DailyDose

ప్రాణం తీసిన బెట్టింగ్-నేరవార్తలు–05/24

May 24 2019 - Daily Crime News - Man killed in 2019 political betting in india-TNILIVE

* కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్ లకు మించి ఏపీలో పొలిటికల్ బెట్టింగ్ లు జోరుగా కాసారు పందెం రాయుళ్లు. వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నేత ఒకరు తన ఆస్తిని మొత్తం బెట్టింగ్ వేస్తానని చెప్పడం ఫలితాలకు ముందు హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలోనే నేతల బెట్టింగులు ఊపందుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా తమ పార్టీలపై నమ్మకంతో భారీగా బెట్టింగ్ వేశారు. అయితే ఓ పందెం ఓ వ్యక్తి ప్రాణం తీసింది.
* గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ బిల్డింగ్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.
* వరంగల్ గ్రామీణం జిల్లాలోని వర్ధన్నపేట మండలం కాట్య్రాలలో దారుణం ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మల్లికాంబను భర్త యాదగిరి గొడ్డలితో నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
* కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి) మండలం పారిగాం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ మహిళ బైక్ పైనుంచి జారిపడి మృతిచెందింది. మృతురాలు కాగజ్‌నగర్ మండలం గన్నారం వాసి తులసి(49). సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
* ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమితో కంఠమనేని వీర్రాజు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరిలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో ఘటన జరిగింది. ఆత్మహత్యకు బెట్టింగే కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. టీడీపీ గెలుస్తుందని వీర్రాజు రూ.12లక్షలు పందెం కాశాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడటంతో బెట్టింగ్‌లో పెట్టిన డబ్బులను అతడు కోల్పోయాడు. దీంతో నిరాశకుగురైన వీర్రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు సన్నిహితులు పేర్కొన్నారు.
* నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో పాటు అత్త, మరిది కలిసి ఆరు నెలల గర్భవతిపైన కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు సీతాలు తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
* విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మళ్లీ కత్తి కలకలం రేగింది. శుక్రవారం ఓ వ్యక్తి వేట కత్తి చేతిలో పట్టుకుని ఎయిర్‌పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్కింగ్‌ నుంచి ఇన్‌గేట్‌ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
* ఉపాధిహామీ పథకం కూలీ బదనాపురి రమణయ్య (50) పనిచేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన గురువారం నందలూరు మండలంలో చోటుచేసుకొంది.
*ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతిచెందిన సంఘటన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం సమీపంలో చోటు చేసుకుంది.
* ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన ఘటన మనుబోలు మండలంలోని మనుబోలు చెరువు కట్ట వద్ద గురువారం చోటుచేసుకుంది.
*తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటుతున్న బాలికను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో దుర్మరణం చెందింది. జాతీయ రహదారిపై కంచికచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయ సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
*ఖానాపూర్‌ పట్టణంలోని పద్మావతి నగర్‌ కాలనీలో జరిగిన ఓ యువకుడి హత్య సంచలనంగా మారింది.
*మంచిర్యా మండలంలోని పోలంపల్లిలో ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. గ్రామానికి చెందిన మిర్యాల రాజేందర్‌(33) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన తన ధాన్యాన్ని పరిశీలించేందుకని వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు మందమర్రిలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
*సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వైకాపా గెలవబోతుందన్న ఆనందంలో ఓ ఆటోవాలా చూపిన అత్యుత్సాహం నాలుగేళ్ల బాలుడిని బలితీసుకుంది.
*బుడిబుడి నడకలతో ఆడుకుంటూ కారులోకి వెళ్లిన నాలుగేళ్ల పసివాడు.. ఆ కారు తలుపు మూసుకుపోయి ఊపిరాడక మరణించాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్‌లో గురువారం చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన కుటుంబసభ్యులతో పాటు అందరినీ కంటతడి పెట్టించింది.
*భద్రాచలంలోని ఓ కాలనీలో యువతిపై అత్యాచారం చోటు చేసుకున్న సంఘటన ఇది. గురువారం ఉదయం ఈ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.
*ఖానాపూర్‌ పట్టణంలోని పద్మావతి నగర్‌ కాలనీలో జరిగిన ఓ యువకుడి హత్య సంచలనంగా మారింది.
* గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కోచింగ్‌ సెంటర్‌ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
* ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ సమీపంలోని పక్టియాకోట్‌ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలైనట్లు సమాచారం.