Devotional

కొండగట్టుకు భారీగా భక్తులు

May 29 2019 - Daily Devotional News - Kondagattu flooded with devotees

1. కొండగట్టుకు పోటెత్తుతున్న భక్తులు – తదితర ఆద్యాత్మిక వార్తలు
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం హనుమాన్‌ పెద్ద జయంతి ఉండటంతో లక్షలాదిగా దీక్షాపరులు కొండకు చేరుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ మరింత పెరిగింది. భద్రాచలం శ్రీరామచంద్రుని ఆలయం నుంచి వేదపండితులు పట్టువస్త్రాలు, ప్రసాదం తీసుకువచ్చారు. బుధవారం స్వామివారికి వస్త్రాలంకరణ చేయనున్నారు.
2. అర్ధంతరంగా ముగిసిన తితిదే సమావేశం
తిరుమల, తిరుపతి దేవస్థానం(తితిదే) ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నాటకీయ పరిణామాల మధ్య అర్ధంతరంగా ముగిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించిన ఈ సమావేశం పలువురు సభ్యుల అభ్యంతరాలు, ఆక్షేపణలు, కొందరి రాజీనామాలతో కొద్దిసేపు వేడెక్కింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమైన వెంటనే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఇతర సభ్యులు ప్రార్థన చేశారు. అనంతరం మండలి సభ్యులు పొట్లూరి రమేష్‌బాబు తన రాజీనామా పత్రాన్ని ఈవో సింఘాల్‌కు సమర్పించారు. తితిదే సభ్యులుగా అవకాశమిచ్చిన ఆపద్ధర్మ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. తమ మండలిని అవమానించారని, కొత్తగా వచ్చే పాలకమండలికి ఇలా జరగకుండా చూడాలంటూ ఉన్నతాధిÅకారులను కోరారు. ఇకనైనా మార్పు తెచ్చుకోవాలంటూ వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఇతర సభ్యులు సముదాయించారు. అందరం ఒకేసారి వెళ్లిపోదామంటూ పొట్లూరిని వారు కూర్చోబెట్టారు. ఇటీవల దర్శనాలకు, బసకు తాము సిఫార్సు చేసిన లేఖలను పరిగణనలోకి తీసుకోకపోవడం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మరో సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను కూడా రాజీనామా చేస్తున్నటు ప్రకటించారు.
3 అంజన్నకు కదళీఫలాలతో అలంకరణ
హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా సారవకోట బస్టాండ్‌ ఆవరణలోని అభయాంజనేయస్వామిని జైహనుమాన్‌ భక్తసమాజం సభ్యులు మంగళవారం కదళీఫలాలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 30న జరిగే అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులకు ఈ కదళీఫలాలను ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్లు భక్తసమాజం సభ్యులు తెలిపారు.
4. శ్రీవారిని దర్శించుకున్న జగన్‌
తిరుమల శ్రీవారిని వైకాపా అధ్యక్షుడు జగన్‌ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న కాబోయే సీఎం జగన్‌కు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకాపా ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, రోజా, సామినేని ఉదయభాను, పలువురు సీనియర్‌నేతలు జగన్‌తో పాటు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
5. ఇక నుంచి ముత్తంగి రూపంలో నరసింహస్వామి
భద్రాచలం రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఇక నుంచి ప్రతీ శనివారం ముత్తంగి రూపంలో దర్శనం ఉంటుందని వైదిక పెద్దలు తెలిపారు. నాణ్యమైన ముత్యాలతో పొదిగిన వస్త్రాలను నిపుణులు రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు వీటిని ఇటీవల నరసింహస్వామి కల్యాణోత్సవంలో అందించారు. ఇందుకు రూ.లక్ష వరకు వెచ్చించినట్లు భావిస్తున్నారు. వీటిని ఏ రోజు అలంకరించాలనేది సమాలోచనలు చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. గోదావరికి వెళ్లే మార్గంలో చప్టా దిగువన ఉన్న ఈ కోవెలలో ప్రతీ శనివారం అభిషేకం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇక నుంచి అదే రోజు అభిషేకం తర్వాత ముత్తంగి రూపంలో లక్ష్మీనరసింహుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ అలంకారంలో దర్శనం చేసుకుంటే అంతా శుభమేనని అర్చకుడు సౌమిత్రి శ్రీనివాస్‌ తెలిపారు. రామాలయంలో ప్రతీ సోమవారం మూలవిరాట్‌ ముత్తంగి రూపంలో దర్శనం ఇస్తుండగా శనివారం నరసింహుడికి ఈ అలంకారం ఏర్పాటు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగతా అనుబంధ ఆలయాలపై కూడా ఇదే తరహాలో అధికారులు దృష్టి సారించాల్సి ఉంది
6. రామగుండం ప్రాంతంలో హనుమాన్‌ జయంతి
హనుమాన్‌ జయంతి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు హనుమాన్‌ దేవాలయాల్లో జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జయంతి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గౌతమీ నగర్‌లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేదపండితులు మురళీధర్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఫెటిలైజర్‌ సిటీలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ పూజారి అశోక్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
7. కడప దర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు
ఏపీకి కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కడప పెద్ద దర్గాను సందర్శించి చాదర్‌ సమర్పించారు. జగన్‌కు పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మతపెద్దలు సాంప్రదాయరీతిలో జగన్‌కు తలపాగా చుట్టారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
8. వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అల్పాహారం తీసుకున్న తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి బయల్దేరారు. ఆసమయంలో పద్మావతి అతిథిగృహం వద్ద కాబోయే సీఎం జగన్‌ కాన్వాయ్‌కు ఓ మహిళ అడ్డుపడింది. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పక్కకు లాగారు. ఆ పెనుగులాటలో మహిళ చేతికి స్వల్పగాయమైంది. ఇది గమనించిన జగన్‌ వాహనం ఆపి మహిళతో మాట్లాడారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు
9. చరిత్రలో ఈ రోజు మే, 29
సంఘటనలు
1947 :రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ చర్చి, బిషప్ గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
1953: టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీ లు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.
జననాలు
1900: బి.ఎస్.మాధవరావు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)
1903: బాబ్ హోప్, ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి. (మ.2003)
1906: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
1917: జాన్ ఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
1925: భండారు సదాశివరావు, ప్రముఖ రచయిత, సంపాదకుడు, ఆర్.ఎస్.ఎస్. ప్రచారకుడు. (మ.2010)
1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ప్రముఖ కవి, సంపాదకుడు.
1947: రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా, (అమెరికాలోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్).
1952: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018)
1980: ఉష (గాయని), తెలుగు నేపథ్య గాయని.
మరణాలు
1829: హంఫ్రీ డేవీ, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
1928: కల్లూరి వేంకట రామశాస్త్రి, ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
1964: వఝల సీతారామ శాస్త్రి, ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
1972: పృథ్వీరాజ్ కపూర్, ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
1975: నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939)
1987: పి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)
1987: చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (జ.1902)
1994: అరిక్ హునేకర్, తూర్పు జర్మనీ మాజీ అధినేత.
1996: వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904)
2018: ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)
పండుగలు మరియు జాతీయ దినా
_మౌంట్ ఎవరెస్టు దినోత్సవం.
_అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం.
_ప్రపంచ జీర్ణ ఆరోగ్యం దినం.
10. శుభమస్తు – నేటి పంచాంగం 29-05-2019 (బుధవారం)
వికారినామ సంవత్సరం వైశాఖ మాసము కృష్ణపక్షము ఉత్తరాయనము
తిథి: దశమి మ.03:21 వరకు
తదుపరి ఏకాదశి రేపు 04:38 వరకు
నక్షత్రము: ఉత్తరాబాద్రపద రా.09:18 వరకు
అమ్రుతకాలం : సా.04:00 – 05:45
సూర్యోదయం…………..ఉ.05:38
సూర్యాస్తమయం………సా.06:31
రాహుకాలం….:మ.12:00 – 01:30
యమగండం ..: ఉ.07:30 – 09:00
దుర్ముహూర్తం: మ. 12:04 – 12:51
గుళిక : ………..ఉ. 10:30 – 12:00