Movies

మహాన్సిక

hansika simbu new movie maha updates

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఇందులో హన్సికతో కలిసి శింబు కూడా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం వికటించడంతో విడిపోయారు. ఇప్పుడు చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరుపై మదియళగన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత మదియళగన్‌ మాట్లాడుతూ.. ఇందులో ముఖ్యమైన పాత్రలో శింబు కనిపిస్తారు. ఎనిమిది రోజుల పాటు చిత్రీకరణను నిర్వాహించాలని అనుకున్నాం. ఒక రోజు ఐదు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉంది. అందువల్ల రోజంతా ఎంతో హడావుడిగా చిత్రీకరిస్తున్నాం. రాత్రి పూట కూడా షూటింగ్‌ చేస్తున్నాం. ఇటీవల శింబు, హన్సికలకు సంబంధించిన ఓ పాటను తెరకెక్కించాం. అలాగే ప్రేమ, పార్టీ, బ్రేకప్‌, మళ్లీ ప్రేమ.. వంటి సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. ఆ తర్వాత చివరగా పోరాట సన్నివేశంలో శింబు నటిస్తారు. దీంతో చిత్రీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. లక్ష్మణన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.