NRI-NRT

డల్లాస్ గాంధీ స్మారకస్థలి వద్ద YVS చౌదరి తదితరులు

డల్లాస్ గాంధీ స్మారకస్థలి వద్ద YVS చౌదరి తదితరులు-TNILIVE NRI NRT america telugu movie news - Tollywood celebrities visit and pay tributes to mahatma gandhi in Dallas

అమెరికాలోని డాలస్‌లోని గాంధీ మెమోరియల్‌లో ఉన్న మహాత్మా గాంధీ అతిపెద్ద విగ్రహాన్ని మే 23న సినీ ప్రముఖులు సందర్శించి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ప్రముఖ సినీ నిర్మాత వై.వి. చౌదరి, సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, సాహత్య రచయితలు భాస్కర భట్ల, సిరా శ్రీ, ప్రముఖ కరాటే మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారుడు వివేక్‌ తేజ అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సుందరమైన ఉద్యానవనంలో ఉన్న ఈ గాంధీ మెమోరియల్‌ను ఏర్పాటు చేయడంలో విశేష కృషి చేసిన ప్రవాస భారతీయుడు, గాంధీ మెమోరియల్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రసాద్‌ తోటకూరను వారు అభినందించారు. ఎన్నో పనులున్నప్పటికీ సమయాన్ని కేటాయించి గాంధీ మెమోరియల్‌ని సందర్శించిన సినీ ప్రముఖులందరికీ మెమోరియల్‌ బోర్డు సభ్యుల తరఫున ప్రసాద్‌ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు.