DailyDose

జగన్ మేనిఫెస్టో ఇదే-రాజకీయ-05/24

May 24 2019 - Daily Political News - YSRCP 2019 Manifesto-TNILIVE politcal news

* ఆంధ్ర రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 2019 మానిఫెస్ట్30వ తేదీన తొలి సంతకాలు ఈ పథకాలు పైనే1.రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ2. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు 45 సంవత్సరాలకే 3000 పెన్షన్ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు3.ప్రతి రైతుకు ఉచితంగా బోర్లు వేయిస్తాం4. వైయస్సార్ పెళ్ళికానుక కింద ఒక లక్ష రూపాయలు5. ఆరోగ్యశ్రీ కింద1000 రూపాయల నుండి ఎన్ని లక్షల రూపాయల వరకు అన్న ఏ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స జరిగిన వైయస్సార్ ప్రభుత్వమే భరిస్తుంది6. ప్రతి ఇంటిలో పిల్లలు ఉన్న బడికి పంపిస్తే 15000 రూపాయలు ప్రతి ఏటా ప్రభుత్వం భరిస్తుంది7. ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం ప్రతి ఏటా 12,500 ప్రభుత్వం చెల్లిస్తుందిమేనిఫెస్టో ఉన్న నవరత్న పథకాలు పూర్తిగా అమలు చేస్తాం
*ఏపీ.. మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగింపు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సచివాలయంలో మంత్రుల నేమ్ ప్లేట్స్ తొలగించాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరిపాలన శాఖ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది మంత్రులు పేషీల్లో నేమ్ ప్లేట్స్ తొలగించారు. చంద్రబాబు ఫోటోలను కూడా తొలగించారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ వైసీపీ 151, టీడీపీ 23 స్థానాల్లో గెలిచాయి. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
*పార్టీ నేతలతో పవన్ కీలక భేటీ
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గుంటూరుజిల్లా మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల సరళి రాజకీయ పరిణామాలు, తదుపరి కార్యాచరణ పై కీలకంగా చర్చినచినట్లు తెలుస్తోంది. తమ పరిశీలనకు వచ్చిన వివిధ అంశాలను నేతలు పవన్ కు వివరించారు. వచ్చేనెల మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.
* జగన్‌కు కొత్త కాన్వాయ్‌..
అసెంబ్లీ ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న వైకాపా అధినేత జగన్‌కు పోలీసులు భద్రత పెంచారు. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త ముఖ్యమంత్రి కోసం సరికొత్త కాన్వాయ్‌ కూడా సిద్ధమైంది. అధునాతన సౌకర్యాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి జగన్‌ నివాసానికి చేరుకుంది. మొత్తం 6 వాహనాలతో ఈ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. AP 18P 3418 నంబర్‌తో కొత్త వాహనాలను ఆయన ఇంటివద్ద సిద్ధంగా ఉంచారు. ఈ నెల 30 జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచారు.మరోవైపు జగన్‌ను కలిసి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.
* ఆంధ్ర ప్రజల పీడ విరగడ అయింది- మోత్కుపల్లి
గాడ్సే కంటే దుర్మార్గుడు చంద్రబాబు అని, ఆనాడు ఎన్టీఆర్ అన్నారని టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. నేడు ఆయన ఎన్టీఆర్ ఘాట్‌కు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వైసీపీ విజయానికి గుర్తుగా ఆనందంతో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని మోత్కుపల్లి సంబరాలు చేసుకున్నారు. బాబు రాజకీయంగా పతనమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ఎవరినైనా వాడుకొని వదిలేసే నీచుడు చంద్రబాబు అని విమర్శించారు.
* 30న మోదీ ప్రమాణ స్వీకారం.
భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ తంతు కంటే ముందు ఆయన ఈనెల 28న వారణాసిలో పర్యటిస్తారు. అక్కడ ఆయన భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 28న వారణాసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. 29న సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్కడ తన తల్లి హీరాబెన్‌ వద్ద ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
* విశాఖ ఉత్తర ఫలితంపై వీడిన ఉత్కంఠ-గంటా విజయం సాధించినట్లు ప్రకటించిన అధికారులు
విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ వీడింది. తెదేపా అభ్యర్థి, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైకాపా అభ్యర్థి కేకే రాజు, ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టడంతో పాటు నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. తాజాగా గంటా విజయం సాధించినట్లు ప్రకటించారు.
* పంజాబ్‌లో కాంగ్రెస్‌ భల్లే భల్లే
కాంగ్రెస్‌కు పట్టం కట్టిన రాష్ట్రాల్లో పంజాబ్‌ ప్రముఖంగా నిలిచింది. 2017 శాసనసభ ఎన్నికల విజయ పరంపరను సార్వత్రిక సమరంలోనూ ఆ పార్టీ కొనసాగించింది. ఇక్కడ మొత్తం 13 లోక్‌సభ స్థానాలుండగా, హస్తం పార్టీ 8 చోట్ల విజయ ఢంకా మోగించింది. అకాలీదళ్‌-భాజపా చెరో రెండు సీట్లకు పరిమితమయ్యాయి. ఆప్‌ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అకాలీ-భాజపా ఉద్ధృత ప్రచారాన్ని ఎదురొడ్డి కాంగ్రెస్‌ హవా కొనసాగించడానికి బలమైన కారణాలెన్నో ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ వ్యక్తిగత పలుకుబడి ఆ పార్టీకి బాగా ఉపయోగపడింది.
* తమిళనాట డీఎంకే హవా
తమిళ ఓటర్లు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. కరుణానిధి, జయలలిత అనంతరం స్టాలిన్‌ను ద్రవిడ నేతగా గుర్తించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కనిపించింది. అధికార పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. జయలలిత తర్వాత ఆ పార్టీ పెద్దదిక్కులేనిదై పోయింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంల నాయకత్వాన్ని జనం ఆమోదించలేదు. ఈ పరిస్థితులన్నీ డీఎంకేకు కలిసి వచ్చాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో మహాకూటమిగా పోటీ చేయడంతో ఓట్ల బదిలీ కలిసొచ్చింది. పోటీ చేసిన 23 స్థానాల్లోనూ డీఎంకే విజయకేతనం ఎగురేసింది. ఇందులో మిత్రపక్షాల అభ్యర్థులు ముగ్గురు డీఎంకే గుర్తుపై పోటీ చేశారు. ఇదే కూటమిలో కాంగ్రెస్‌ 8, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే, ముస్లిం లీగ్‌ చెరో స్థానంలో గెలుపొందాయి. అధికార అన్నాడీఎంకే కేవలం ఒక్కచోటే గెలవగా, ఈ కూటమిలో ఉన్న భాజపా సహా ఇతర పక్షాలన్నీ ఓటమి పాలయ్యాయి. అన్నాడీఎంకే నేతలు సార్వత్రిక ఎన్నికల్లో ఉత్సవ విగ్రహాలుగా మిగిలారు. కూటమిలో పీఎంకే, డీఎండీకే, టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఏ ఫలితం దక్కలేదు. సంచలనం సృష్టిస్తుందనుకున్న దినకరన్‌ పార్టీ ఏఎంఎంకే ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. యువత, మహిళల ఓట్లపై ఆశలు పెట్టుకున్న కమల్‌హాసన్‌ పార్టీ ఎంఎన్‌ఎం నామమాత్రంగా మిగిలింది. పొరుగునున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ గెలుపొందింది.
*డిపాజిట్ కోల్పోయిన కిడారి శ్రవణ్
అరకు శాసనసభ స్థానం నుంచి తెదేపా అభ్యర్ధిగా బరిలోకి దిగిన కిడారి శ్రవణ్ కుమార్ ధరావత్తు కోల్పోయారు. రాష్ట్రంలో అధికార తెదేపా తరఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధి శ్రవణ్ ఒక్కరే కావడం విశేషం. ఆయన ఇటీవల వరకు మంత్రిగా కూడావ్యవహరించారు. అరకు నియోజకవర్గంలో మొత్తం 1,55,698 ఓట్లు పోలవ్వగా, శ్రవణ్ కుమార్ కు 19,281 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్హ్ది గెలుపొందగా వైకాపా రెబల్ గా పోటీ చేసిన అభ్యర్ధి రెండో స్థానంలో నిలిచారు.
