Politics

తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్ని సిత్రాలో!

Interesting things in 2019 elections in andhra and telangana-tnilive

సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా మూడూ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి పోటీ చేసిన వారి సంతానం విజయం సాధించలేకపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృ,ష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూతురు కవితది సైతం ఇదే పరిస్థితి. మొన్నటి అసెంబ్లీ స్థానాల్లో ఫుల్ జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌….ఈ లోక్‌సభ ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకుంది. అందులో భాగంగా నిజమాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేశారు కేసీఆర్‌ కుమార్తె కవిత. ఇక్కడ గులాబీ విజయం నల్లేరుమీద నడకేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా … బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు కవిత. 68వేల మెజారీటీతో ధర్మపురి అరవింద్ ఇక్కడ గెలుపొందారు. ‌అటు… కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుత సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయగా… స్వతంత్ర్య అభ్యర్ధి సుమలత చేతిలో 67 వేల ఓట్ల తేడాతో ఓడియారు. సీఎం కుమారుడు కాబట్టి నిఖిల్‌ గెలవడం చాలా సులువుని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ… ఇక్కడ సమలత విజయం సొంతం చేసుకున్నారు.మరోవైపు… రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ గెహ్లాట్‌ ఓటమి పాలయ్యారు.సీఎం కుమారుడు కావడంంతో వైభవ్‌ గెలుపు తధ్యమనుకున్నారు. కానీ…. రిజల్ట్‌ మాత్రం పూర్తి వ్యతిరేకంగా వచ్చింది. ఆయన బీజేపీ అభ్యర్ధి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేతిలో ఓడిపోయారు. మరోవైపు… రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ నాలుగోసారి ఝలావర్ – బరన్‌ సీట్ నుంచి విజయం సాధించడం విశేషం.ఇక ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావడం.. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇదే తొలిసారి. గతంలో ఎన్టీఆర్‌ సీఎం అయినా.. ఆయన కుమారులు సీఎంలు కాలేకపోయారు. నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడు మనోహర్‌ సైతం కేవలం ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గాగు ర్తింపు పొందారు. అంతేకాదు…ఈ పొలిటికల్‌ రేసులో జగన్‌తో పాటు ఆయన బంధుగణం సైతం విజయం సాధించడం విశేషం. కడప ఎంపీగా అవినాష్‌ రెడ్డి విజయం సాధించగా.. రవీంద్రనాథ్‌రెడ్డి కమాలపురం శాసనసభ నియోజకవర్గంలో గెలుపొందారు.