Food

వేసవిలో చల్లచల్లని పుల్లపుల్లని దానిమ్మ ఫలూదా

Pomegranate Faluda For Summer Relaxation

కావల్సినవి: దానిమ్మరసం – పావుకప్పు, దానిమ్మ గింజలు – అరకప్పు, నానబెట్టిన సబ్జాగింజలు – రెండు పెద్ద చెంచాలు, గడ్డ పెరుగు – కప్పు, పిస్తా పలుకులు – కొన్ని.
తయారీ: దానిమ్మరసంలో సబ్జాగింజలూ, దానిమ్మగింజలు వేసుకుని కలపాలి. ఈ రసాన్ని రెండు మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. సబ్జాగింజలు నానాయనుకున్నాక ఇవతలకు తీయాలి. గ్లాసులో ముందుగా దానిమ్మ రసంతో సహా నానబెట్టిన సబ్జాగింజలు, దానిమ్మగింజలు కొద్దిగా వేయాలి. దానిపై పెరుగు వేయాలి. ఇలా మరోవరుస చేసుకుని పైన కొన్ని పిస్తా పలుకులు వేసుకుంటే చాలు. కావాలనుకుంటే చెర్రీపండ్లు అలంకరించుకోవచ్చు.