ రాశారు. గత ఆరు నెలలుగా సభ సమావేశం కాలేదని, ఆర్థిక అంశాలను చర్చించవలసి ఉందని అందులో పేర్కొన్నారు.
*దేశాభివృద్ధికి రాజీవ్‌ సేవలు మరువలేనివి
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశ సర్వతోముఖాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రధానమంత్రి మోదీ.. తప్పుడు ప్రచారంతో రాజీవ్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
*ఎన్నికల ఫలితాల తరువాత ఏం చేద్దాం?
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌తో ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ చర్చించారు. మంగళవారం లఖ్‌నవూలో అఖిలేశ్‌ను కలసిన అనంతరం సీనియర్‌ ఆప్‌ నాయకుడు సంజయసింగ్‌ ఈమేరకు చెప్పారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై అఖిలేశ్‌తో కేజ్రీవాల్‌ ఫోన్లో చర్చించినట్లు చెప్పారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకోవడమే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. మే 23న ఫలితాలు వెలువడ్డాక తదుపరి కార్యాచరణ ప్రణాళిక రచిస్తామన్నారు.
*మాకు గతంలో కంటే ఎక్కువ సీట్లు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీపీఐకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, పార్లమెంటులో తమ వాణిని తప్పక వినిపిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను తాము విశ్వసించడంలేదన్నారు.
*విపక్షాలకు ఈసీ షాక్
విపక్షాల‌కు ఎన్నిక‌ల సంఘం షాకిచ్చింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో మార్పు ఉండ‌ద‌ని ఇవాళ ఈసీ స్ప‌ష్టం చేసింది. ఈవీఎంల‌ను లెక్కించ‌డానికి ముందే వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాల‌ని విప‌క్షాలు ఈసీని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంద‌ని ఈసీ వెల్ల‌డించింది. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్‌, ఆ త‌ర్వాత ఈవీఎంలు, చివ‌ర‌గా వీవీప్యాట్ల‌ను లెక్కించ‌నున్నారు. వీవీప్యాట్ల ఎంపిక లాట‌రీ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి 5 వీవీప్యాట్లు లెక్కించాల‌ని ఇటీవ‌ల సుప్రీం తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే.
*బెంగాల్‌లో హింసను అడ్డుకోండి
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం తలెత్తిన హింసను అడ్డుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కేఎన్‌ త్రిపాఠీని భాజపా కోరింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ నేతృత్వంలో పార్టీ నేతలు మంగళవారం గవర్నర్‌ను కలిసి తృణమూల్‌పై ఫిర్యాదు చేశారు. ‘ఎన్నికల్లో గెలవడానికి తృణమూల్‌ అరాచకం సృష్టించింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బత్పారాతోపాటు దక్షిణ బెంగాల్‌లో చాలా ప్రాంతాల్లో టీఎంసీ కార్యకర్తలు హింసకు ప్పాలడ్డారు.
*ఓట్ల లెక్కింపు వద్ద అప్రమత్తంగా ఉండండి
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూసి నిరాశ చెందవద్దని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కార్యకర్తలను కోరారు. ఈ మేరకు మంగళవారం సందేశం పంపించారు. ‘‘ప్రియమైన కార్యకర్తలు, సోదర సోదరీమణులకు…ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు, వదంతులను చూసి నిరాశ చెందకండి. మీ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికే వీటిని వ్యాపింపజేస్తున్నారు.
*28న అన్నదానం, పతాకావిష్కరణలు: తెదేపా
ఈ ఏడాది మహానాడు నిర్వహించడం లేదని, ఈ నెల 28న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ పతాకావిష్కరణ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించాలని తెదేపా తెలంగాణ శ్రేణులకు పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. గతంలో మూడు సార్లు మాత్రమే మహానాడు నిర్వహించలేదని, ఇప్పుడు నాలుగోసారి నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
*ఓట్ల లెక్కింపు వద్ద అప్రమత్తంగా ఉండండి
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చూసి నిరాశ చెందవద్దని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కార్యకర్తలను కోరారు. ఈ మేరకు మంగళవారం సందేశం పంపించారు. ‘‘ప్రియమైన కార్యకర్తలు, సోదర సోదరీమణులకు…ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు, వదంతులను చూసి నిరాశ చెందకండి. మీ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికే వీటిని వ్యాపింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు మరింత జాగురూకతతో వ్యవహరించండి. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అప్రమత్తంగా ఉండండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
*25న లోక్‌సత్తా కార్యవర్గ సమావేశం
లోక్‌సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన విజయవాడలో జరగనున్నట్లు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్‌ వర్మ అధ్యక్షత వహించనుండగా, వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని పేర్కొంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించింది.
*కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం
బఫూన్‌ లాంటి పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌.. ఫ్లాప్‌ షో నడిపిన పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు.. దురహంకారి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల వైఖరితో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రోషన్‌బేగ్‌ విరుచుకుపడ్డారు. పార్టీ నియంతృత్వ ధోరణికి తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ దర్పణమని ఆయన మాధ్యమాల ముందు వ్యాఖ్యానించారు.
*రాప్తాడులో కౌంటింగ్‌ ఏజెంట్లుగా నేరచరితులు: వైకాపా నేత గౌతంరెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు రోజున గొడవలు సృష్టించేందుకు తెదేపా కుట్రలు చేస్తోందని వైకాపా అధికార ప్రతినిధి గౌతంరెడ్డి ఆరోపించారు. నేరచరిత్ర ఉన్న వారిని పార్టీ ఏజెంట్లుగా నియమించిందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు.