Movies

కూర్చుని ఖర్చుపై చర్చ

Director and producer reach harmony on starting indian 2 shooting from june - tnilive telugu news international - telugu latest movie news - కూర్చుని ఖర్చుపై చర్చ - shankars indian 2 update

కమల్‌ హాసన్‌ – శంకర్‌ల ‘భారతీయుడు 2’ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. బడ్జెట్‌ సమస్యల వల్లే ఈసినిమా ముందుకు సాగడం లేదని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఉండదేమో అనుకుంటున్న తరుణంలో.. ‘భారతీయుడు 2’పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. దర్శకుడు, నిర్మాత… ఇద్దరూ కూర్చుని బడ్జెట్‌పై ఓ అవగాహనకు వచ్చారని, ఈ సినిమాని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఖర్చుని తగ్గించే పనిలో భాగంగా కథలో కొన్ని కీలకమైన మార్పులు చేశారని తెలుస్తోంది. ఇది వరకే ‘భారతీయుడు 2’కి సంబంధించి కొంత మేర షూటింగ్‌ జరిగింది. కాజల్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021లో విడుదల చేసే అవకాశాలున్నాయి.