*వైకాపాకు 49.96 శాతం ఓట్లు
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్ల వైకాపా అత్యధికంగా 49.96 శాతం ఓట్లు సాధించింది. తెదేపా 39.2 శాతం ఓట్లు పొందింది. ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్లలో పది శాతం వత్యాసం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైటులో గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఉంచిన వివరాల ప్రకారం వివిధ పార్టీలు సాధించిన ఓట్ల సంఖ్యా శాతాలు కింది విధంగా ఉన్నాయి. వీటిలో జనసేన ఓట్లను ప్రత్యేకంగా చూపించలేదు. ఇతరుల కేతగిరీల్లోనే జనసేన ఓట్లను కలిపి చూపించారు. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ భాజపా బీఎస్పీల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం.
* అంతా కోల్పోయినట్లు కాదు: మమత
లోక్‌సభ ఎన్నికల్లో విజేతలకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. అయితే ఓడిపోయినవారు అంతా కోల్పోయినట్లు కాదని ఆమె పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం మొత్తం పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్‌లు సరిపోలాల్సి ఉంటుందన్నారు.
* కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి?
లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టనుండటంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభలో రాష్ట్రం నుంచి నలుగురు భాజపా ఎంపీలు ప్రాతినిధ్యం వహించనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్‌, నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్‌, ఆదిలాబాద్‌ నుంచి గెలిచిన సోయం బాపురావు ఉన్నారు. వీరిలో కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖాయమన్న అభిప్రాయాలు కమలదళంలో వినిపిస్తున్నాయి.
*ప్రధాని మోడికి ప్రజల మద్దతు- కన్నా
ప్రజలంతా భాజపాకు పట్టం కట్టారు. మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే కోరుకున్నారని ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా నగర కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విజయోత్సవంలో ఆయన మాట్లాడారు.
*లక్ష్మీనారాయణ మూడో స్థానానికే పరిమితం
జనసేన విశాఖ అభ్యర్ధి వీ.వీ.లక్ష్మీనారాయణ పరాజయం పాలయ్యారు. నిజయతీపరుడైన పోలీసు ఉన్నతాధికారిగా సీబీఐ మాజీ జేడీగా సుపరిచితులైన ఆయనకు విశాఖ ఓటర్ల నుంచి మంచి స్పందనే లభించింది. విశాఖ గ్రామీణ ప్రాంతంలో వైకాపా గాలి విపరీతంగా వీయడంతో లక్ష్మీనారాయణ పై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు.
*నిపుణుల బృందం నివేదిక వినియోగించుకోవాలి
ప్రత్యెక హోదా సహా కేంద్రం ఇచ్చిన హామీలు ఎ దశలో ఉన్నాయి? వాటిని ఎ విధంగా సాధించుకోవచ్చు. తదితరాలపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను విభజన హామీల సాధనకు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఉపయోగించుకోవాలని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష నారాయణ్ సూచించారు. లోక్ సత్తా ఎఫ్ డీ ఆర్ చొరవతో స్వతంత్ర నిపుణుల బృందం వ్వ నివేదిక రూపొందించిందని ఒక ప్రకటనలో గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైకాపా అద్యక్షుడు జగన్ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
* వైకాపా ఎమ్మెల్సీలను వరించిన విజయం
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు వైకాపా ఎమ్మెల్సీలు గెలుపొందారు. తెదేపా తరఫున ఏడుగురు పోటీచేయగా పయ్యావుల కేశవ్‌, కరణం బలరామకృష్ణ మినహా మిగిలినవారు ఓటమి చవిచూశారు. వీరిలో మంత్రులు నారాయణ, నారా లోకేష్‌ ఉన్నారు. గెలుపుపై ధీమాతో పదవీకాలం కంటే ముందుగానే శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మరో తెదేపా సీనియర్‌ నేత రామసుబ్బారెడ్డి కూడా ఓటమి చవిచూశారు. తెదేపా ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎన్నికల సమయంలో ఆ పదవికి రాజీనామా చేశారు. వెంటనే వైకాపా తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
* ఏపీ సీఎంలలో జగన్‌ మూడో పిన్న వయస్కుడు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి….అతి పిన్న వయసులో సీఎం కానున్న మూడో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 46 సంవత్సరాల 6 నెలలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రప్రదేశ్‌లో కానీ ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో దామోదరం సంజీవయ్య అత్యంత పిన్న వయస్కులు. ఆయన 38 సంవత్సరాల 11 నెలల వయసులో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తర్వాత 45ఏళ్ల 5నెలల అతి తక్కువ వయసులో ముఖ్యమంత్రైన వారి జాబితాలో చంద్రబాబునాయుడు ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే.. అసోం ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రఫుల్లకుమార్‌ మహంత అత్యంత పిన్న వయసు(33 ఏళ్లకే)లో 1985లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అఖిలేష్‌కుమార్‌ 2012 మార్చి 15న 39 ఏళ్ల వయసులో సీఎం పీఠం అధిరోహించారు.
*ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంను ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశముంది. పదవీ విరమణ అనంతరం కొన్ని నెలలుగా సేవ ఆంధ్రప్రదేశ్ పేరిట జనచైతన్య వేదిక నిర్వహించిన సదస్సుల్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. వైకాపా తరపున పోటీ చేసిన అభ్యర్ధులు కౌంటింగ్ ఏజెంట్లను ఇటీవల ఆ పార్టీ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సూచనలు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినందున ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాద్రుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రత్యెక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన శ్యామూల్ కూడా వైకాపా విషయం కోసం కొంతకాలంగా పని చేస్తున్నారు. ఆయనకూ జగన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశముంది.
*విశాఖ ఉత్తర ఫలితంపై ఉత్కంఠ
విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించిన ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏయూ ప్రాంగణంలో గురువారం రాత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఇక్కడ నుంచి తెదేపా అభ్యర్థిగా మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈ సమయానికి ఆయన రెండువేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ కేంద్రంలో తొలుత కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ కారణంగా రౌండ్ల లెక్కింపునకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలను మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
*జగన్‌కు కొత్త కాన్వాయ్‌..
అసెంబ్లీ ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్న వైకాపా అధినేత జగన్‌కు పోలీసులు భద్రత పెంచారు. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త ముఖ్యమంత్రి కోసం సరికొత్త కాన్వాయ్‌ కూడా సిద్ధమైంది. అధునాతన సౌకర్యాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి జగన్‌ నివాసానికి చేరుకుంది. మొత్తం 6 వాహనాలతో ఈ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. AP 18P 3418 నంబర్‌తో కొత్త వాహనాలను ఆయన ఇంటివద్ద సిద్ధంగా ఉంచారు. ఈ నెల 30 జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా పెంచారు.మరోవైపు జగన్‌ను కలిసి అభినందించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. దీంతో ఆయన నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది.
*అడ్వాణీ, జోషీలను కలిసిన మోదీ
మోదీ తనను అందరూ ఎందుకు ఇష్టపడతారో మరోసారి నిరూపించారు. ఎన్నికల సమయంలో తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీని కూడా ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. మరో భాజపా కురువృద్ధుడు ఎల్‌కే ఆడ్వాణీని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు.
*చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
బైబై బాబు అంటూ వైకాపా కార్యకర్తలు ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు పార్టీ పతాకాలతో ర్యాలీగా చంద్రబాబు నివాసం వైపు వచ్చారు. బైబై బాబు అంటూ నినదిస్తూ బాణాసంచా కాల్చేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు నివారించారు. ఇంతలో తెదేపా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరగంటసేపు వైకాపా కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినదించారు. పోలీసుల జోక్యంతో వారు వెనుదిరిగారు.
*దేవేగౌడ త్యాగం.. మనవడి రాజీనామా
మనవడి రాజకీయ రంగ ప్రవేశం కోసం మాజీ ప్రధాని దేవేగౌడ తన కంచుకోటను దాటి బయటికొచ్చారు. తాత త్యాగం ఫలించి ప్రజ్వల్‌ రేవణ్ణ విజయం సాధించారు. అయితే కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దేవేగౌడకు మాత్రం విజయం దక్కలేదు. దీంతో తాతను పార్లమెంట్‌కు పంపేందుకు ప్రజ్వల్‌ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేవేగౌడ కుటుంబానికి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చాయి. దేవేగౌడ కుటుంబంలో ముగ్గురు తాజా ఎన్నికల్లో పోటీ చేయగా.. కేవలం ఒక్కరు మాత్రమే విజయం సాధించగలిగారు. జేడీఎస్‌కు ఎంతో పట్టు ఉన్న హసన్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దేవేగౌడ 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు.
*9 చోట్ల తెరాస జయకేతనం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించాలన్న తెరాస ప్రయత్నానికి భాజపా, కాంగ్రెస్‌లు బ్రేకులు వేశాయి. తెరాసకు అత్యంత కీలకంగా భావించే లోక్‌సభ స్థానాల్లో భాజపా పాగా వేసింది. తెరాస తొమ్మిదింటిలో గెలుపొంది తెలంగాణలో తన ఆధిక్యాన్ని నిలుపుకోగా, భాజపా నాలుగు, కాంగ్రెస్‌ మూడు, ఎంఐఎం ఒక స్థానం దక్కించుకొన్నాయి.
*తెలిసి ఏ తప్పూ చేయను
‘దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నిబద్ధతో అందరితో భుజం భుజం కలిపి పనిచేస్తామని హామీ ఇస్తున్నా. రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు భాజపా కట్టుబడి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం పూర్తిస్థాయిలో చేయూతనందిస్తుంది. భాజపా ఎప్పుడూ తన సిద్ధాంతాలను వదల్లేదు. ఎన్నో ఎత్తుపల్లాలను చూసినా ఎప్పుడూ వినమత్ర, వివేకం, ఆదర్శం, సంస్కారాన్ని వదిలిపెట్టలేదు’అని ప్రధాని పేర్కొన్నారు.
*50 ఏళ్లలో ఎవ్వరికీ దక్కని విజయం: అమిత్‌ షా
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడుతూ 50 ఏళ్లలో ఏ ప్రధానికీ దక్కని విజయం మోదీకి దక్కిందని అన్నారు. భవిష్యత్తులో భాజపాకు దక్కని రాష్ట్రం అంటూ ఏదీ ఉండబోదని, పశ్చిమబెంగాల్‌తో సహా అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ మహావిజయ నాయకుడు మోదీయేనని కొనియాడారు. ‘‘ఘట్‌బంధన్‌, మహాఘట్‌బంధన్‌లు ఎన్ని ఏర్పడినా భాజపా విజయాన్ని ఏమీ చేయలేకపోయాయి. దేశంలోని 17 రాష్ట్రాల ప్రజలు భాజపాకు 50%కిపైగా ఓట్లు ఇచ్చారు. 21 పార్టీల నేతలు దిల్లీలో వీధివీధి తిరుగుతూ ఒకరినొకరు కలుసుకొనే ప్రయత్నం చేశారు’’ అని చెప్పారు.
*ప్రజాతీర్పును గౌరవిస్తున్నా
ప్రజలే ప్రభువులని తాను ప్రచారంలో స్పష్టంగా చెప్పినట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. వారిచ్చిన తీర్పును సగౌరవంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. అందుకు పాత్రులైన మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో పూర్తి శక్తి సామర్థ్యాలు పెట్టి పోరాడిన కాంగ్రెస్‌ అభ్యర్థులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. మోదీ ఆలోచనా విధానం, కాంగ్రెస్‌ ఆలోచనా విధానాలకు మధ్య జరిగిన సిద్ధాంతపరమైన పోరాటం ఇది. అందులో గెలుపు మోదీ, భాజపాల పరమైంది. దేశ అవసరాలను కొత్త ప్రధాని చూసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
*తెలుగుదేశానికి జనసేన దెబ్బ
తెదేపా విజయంపై జనసేన పెను ప్రభావం చూపింది. ఆ పార్టీ అభ్యర్థులు సాధించిన ఓట్లను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని 8 లోక్‌సభ, 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వారికి వచ్చిన మెజారిటీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో జనసేన మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి రంగంలో నిలిచారు. ఇక్కడ వైకాపా అభ్యర్థికి 15881 ఓట్ల మెజారిటీ రాగా… బీఎస్పీ అభ్యర్థికి 41,816 ఓట్లు లభించడం గమనార్హం. జనసేన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు విశాఖ లోక్‌సభ అభ్యర్థి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ సాధించారు. ఆ తర్వాత అమలాపురం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌, సినీ నటుడు నాగబాబులకు వచ్చాయి.
*అమేఠీ ఖట్టా.. వయనాడ్‌ మీఠా
కంచుకోట అమేఠీలో కాంగ్రెస్‌కు అనూహ్య భంగపాటు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన 4,31,770 ఓట్లభారీ మెజారిటీతో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో కేరళ నుంచి ఇంత భారీ మెజారిటీతో విజయం సాధించిన మొదటి నేత రాహుల్‌ కావడం గమనార్హం. రాహుల్‌ తŸన సారథ్యంతో కేరళ యూడీఎఫ్‌ కూటమిలో నూతన జవసత్వాలు నింపారు. ఫలితంగా రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకు గాను 19 స్థానాలను యూడీఎఫ్‌ హస్తగతం చేసుకుంది.
*గుజరాత్‌లో మళ్లీ భాజపాకే పట్టం
గత లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో భాజపా 26 స్థానాల్లో విజయదుందుభి మోగించి సత్తా చాటింది. మోదీ- షా రథసారథ్యంలో ఈ దఫా అదే ఫలితాలను పునరావృతం చేసింది. ఈసారి కమలనాథుల విజయం నల్లేరుపై నడక కాదన్నది జగమెరిగిన సత్యం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ సారథ్యంలో కాంగ్రెస్‌ బలంగానే పుంజుకుంది. భాజపాకు గుజరాత్‌ కంచుకోట అయినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముచ్చెమటలు పట్టించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా భాజపా వాటిని తిప్పికొట్టి సమర్థమైన ఫలితాలతో ఢీ అంటే ఢీ అంది. అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఈసారి భాజపా ముందస్తుగానే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది.
*తమిళనాట డీఎంకే హవా
తమిళ ఓటర్లు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. కరుణానిధి, జయలలిత అనంతరం స్టాలిన్‌ను ద్రవిడ నేతగా గుర్తించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కనిపించింది. అధికార పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. జయలలిత తర్వాత ఆ పార్టీ పెద్దదిక్కులేనిదై పోయింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంల నాయకత్వాన్ని జనం ఆమోదించలేదు. ఈ పరిస్థితులన్నీ డీఎంకేకు కలిసి వచ్చాయి.
*మెజార్టీ స్థానాల్లో గెలిచాం
లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర ప్రజలు మెజార్టీ స్థానాల్లో తమను గెలిపించారని.. వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ప్రజలు 9 స్థానాలు కట్టబెట్టారని, ప్రజాతీర్పు తమకు శిరోధార్యమన్నారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డామన్నారు. కానీ, కొన్నిచోట్ల ఓటమి ఎదురైందని చెప్పారు. పార్టీకి స్థానాలు తగ్గడంపై సమీక్షించుకుంటామని తెలిపారు. తెరాసతో పాటు గెలిచిన కాంగ్రెస్‌, భాజపా మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం గురువారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు.
*భాజపాకు ఉత్తమప్రదేశ్‌
దేశ రాజకీయాలపై అత్యంత ప్రభావాన్ని చూపించే ఉత్తర్‌ప్రదేశ్‌ ఈసారి కూడా తన శక్తిని నిరూపించుకుంది. గత ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దేశంలో అధికారంలోకి వచ్చేందుకు దోహదపడే రీతిలో సొంతంగానే 71 స్థానాలను అందించిన యూపీ ఈసారి మిత్రపక్షాలతో కలిపి కమలనాథులకు 64 స్థానాలనే ఇచ్చినా ప్రత్యేకతను చాటుకొంది. 2014 ఎన్నికలతో పోలిస్తే సీట్లు కొంత తగ్గినమాట వాస్తవమే అయినా హస్తినలో రెండోసారి సునాయాసంగా అందలమెక్కడానికి ఇవి కీలకంగా నిలిచాయి.
*ప్రజాసేవకే నా జీవితం అంకితం
ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజాసేవకే తన జీవితం అంకితమని నిజామాబాద్‌లో ఓటమి చెందిన కల్వకుంట్ల కవిత తెలిపారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినా నిజామాబాద్‌ ప్రజలకోసం పోరాడతానని గురువారం ట్విటర్‌లో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాను పోరాటం చేశానని, ఎంపీగా నిజామాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశానని తెలిపారు. తనకు అయిదేళ్ల పాటు ఎంపీగా పనిచేసే అవకాశం ఇచ్చిన నిజామాబాద్‌ ప్రజలకు కృతజ్ఞురాలిగా ఉంటానన్నారు. తన కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అర్వింద్‌కు అభినందనలు తెలిపారు.
*కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి?
లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టనుండటంతో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభలో రాష్ట్రం నుంచి నలుగురు భాజపా ఎంపీలు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిలో సికింద్రాబాద్‌ నుంచి జి.కిషన్‌రెడ్డి, కరీంనగర్‌లో బండి సంజయ్‌, నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్‌, ఆదిలాబాద్‌ నుంచి గెలిచిన సోయం బాపురావు ఉన్నారు. ఈ నలుగురిలో కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో బెర్తు లభించడం ఖాయమన్న అభిప్రాయాలు కమలదళంలో వినిపిస్తున్నాయి.
*ధరావతు దక్కని వామపక్షాలు
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ వామపక్షాలు కనీస ప్రభావాన్ని చూపలేకపోయాయి. సీపీఐ, సీపీఎంలు చెరో రెండు స్థానాల్లో బరిలోకి దిగగా.. నాలుగింటిలోనూ ధరవాతు గల్లంతైంది. గత (2014) లోక్‌సభ, ఇటీవల (2018) శాసనసభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు విడివిడిగా పోటీ చేశాయి. రెండు సందర్భాల్లోనూ ఘోర పరాభావాన్నే చవిచూశాయి. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు సమష్టిగా చెరో రెండు స్థానాల్లో బరిలోకి దిగాయి. సీపీఐ నుంచి మహబూబాబాద్‌లో కల్లూరి వెంకటేశ్వరరావు, భువనగిరిలో గోదా శ్రీరాములు.. సీపీఎం నుంచి ఖమ్మంలో బోడ వెంకట్‌, నల్గొండలో మల్లు లక్ష్మి లోక్‌సభ అభ్యర్థులుగా పోటీపడ్డారు. అయితే 2014 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినా.. అప్పుడు సాధించినన్ని ఓట్లు కూడా ఈ దఫా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి సాధించలేకపోయాయి.
*మల్కాజిగిరిలో జనసేనకు 28,420 ఓట్లు
తెలంగాణలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలవగా మల్కాజిగిరిలో ఆ పార్టీకి అత్యధికంగా 28,420 ఓట్లు వచ్చాయి. ఖమ్మంలో 19,315, మహబూబాబాద్‌లో 9,811, సికింద్రాబాద్‌లో 9,683, ఆదిలాబాద్‌లో 5,241, నిజామాబాద్‌లో 2023 ఓట్లు వచ్చాయి. పోలైన మొత్తం ఓట్లలో నిజామాబాద్‌, సికింద్రాబాద్‌లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఒక్కశాతం కూడా లేవు. మిగిలిన నాలుగు చోట్లా ఒక్కశాతానికి మించి ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది.
*ఎంఐఎంకు ఇద్దరు ఎంపీలు
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మజ్లిస్‌ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందింది. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి విజయం సాధించింది. ఇప్పటి వరకూ పార్లమెంటులో అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రమే ప్రాతినిధ్యం వహించగా… ఇప్పుడు ఆయనతో పాటు ఔరంగాబాద్‌ ఎంపీగా గెలిచిన ఇంతియాజ్‌ జలీల్‌ సయ్యద్‌ అడుగుపెట్టనున్నారు.
*తెదేపా శిబిరంలో స్తబ్దత
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో తెదేపా శ్రేణులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగిపోయాయి. గురువారం ఉదయం ఫలితాలు రావడం మొదలైన కాసేపటికే తెదేపా శిబిరంలో స్తబ్దత నెలకొంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం, ప్రజావేదిక వద్ద నిశ్శబ్దం రాజ్యమేలింది. ప్రజావేదిక సమీపంలో నిత్యం పార్టీ నాయకుల విలేకరుల సమావేశాలతో కళకళ్లాడే మీడియా సెంటర్‌ వెలవెలబోయింది. ఎన్నికల ఫలితాలు చూసేందుకు మీడియా సెంటర్‌లో పెద్ద డిజిటల్‌ తెర ఏర్పాటు చేశారు.
*ప్రజా తీర్పు శిరోధార్యం: లోకేశ్‌
‘గత ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెదేపా ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తుంది’ అని మంత్రి లోకేశ్‌ గురువారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజా పక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్రమోదీ, జగన్‌లకు శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు.
*ప్రధాని మోదీకే ప్రజల మద్దతు: కన్నా
ప్రజలంతా భాజపాకు పట్టం కట్టారు, మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే కోరుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా నగర కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విజయోత్సవంలో ఆయన మాట్లాడారు. భాజపా వ్యతిరేక కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.
*అంతా కోల్పోయినట్లు కాదు: మమత
లోక్‌సభ ఎన్నికల్లో విజేతలకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. అయితే ఓడిపోయినవారు అంతా కోల్పోయినట్లు కాదని ఆమె పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం మొత్తం పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్‌లు సరిపోలాల్సి ఉంటుందన్నారు.
*రేపు భాజపా ఎంపీల సమావేశం.
గెలుపు సాధించిన భాజపా ఎంపీలంతా మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు శనివారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. కాగా పార్టీ పార్లమెంటరీ బోర్డు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ గురువారం తీర్మానం చేసింది. కొత్త ప్రభుత్వం ఈనెల 29న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
*కమల దళపతిదే గాంధీనగర్‌.
భాజపా కురువృద్ధుడు లాల్‌కృష్ణ ఆడ్వాణీని ఆరుసార్లు లోక్‌సభకు పంపించిన గాంధీనగర్‌ స్థానం ఈసారి కూడా పార్టీకి సంపూర్ణంగా అండగా నిలిచింది. 1991 ఎన్నికల్లో ఆడ్వాణీ తరఫున అక్కడ ప్రచార బాధ్యతలు చూసుకున్న కమల దళపతి అమిత్‌ షా ఈ ఎన్నికల్లో తానే బరిలో దిగి అటు పార్టీలోనే కాకుండా బయటి వర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించారు. చివరకు సానుకూల ఫలితాన్ని సాధించి తనకు, పార్టీకి ఉన్న పట్టును పదిలపరచుకున్నారు. ఆడ్వాణీ స్థాయిలో విజయాన్ని షా సాధించగలరా అనే అనుమానాలను పటాపంచలు చేశారు. ఆయనకు మించిన ఆధిక్యాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తొలుత పార్టీ అధ్యక్ష పదవి వరకే పరిమితమైన అమిత్‌ షాకు మోదీ రాజ్యసభ సభ్యత్వం లభించేలా చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఆయన్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పార్లమెంటులో అడుగిడేలా చేయాలన్న నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరింది.