DailyDose

మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి-తాజావార్తలు–05/23

May 23 2019 - Daily Breaking News - Devagowda lost in 2019 elections

* కర్ణాకటలోని తుమకూరు లోక్‌సభ నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోయారు. ఈ స్థానంలో భాజపా అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు.
* లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) జోరు ప్రదర్శిస్తోంది. అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ అధికారపార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల శాసనసభ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకేకు గట్టి పోటీ ఇస్తోంది.
* ఈనెల 29న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ఈనెల 28న వారణాసికి మోడీ.
*రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే సూచనలున్నాయి.
*భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు చేపట్టిన పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 ప్రయోగం విజయవంతమైంది.
*వీవీప్యాట్లలోని చీటీల లెక్కింపుపై విపక్షాల అభ్యర్థనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపునే తొలుత చేపడతామని స్పష్టం చేసింది. అలా కాకుండా మొదటే వీవీప్యాట్ల గణన సాధ్యంకాదని బుధవారం దిల్లీలో జరిగిన ఎన్నికల కమిషనర్ల సమావేశం అనంతరం ఈసీ ప్రకటించింది.
*ఈవీఎంల్లోని ఓట్లకు వీవీప్యాట్ల చీటీలకు లెక్క సరిపోకపోతే చివరకు వీవీప్యాట్ల చీటీలనే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులకు సవివరంగా సూచనలు పంపించింది.
*తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ వేసిన పిటిషన్‌లను హైకోర్టు తిరస్కరించింది.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురికి పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకొంది.
*తెలంగాణ ఈసెట్‌ రాసిన వారిలో 90.32 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 27,123 మంది పరీక్ష రాయగా వారిలో 24,497 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌కు అర్హత పొందారు.
*ఏపీఎస్‌ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది.. జూన్‌ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేతృత్వంలోని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస బుధవారం ప్రకటించింది.
* ఆస్తమా నయం కోసం ఏటా మృగశిరకార్తె ప్రవేశం రోజున పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని ఈ ఏడాది జూన్‌ 8న నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో అందించనున్నామని బత్తిని సోదరులు తెలిపారు. చేపలు మింగనివారు బెల్లంలో సైతం ప్రసాదాన్ని తీసుకోవచ్చన్నారు. ఈ ఏడాది మృగశిరకార్తె జూన్‌ 8న సాయంత్రం 6 గంటలకు ప్రవేశించనుండటంతో ఆదే సమయంలో పంపిణీ మొదలవుతుంది. మర్నాడు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని బత్తిని సోదరులు గౌరీశంకర్‌, హరినాథ్‌గౌడ్‌ వివరించారు.
*తెలంగాణలో ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా భూములు కేటాయిస్తోందని కాంగ్రెస్‌ నేత మానవతారాయ్‌ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేశారు.
*రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో 2019-20 విద్యా సంవత్సరం ప్రవేశాలకు 23, 24 తేదీల్లో ప్రవేశ పరీక్ష ఐసెట్‌-2019 నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ సీహెచ్‌.రాజేశం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
*విజయ డెయిరీ టర్నోవర్‌ గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2017-19) రూ.572.8 కోట్ల నుంచి రూ.628 కోట్లకు పెరిగిందని ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ తెలిపారు. రోజువారీ సగటు పాల విక్రయాలు 3 లక్షల లీటర్ల నుంచి 3.23 లక్షల లీటర్లకు పెరిగాయన్నారు.
*డీఈడీ, డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన డీఈఈసెట్‌కు 75 శాతం హాజరయ్యారు. మొత్తం 25,584 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 19,190 మంది పరీక్ష రాశారు.
*విజయడెయిరీ నూతన ఛైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఇప్పటికే బోర్డు డైరెక్టర్‌గా ఉన్న ఆంజనేయులును మిగతా బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనారోగ్యం, వయోభారం కారణంగా ప్రస్తుత ఛైర్మన్‌ మండవ జానకీరామయ్య తన పదవికి రాజీనామా చేశారు.
*చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ను పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న సీహెచ్‌ వెంకటేశ్వరరావును సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద ప్రస్తుతం సందడి నెలకొంది.
*కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ బి.లక్ష్మీనారాయణపై సస్పెన్షన్‌ వేటుపడింది.