Health

కేశ సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Hair care tips for all of you pretty women out there

తలస్నానం చేసిన తర్వాత 8 చేయాల్సినవి, చేయకూడని పనులు!జుట్టుకు తలస్నానం చేయడమనేది మన జీవితాల్లోనే, ఒక అనివార్యమైన అంశంగా చెప్పబడుతుంది. తలస్నానం వలన రిఫ్రెష్నెస్, తోడై పునరుత్తేజం కలుగుతుంది. మరియు మనం రెండవ ఆలోచన లేకుండా అనుసరించే హెయిర్ వాష్ రొటీన్ పనులు కొన్ని అదనంగా ఉంటాయి. వీటిలో కొన్ని అసంబద్దమైనవి కూడా ఉన్నాయి.మనకు అనుభవ౦లేని విషయమేమిట౦టే, మన౦ తరచుగా చేసే ఈ రొటీన్ పనులలో కొన్నిటి మూలంగా మన జుట్టు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మన జుట్టు దుమ్ము బారిన పడుతూ ఉంటుంది. క్రమంగా జుట్టును శుభ్రంగా, ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా ఉంచడానికి మనం జుట్టును తరచుగా శుభ్రం చేయడం జరుగుతుంటుంది. మరియు అందమైన జుట్టును నిర్వహించడానికి అనేక రకాల గృహ చిట్కాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటాం. క్రమంగా కొన్ని సహజసిద్దమైన ఉత్పత్తుల నుండి, మార్కెట్లో కొనుగోలు చేసే రసాయనిక ఉత్పత్తుల వరకు ఆధారపడుతాము.కానీ ఇవన్నీ ఎంతవరకు సురక్షితం? అంటే, సమాధానం కష్టం. అవునా ? కొన్ని ఉత్పత్తులలోని రసాయనాలు జుట్టు సమస్యలను తీసుకుని వస్తుంటాయి. అంతేకాకుండా, వాటితోపాటుగా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల మూలంగా కూడా మీ జుట్టు డ్యామేజ్ అయితే, అది ఊహించడానికే కష్టతరంగా ఉంటుంది. అవునా ? అవి జరగకుండా నిరోధించడం కొరకు, ఈరోజు ఈ వ్యాసంలో, మీ తలస్నానం తరువాత, చేయదగిన మరియు చేయకూడని పనుల జాబితాను మేం సంకలనం చేశాం. మరిన్ని వివరాల కొరకు వ్యాసంలో ముందుకు సాగండి.
***తలస్నానం తర్వాత చేయదగిన పనులు
1. జుట్టు మీది అదనపు నీటిని శోషించుకోవడానికి టీషర్ట్ ఉపయోగించండి
టవల్ సంగతేమిటి, అని మీరు అడగొచ్చు?, కానీ ఫ్రెష్ గా ఉన్న జుట్టు అత్యంత సున్నితంగా ఉంటుంది, క్రమంగా టవల్ జుట్టును ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఒక టవల్ ను జుట్టును డ్రై చేయడానికి వినియోగించడం మూలంగా, ఇది జుట్టు కుదుళ్ళకు హాని కలిగించవచ్చు. మరియు దీర్ఘకాలిక అలవాటు కారణంగా, ఇది పొడిబారిన మరియు పెళుసైన జుట్టుకు దారితీసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది జుట్టు విరిగిపోవడం లేదా చివరలు చిట్లడం వంటి అవకాశాలను కూడా పెంచుతుంది. క్రమంగా, జరిగిన నష్టాన్నిఅంచనా వేయడం కూడా కష్టంగా ఉండవచ్చు.వీటన్నిటినీ నివారించడం కొరకు, మీ జుట్టు నుండి అదనపు నీటిని తొలగించడానికి మరియు పొడిగా చేయడానికి ఒక పాత టీ-షర్టు వినియోగించడం ఉత్తమంగా సూచించబడుతుంది. ఒక టీ-షర్టు మీ జుట్టు మీద అత్యంత సున్నితంగా ఉంటుంది మరియు ఒక టవల్ చేసినట్లు, మీ జుట్టుకు నష్టం చేయదు. కావున, ఈసారి మీరు తలస్నానం చేసినప్పుడు, మీ టవల్ బదులుగా పాత టీషర్ట్ వినియోగించండి.
2. మీ జుట్టుకు మంచి పుష్టికరమైన సీరమ్ అప్లై చేయండి
మీరు మీ జుట్టు నుండి అదనపు నీటిని తొలగించిన తర్వాత, మీరు చేయవలసిన తదుపరి విషయం, మీ జుట్టు మీద ఒక మంచి సీరమ్ అప్లై చేయడంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తలస్నానం చేసిన జుట్టు కొంచం చిక్కుపడుతుంది. కానీ, జుట్టుమీద నీటిని తొలగించిన తర్వాత, సీరమ్ అప్లై చేయడం మూలంగా అది మృదువుగా మారుతుంది. అంతేకాకుండా, మంచి నిగారింపును జోడిస్తుంది. ఒక హెయిర్ సీరమ్ కూడా మీ జుట్టును సులభంగా చిక్కుతీయడానికి సహాయపడుతుందని గుర్తుంచుకోండి. క్రమంగా జుట్టు నష్టానికి గురికాకుండా నిరోధించగలుగుతుంది.కాబట్టి, మీ జుట్టు దాదాపు డ్రై అయిన తర్వాత, మీ అరచేతి మీద కొద్ది పరిమాణంలో సీరమ్ తీసుకుని, మీ అరచేతులను రెండింటినీ కలిపి రుద్దండి. క్రమంగా మీ జుట్టు ముందు భాగం నుండి బ్రష్ చేయడం మొదలుపెట్టి, సున్నితంగా మిగిలిన వెంట్రుకల మీద కూడా మృదువుగా రాయాలి.కానీ, సీరమ్ ఎక్కువ ఉపయోగించకండి. ఎందుకంటే ఎక్కువగా సీరం వినియోగించడం మూలంగా, మీ జుట్టు జిడ్డుగా కనిపించేలా చేస్తుంది. హెయిర్ సీరం సూపర్ మార్కెట్లలో కూడా విరివిగా దొరుకుతుంది.
3. మీ జుట్టు ద్వారా వేళ్లను పోనిచ్చి, చిక్కును తొలగించండి
మీ తడి జుట్టును మీరు మామూలు దువ్వెనను ఉపయోగించి దువ్వుతున్నారా ? అయితే, ఈ పనిని మీరు తక్షణమే ఆపండి. ఇది మీ జుట్టుకు అత్యంత హానికరంగా చెప్పబడుతుంది. మీరు మీ వేళ్ళతో చెయ్యవలసిన పనిని, మీ దువ్వెన చేయకూడదు. కానీ మీ చేతి వేళ్లను మీ జుట్టు చిక్కును తొలగించడానికి, దువ్వడానికి వినియోగించండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, అప్పుడే తలస్నానం చేసిన జుట్టు అత్యంత సున్నితమైనదిగా, మరియు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉండేలా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు నష్టానికి అనువుగా ఉంటుంది. కావున, అలా జరగకుండా ఉండాలంటే దువ్వెనను నివారించడం ఉత్తమం. పూర్తిగా జుట్టు ఆరిన తర్వాత, దువ్వెనతో దువ్వుకోవచ్చు.
4. జుట్టును గాలికి ఆరనివ్వాలి
మీరు మీ జుట్టు చిక్కును తీసిన తర్వాత, కొద్దిసేపు గాలికి ఆరనివ్వండి. జుట్టు దానికదే గాలికి పొడిగా ఆరేలా ఉండాలి. ఇది, మీ జుట్టును ఆరబెట్టుకోవడానికి ఉత్తమమైన మార్గంగా సూచించబడుతుంది. అలా చేయడం మూలంగా, మీ జుట్టు పూర్తిగా డ్రై అయ్యే సమయాని, తేమతో కూడుకుని, మృదువుగా మరియు తక్కువ చిక్కును కలిగి కనిపిస్తుంది.
***తలస్నానం తర్వాత చేయకూడని పనులు
1. జుట్టును గట్టిగా రుద్దకూడదు :
తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును బాగా రుద్దడమనేది, బ్యాడ్ ఐడియా. ఇది మీ జుట్టుకు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించగలదు. మీరు మీ జుట్టుకు తలస్నానం పూర్తి చేసిన తరువాత, మీ జుట్టులో అధికంగా ఉన్న నీటిని పిండి, తరువాత మీ టీషర్టును మృదువుగా జుట్టుకు చుట్టి ఉంచండి. తద్వారా టీషర్ట్, జుట్టు మీది అదనపు నీటిని శోషించబడడం జరుగుతుంది. మీ తడి జుట్టును గట్టిగా రుద్దడం మూలంగా మీ జుట్టు రఫ్ గా మారి, క్రమంగా జుట్టు విరిగిపోవడానికి దారితీస్తుంది. తడిగా ఉన్నప్పుడు మీ జుట్టు అధిక ఒత్తిడికి గురవడం కారణంగా, సులభంగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి, మీ జుట్టు సున్నితంగా ఉన్న సమయంలో రాపిడికి గురిచేయకండి. తడి జుట్టుతో వ్యవహరించేటప్పుడు, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
2. ఎట్టిపరిస్థితులలో జుట్టును దువ్వకూడదు
మీరు ఎప్పుడూ తడి జుట్టును దువ్వకూడదు. మీ తడి జుట్టును దువ్వెనతో దువ్వినప్పుడు, అది తీవ్ర రాపిడి మరియు ఒత్తిళ్లకులోనై జుట్టు పెళుసుగా మారడానికి కారణమవుతుంది. క్రమంగా ఇది జుట్టు నష్టానికి మరియు జుట్టు విరగడానికి దారితీస్తుంది. కాబట్టి, తెలిసి మన జుట్టును నాశనం చేసుకోవడం ఎందుకు చెప్పండి. బదులుగా, మేము పైన చెప్పినట్టు, మీ జుట్టును నెమ్మదిగా మీ వేళ్లతోనే దువ్వి చిక్కును తొలగించండి. పూర్తిగా ఆరిన తర్వాత జుట్టును దువ్వెనతో దువ్వుకోవచ్చు.
3. మీ జుట్టును పొడిగా చేయడానికి బ్లో-డ్రయర్ వినియోగించకండి
మీరు మీ జుట్టుకు తలస్నానం చేసిన ప్రతిసారీ, మీ జుట్టును పొడిగా చేయడానికి బ్లో-డ్రైయర్ ను వినియోగిస్తున్నారా? అయితే, అది ఎట్టిపరిస్థితులలోనూ ఆమోదయోగ్యం కాదు! ఏదైనా అత్యవసర పరిస్థితులలో వినియోగించడం సబబే కానీ, తరచుగా బ్లో-డ్రయర్ వాడకం జుట్టు నష్టానికి దారితీస్తుంది. వాస్తవానికి జుట్టు త్వరగా ఆరేందుకు బ్లో-డ్రయర్ వినియోగం ఉంటుంది. కానీ, తరచుగా తడిజుట్టును పొడిగా మార్చేందుకు, వేడిని దరఖాస్తు చేయడం ద్వారా, దీర్ఘకాలిక జుట్టు నష్టానికి దారితీస్తుందని చెప్పబడుతుంది.మీరు తడి జుట్టును పొడిగా చేయడానికి బ్లో- డ్రయర్ వినియోగించినప్పుడు దాని వేడి, జుట్టు మీద ఉండే తేమపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా, మీ జుట్టు పొడిగా మరియు పెళుసుగా మారుతుంది. అందువల్ల, తడి జుట్టుపై వేడిని కలుగజేయడం మంచిదికాదని గుర్తుంచుకోండి.
4. జుట్టును ముడి వేయకండి
ఈ అలవాటు అనాదిగా, అనేకమంది అనుసరిస్తున్నదే. కానీ, ఇది సరైన అలవాటు కాదని చెప్పబడుతుంది. మనం జుట్టుపరంగా చేసే అత్యంత సాధారణ పొరపాట్లలో ఇది కూడా ఒకటి. ఎన్నోసార్లు ఈ విషయం గురించి, అనేకమంది సూచిస్తున్నప్పటికీ, ఇప్పటికీ మనలో అధికశాతం ఇదే పొరపాటును చేస్తున్నారు అన్నది వాస్తవం. మీ తడి జుట్టును వాటి కుదుళ్ళను కట్టడి చేసి, ముడి చుట్టడం మూలంగా జుట్టు నష్టానికి కారణమవుతుందని చెప్పబడుతుంది. దీనితో పాటుగా, జుట్టు చిట్లడానికి కూడా దారితీస్తుంది.అంతే కాకుండా, మీరు మీ తడి జుట్టును ముడి కట్టుకున్నప్పుడు, అది మీ జుట్టును పూర్తిగా పొడిబారనివ్వదు. మరియు తడి జుట్టును ముడివేయడం మూలంగా తలలో చుండ్రు, దురద, తలలో పేలు మొదలగు సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని చెప్పబడుతుంది.మీరు మీ జుట్టును ముడి చుట్టినప్పటికీ, దాని గుండా గాలి ప్రవహించేలా బాగా వదులుగా కడుతున్నారని నిర్ధారించుకోండి.