DailyDose

జగన్ దాడి కేసు ముద్దాయికి బెయిల్-నేరవార్తలు–05/23

May 23 2019 - Daily Crime News - Jagan Attackee Gets Bail

* జగన్ పై దాడి కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేసిన ఎన్ఐఏ కోర్టు.మరో రెండు రోజుల్లో బెయిల్ పై విడుదలకానున్న నిందితుడు శ్రీనివాస్.
*గుండె పోటుతో ఉపాధి కూలి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతకాయలపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఉపాధి హామీ కూలీలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాయలపల్లి గ్రామానికి చెందిన రమణయ్య(52) ఉపాధి పనులకు గ్రామ సమీపంలోని ఓ ప్రాంతానికి తన భార్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో పనిచేస్తూ గుండె పోటుతో ఒక్కసారిగా కుప్ప కూలి మృతి చెందినట్లు వారు తెలిపారు.
*కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం తాపలకొత్తూరులో ఆస్తి తగాదాల నేపథ్యంలో తెదేపా కార్యకర్త రేమట శేఖరరెడ్డి(58) బుధవారం దారుణ హత్యకు గురయ్యారు.
*నకిలీ ఇన్‌వాయిస్‌లతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వ్యవహారాన్ని మేడ్చల్‌ కేంద్ర జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గుట్టురట్టుచేశారు.
*ఒడిశాలోని కలహండి జిల్లాలో 26వ నంబరు జాతీయ రహదారిపై జొరింగ వద్ద బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురితో పాటు పనిమనిషి మృతి చెందారు.
*క్వారీల్లో కార్మికులుగా పని చేస్తూ పేలుడు పదార్థాలు సేకరించి, దళాలకు సరఫరా చేసే ముగ్గురు మావోయిస్టులను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.
* మూడేళ్ల నుంచి వరుసగా 51 గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అన్నదమ్ములను, వారికి సహకరించిన తల్లిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు..
*ఎలాంటి వ్యాపారం చేయకుండా నకిలీ బిల్లులు సృష్టించి జీఎస్టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్‌ కేంద్ర జిఎస్టీ అధికారులు రట్టు చేశారు. కోల్‌కతా నుంచి ఇటీవల అందిన పక్కా సమాచారంతో నిఘా పెట్టిన అధికారులు ఐదు బోగస్‌ కంపెనీలపై దాడులు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు మేడ్చల్‌ కేంద్ర జిఎస్టీ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.
* మోజో టీవీ సీఈవో రేవతికి బంజారాహిల్స్‌ ఏసీపీ నోటీసులు జారీచేశారు. నాలుగు నెలల క్రితం మహిళలకు అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశంపై వివాదం నేపథ్యంలో మోజో టీవీలో చర్చకు ఆహ్వానించి ఓ దళితుడిని అవమానించారనే అభియోగంపై ఆమెపై కేసులు నమోదయ్యాయి.
*మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే, తెరాస నేత మైనంపల్లి హనుమంతరావుకు గాయపడ్డారు. చిక్కడపల్లిలోని ఓ హోటల్‌లో లిఫ్టువైర్‌ తెగిపోవడంతో అందులో ఉన్న ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.