DailyDose

28న గుంటూరుకు చంద్రబాబు-తాజావార్తలు–05/25

May 25 2019 - Daily Breaking News - Chandrababu returns to guntur-tnilive

* తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న గుంటూరు రానున్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించిన తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. సాధారణంగా ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై తెదేపా చర్చించింది. ఎన్నికల ఫలితాల విడుదల హడావుడి ఉంటుంది కాబట్టి జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని మాత్రం ఈ నెల 28న యథావిధిగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

* దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.899 నుంచి ఆఫర్‌ టికెట్లు విక్రయించనున్నట్లు గో ఎయిర్‌ ప్రకటించింది. జూన్‌ 15 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రయాణం కోసం అందుబాటులో ఉండేలా 10 లక్షల టికెట్లను ఈనెల 27 నుంచి 3 రోజుల పాటు విక్రయిస్తామని తెలిపింది. కనీసం 2499 లావాదేవీకి పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లిస్తే రూ.500 నగదు వెనక్కి స్తామని పేర్కొంది.

* విజయవాడ దుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌ గౌరంగ్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, ఆలయ ఈవో కోటేశ్వరమ్మకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. తనతో పాటు పాలకమండలిలోని 14 మంది సభ్యులు సైతం తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు వివరించారు. తెదేపా ప్రభుత్వం రద్దు కావడంతో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు గౌరంగ్‌బాబు వెల్లడించారు. 2017లో దుర్గగుడి ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

* 16వ లోక్‌సభ రైద్దెంది. కేంద్ర మంత్రివర్గం సూచన మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సభను రద్దుచేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా నేడు రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీల జాబితాను సునీల్‌ అరోరా… రాష్ట్రపతికి అందజేశారు.

* చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. షియోమి బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.
* మహానంది పుణ్యక్షేత్రం పరిధిలోని మహానందేశ్వరనగర్‌లో శుక్రవారం ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వచేసిన గుట్కాప్యాకెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
* ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయాన్ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శనివారంనాడు దర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బద్రీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీకి ఈ సందర్భంగా ఆయన రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంబానీకి బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ధర్మాధికారి, ఆఫీసర్ భువన్ చంద్ర ఉనియల్ తదితరులు ఆలయం వద్ద సాదర స్వాగతం పలికారు.బద్రీనాథ్‌ ఆలయంలో ప్రార్థనలు చేసిన అంబానీ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గర్భాలయంలో భగవద్గీత ప్రవచనాలను కూడా శ్రద్ధగా అలకించారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో తమిళనాడులోని శాండిల్‌వుడ్ ఆలయంలో భూమి కొనుగోలుకు కూడా అంబానీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇటీవల బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను ప్రధాని మోదీ సైతం సందర్శించారు.

*ఆరుసార్లు ప్రపంచ చంపియన్ మేరికోం ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో సత్తా చాటింది. మహిళల 51కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మేరీకోం 5-0తో వాన్లాల్ దువాతీ పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 12 బంగారు పతకాలు దక్కించుకుంది.

*ప్రభుత్వం మారిన నేపధ్యంలో గత సంప్రదాయాన్ని గౌరవిస్తూ హైకోర్టు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యుటార్ పోసాని వెంకటేశ్వర్లు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు.

*రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి కాకుండా.. 12 నుంచి బడులను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కమలదళం హైదరాబాద్‌లో శుక్రవారం విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలుత విజయోత్సవ సభ నిర్వహించిన కమలనాథులు అక్కడి నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా తరలివెళ్లారు.

*టీవీ9 సంస్థ వాటాల వివాదంలో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం సైబరాబాద్‌ పోలీసులు గాలింపు విస్తృతం చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించిన వ్యవహారంలో ఆయనపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 21న పోలీసులు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేశారు.

*రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల ఘట్టాలు ముగియడంతో రెవెన్యూశాఖ తిరిగి భూ దస్త్రాల సమస్యలపై దృష్టిసారించనుంది. 58 లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటి వరకు 55.6 లక్షల పుస్తకాలను రెవెన్యూశాఖ జిల్లాలకు పంపించింది.

* కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించి శుక్రవారం విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డులో అవగాహన ఒప్పందం కుదిరింది.

*రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల ఘట్టాలు ముగియడంతో రెవెన్యూశాఖ తిరిగి భూ దస్త్రాల సమస్యలపై దృష్టిసారించనుంది. 58 లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటి వరకు 55.6 లక్షల పుస్తకాలను రెవెన్యూశాఖ జిల్లాలకు పంపించింది.

* కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని తెలంగాణ స్పష్టం చేసింది.

*సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేస్తున్నందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)కు మరో జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది.

*తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు ఆన్‌లైన్లో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2019 శుక్రవారం ముగిసింది.

* లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీని 14 బీసీ సంఘాలు అభినందించాయి.

*విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి నేరుగా మరొక విమాన సర్వీసు ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. స్పైస్‌జెట్‌ సంస్థ బోయింగ్‌ 737-800 మోడల్‌ విమానం 156 ఎకానమీ, 12 బిజినెస్‌ క్లాస్‌ సీట్లతో ముంబయికి రోజూ విమాన సర్వీసు నిర్వహించనుంది.

*గత నెలలో జరిగిన బీడీ ఆకుల ఈ-వేలంలో బిడ్‌ను పొందినప్పటికీ, పాత బకాయిలున్నాయంటూ తిరస్కరించడంపై తెలంగాణ అటవీశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టైగర్‌ కవ్వాల్‌ అటవీ ప్రాంతంలో బీడీ ఆకుల సేకరణ నిమిత్తం ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ-వేలంలో బిడ్‌ దక్కించుకున్న తనకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ పి.సంపత్‌రెడ్డి అనే కాంట్రాక్టరు హైకోర్టును ఆశ్రయించారు.

*వికలాంగుల సంక్షేమశాఖ పరిధిలోని మలక్‌పేట ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 10 తరగతి వరకు ప్రవేశాలకు జూన్‌ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11నుంచి సాయంత్రం 4వరకు దరఖాస్తులు పొందవచ్చని, విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 040-24161000లేదా 7674933347లో సంప్రదించాలని చెప్పారు.

*తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 27 మంది ముస్లింలు ఎన్నికయ్యారు. 16వ లోక్‌సభలో వీరి సంఖ్య 23 మాత్రమే. ప్రస్తుతం ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఆరుగురు చొప్పున ముస్లింలు 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

*సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, బండి శ్రీనివాసరావు వెల్లడించారు.

*ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత సంప్రదాయాన్ని గౌరవిస్తూ హైకోర్టు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు

* తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు ఆన్‌లైన్లో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2019 శుక్రవారం ముగిసింది.

*ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత సంప్రదాయాన్ని గౌరవిస్తూ హైకోర్టు రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు

*సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో విశేష కృషి చేస్తున్నందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)కు మరో జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది.